Cheetah Helicopter Crash: ఆర్మీ చీతా హెలికాప్టర్ క్రాష్- పైలట్ మృతి!
Cheetah Helicopter Crash: ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్‌లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ పైలట్ మృతి చెందారు.
![Cheetah Helicopter Crash: ఆర్మీ చీతా హెలికాప్టర్ క్రాష్- పైలట్ మృతి! Cheetah Helicopter Crash Indian Army Cheetah Chopper Crashed Near Tawang Area Arunachal Pradesh One pilot Dead Cheetah Helicopter Crash: ఆర్మీ చీతా హెలికాప్టర్ క్రాష్- పైలట్ మృతి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/05/3a5e55ed288602e837930b1d6c2b326b1664971846595218_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Cheetah Helicopter Crash: భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్‌లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ జరిగింది
తవాంగ్ ప్రాంతంలో చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డారు. బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడ్డ ఇద్దరు పైలట్లను సమీపంలోని సైనిక ఆస్పత్రికి తరలించారు. అందులో లెఫ్టినెంట్ కర్నల్ సౌరభ్ యాదవ్ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరో పైలట్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.
సంతాపం
Tragic news coming from Tawang District in Arunachal Pradesh about an Indian Army Cheetah Helicopter crash. Praying for the survival of the pilots 🙏 pic.twitter.com/I6uhldhPbI
— Kiren Rijiju (@KirenRijiju) October 5, 2022
Also Read: Nobel Prize 2022 Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
Also Read: RSS chief: 'ఓ జనాభా విధానం ఉండాల్సిందే'- RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)