అన్వేషించండి

Mysterious Deaths: 20 రోజుల్లో 13 మంది చిన్నారులు మృతి, షెల్టర్ హోమ్‌లో అంతు చిక్కని మిస్టరీ

Delhi News: ఢిల్లీలోని షెల్టర్ హోమ్‌లో 20 రోడుల్లో 13 మంది చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనమవుతోంది. ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.

Mysterious Deaths in Shelter Home: ఢిల్లీలో దివ్యాంగుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెల్టర్‌ హోమ్‌లో 13 మంది చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన ఢిల్లీ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్‌ జరిపిన విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత 20 రోజుల్లో 13 మంది పిల్లలు ఇలా చనిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ 27 మంది చనిపోయినట్టు విచారణలో తేలింది. రోహిణిలోని ఆశా కిరణ్ షెల్టర్ హోమ్‌లో ఈ మరణాలు నమోదవుతున్నట్టు అధికారులు గుర్తించారు. దివ్యాంగ చిన్నారులను పట్టించుకోకుండా వదిలేస్తున్నారని, నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలా చనిపోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే..ఇప్పటి వరకూ ఈ మరణాలకు కారణమేంటన్నది తెలియలేదు. గతేడాదితో పోల్చి చూస్తే ఈ సారి ఎక్కువ మరణాలు నమోదయ్యాయి. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లు వచ్చిన తరవాతే ఇందుకు కారణమేంటన్నది తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే...అక్కడ పిల్లలకు అందించే తాగునీటిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహిళా కమిషన్ కూడా ఈ మరణాల్ని తీవ్రంగా పరిగణించింది. నిజానిజాలు తేల్చేందుకు ప్రత్యేకంగా ఓ టీమ్‌ని పంపించింది. ఆప్ ప్రభుత్వంపై తీవ్రంగా మండి పడింది. 

"ఢిల్లీ ప్రభుత్వమే ఈ షెల్టర్ హోమ్‌ని ఎన్నో ఏళ్లుగా నడిపిస్తోంది. ఇక్కడి చిన్నారులు ఆశ వదులుకుని బతకాల్సి వస్తోంది. చిన్నారులు అల్లాడి పోతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అందుకే ప్రత్యేకంగా మా తరపున టీమ్‌ని పంపించాం. పూర్తి వివరాలు సేకరిస్తున్నాం"

- రేఖా శర్మ, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్

ఈ అంశంపై ఢిల్లీ మంత్రి అతిశి స్పందించారు. ఈ స్థాయిలో మరణాలు నమోదై ఉండకపోవచ్చని వాదించారు. అడిషనల్ చీఫ్ సెక్రటరీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. వెంటనే విచారణ మొదలు పెట్టాలని తేల్చి చెప్పారు. 48 గంటల్లోగా రిపోర్ట్ రెడీ చేయాలని స్పష్టం చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి 14 మంది చనిపోయారని అతిశి వెల్లడించారు. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలంట సలహాలు అడిగారు. అటు బీజేపీ మాత్రం ఈ వాదనల్ని కొట్టి పారేస్తోంది. అక్కడి పిల్లలకు స్వచ్ఛమైన నీళ్లు, ఆహారం అందించడం లేదని ఆరోపిస్తోంది. ఈ మరణాలకు కారణమైన అధికారులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

అటు ఆప్ మాత్రం బీజేపీపై మండి పడుతోంది. ఇటీవల ఓ తల్లి కొడుకులు ప్రమాదవశాత్తు కాల్వలో పడి చనిపోయారని, వాళ్ల కుటుంబాన్ని కనీసం పరామర్శించేందుకు ఒక్క బీజేపీ నేత కూడా వెళ్లలేదని విమర్శించింది. కేవలం ఆప్‌ ప్రభుత్వాన్ని నిందించేందుకే ఈ విషయంపై రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అనవసరపు ప్రచారాలు మానుకోవాలని, ప్రభుత్వం కచ్చితంగా విచారణ జరిపి తీరుతుందని ఆప్ నేతలు తేల్చి చెప్పారు. ఎప్పటికీ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. 

Also Read: Himachal Pradesh: హిమాచల్ ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్‌లు, రెడ్ అలెర్ట్ జారీ చేసిన IMD - గల్లంతైన వారి కోసం గాలింపు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Embed widget