అన్వేషించండి

Marriage Course: ఆ యూనివర్సిటీలో మ్యారేజ్ కోర్స్ కూడా ఉంది, సిలబస్ ఏముంటుందంటే?

Marriage Degree Course: చైనాలోని ఓ యూనవర్సిటీలో డిగ్రీలో కొత్తగా మ్యారేజ్ కోర్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. పెళ్లితో పాటు అనుబంధంగా ఉన్న పరిశ్రమల అభివృద్ధికి ఈ కోర్స్ పెట్టినట్టు యూనివర్సిటీ వెల్లడించింది.

Marriage Course in Degree: చైనాలో కొత్తగా పెళ్లి కోర్స్ తీసుకొచ్చారు. యూజీలోనే మ్యారేజ్ కోర్స్ (Marriage Course in China) ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించింది. మ్యారేజ్‌ ఇండస్ట్రీకి అనుబంధంగా ఉన్న పరిశ్రమల్ని అభివృద్ధి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది చైనాలోని Civil Affairs University. అయితే..సోషల్ మీడియాలో మాత్రం ఈ నిర్ణయంపై అసహనం వ్యక్తమవుతోంది. అసలు పెళ్లే వద్దురా బాబు అనుకుంటుంటే ఈ కోర్స్ పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగమంటూ మండి పడుతున్నారు. అయితే...ఈ సెప్టెంబర్ నుంచి ఈ కోర్స్ అందుబాటులోకి తీసుకొస్తామని యూనివర్సిటీ ప్రకటించింది. ప్రస్తుతం చైనాలో జనాభా తగ్గిపోతోంది. పైగా పెళ్లిళ్లూ తగ్గిపోతున్నాయి. వరుసగా రెండేళ్లు జనాభా తగ్గిపోయింది. జనన రేటు బాగా పడిపోయింది. ఇక్కడ సమస్య ఏంటంటే...ఎవరైనా పిల్లల్ని కంటే వాళ్లు కచ్చితంగా తమ మ్యారేజ్ సర్టిఫికేట్‌ని ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలి. ఆ పుట్టిన బిడ్డకీ రిజిస్ట్రేషన్ చేయించాలి. ఇదంతా చేస్తే కానీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు వర్తించవు. ఒంటరి మహిళలు, LGBTQ జంటలకు మాత్రం ఈ చట్టం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో  Marriage Services and Management పేరుతో యూనివర్సిటీ కొత్త కోర్సు తీసుకురావడంపై అసహనం వ్యక్తమవుతోంది. మ్యారేజ్ ఇండస్ట్రీని పూర్తి స్థాయిలో విస్తరించాలన్నదే తమ లక్ష్యం అని ఆ యూనివర్సిటీ స్పష్టం చేసింది. (Also Read: Supreme Court: ఎలక్టోరల్ బాండ్స్‌పై సిట్ విచారణ జరిపించాలని పిటిషన్‌లు, తిరస్కరించిన సుప్రీంకోర్టు)

విద్యార్థులకు కుటుంబ విలువలు తెలియజేస్తామని యూనివర్సిటీ వెల్లడించింది. ఈ పరిశ్రమతో అనుబంధంగా ఉన్న ఇతరత్రా పరిశ్రమలను ఏ విధంగా అభివృద్ధి చేయాలన్నది వాళ్లకు అవగాహన కల్పిస్తామని తెలిపింది. మొత్తం 12 ప్రావిన్స్‌లలో 70 మంది విద్యార్థులకు ఈ కోర్సులో అడ్మిషన్ ఇస్తామని కూడా ప్రకటించింది. ఫ్యామిలీ కౌన్సిలింగ్, హై ఎండ్ వెడ్డింగ్ ప్లానింగ్‌ సెక్టార్‌లపైనా అవగాహన పెరిగేలా కోర్సులు తీసుకొస్తామని వివరించింది. గతంతో పోల్చుకుంటే 2023లో చైనాలో పెళ్లిళ్ల రేటు కాస్తంత మెరుగు పడింది. 12.4% మేర పెళ్లిళ్లు ఎక్కువగా జరిగాయని అక్కడి డేటా చెబుతోంది. దాదాపు దశాబ్ద కాలంగా ఇక్కడ పెళ్లిళ్లు తగ్గుతూ వస్తున్నాయి. కొవిడ్ కారణంగా దాదాపు మూడేళ్ల పాటు మ్యారేజ్ ఇండస్ట్రీపై ప్రభావం పడింది. చాలా మంది పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. పైగా అక్కడ ఆదాయం కూడా తగ్గిపోతోంది. యువతీ యువకులకు పెద్దగా సంపాదన ఉండడం లేదు. తమను తాము పోషించుకోవడమే కష్టంగా ఉంది. ఇక పెళ్లి చేసుకుని కుటుంబ బాధ్యతలన్నీ మోయాలంటే భయపడుతున్నారు. 

ఈ కోర్స్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంత మంది సెటైర్లు కూడా వేస్తున్నారు. మ్యారేజ్ ఏజెన్సీ పెట్టుకుంటే బెటరేమో అని కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఇండస్ట్రీ పని అయిపోయిందనుకుంటుంటే ఈ కోర్స్ పెట్టి ఏం చేస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతుంటే మ్యారేజ్ ఇండస్ట్రీని పెంచి పోషించాలంటారంటే అని ఇంకొందరు మండి పడుతున్నారు. 

Also Read: Mysterious Deaths: 20 రోజుల్లో 13 మంది చిన్నారులు మృతి, షెల్టర్ హోమ్‌లో అంతు చిక్కని మిస్టరీ

టాప్ హెడ్ లైన్స్

Jemimah Injury Shock: జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
IND vs SL Galle Test: గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget