![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Chhattisgarh Working Days: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఇక వారానికి 5 రోజులే పని దినాలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు శుభావార్త చెప్పింది ఛత్తీస్‌గఢ్ సర్కార్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇక వారంలో 5 రోజులు మాత్రమే పనిదినాలుగా ప్రకటించింది.
![Chhattisgarh Working Days: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఇక వారానికి 5 రోజులే పని దినాలు Chhattisgarh New Rules State Govt Employees Work 5-Days week From Now announcements occasion Republic Day 2022 Chhattisgarh Working Days: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఇక వారానికి 5 రోజులే పని దినాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/18/7e1aff83d46a4b665384b11762c2dad3_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఛత్తీస్‌గఢ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 5 రోజులు మాత్రమే పని దినాలుగా ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం భూపేశ్ బఘేల్ ఈ మేరకు ప్రకటించారు.
State govt employees to work 5-days a week from now. For pension, state's contribution to be increased from 10% to 14% as part of Anshdayi Pension Scheme: Chhattisgarh Govt in a slew of announcements on the occasion of Republic Day pic.twitter.com/tcQrsiRoAC
— ANI (@ANI) January 26, 2022
आज गणतंत्र दिवस के पावन अवसर पर प्रदेशवासियों के लिए की गई महत्वपूर्ण घोषणाएँ आप अभी के साथ साझा कर रहा हूँ। 🇮🇳#RepublicDay pic.twitter.com/8jjcYzPoCq
— Bhupesh Baghel (@bhupeshbaghel) January 26, 2022
అలానే రాష్ట్ర పింఛను పథకంలో భాగంగా ప్రభుత్వ వాటాను 10% నుంచి 14% పెంచింది ఛత్తీస్‌గఢ్ సర్కార్. ఈ సందర్భంగా దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం భూపేశ్ బఘేల్.
అక్కడ 4.5 రోజులే..
యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) కూడా ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. వారంలో 4.5 రోజులు పని చేసి రెండున్నర రోజులు సెలవు తీసుకోమని ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.
కొత్త ఏడాది నుంచి..
2022 జనవరి 1 నుంచి యూఏఈ వ్యాప్తంగా వారంలో నాలుగున్నర రోజులు మాత్రమే పని దినాలుగా పెట్టారు. శుక్రవారం మధ్యాహ్నం, శనివారం, ఆదివారం ఇక వీకెండ్ సెలవలుగా పరిగణించారు. ఫెడరల్ ప్రభుత్వ విభాగాలన్ని దీనికి అంగీకరించినట్లు యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది.
అంతకుముందు యూఏఈలో శనివారం, ఆదివారం సెలవలుగా ఉన్నాయి. ఈ కొత్త ఏడాది నుంచి శుక్రవారం మధ్యాహ్నం నుంచే వీకెండ్ ప్రారంభమైంది.
Also Read: హ్యాపీ రిపబ్లిక్ డే.. దేశభక్తిని రగిలించే ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు తెలపండిలా..
Also Read: Happy Republic Day 2022: భారత రాజ్యాంగం గురించి ఈ 12 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)