ChatGPT Down: ఆగిపోయిన చాట్ జీపీటీ - ఏం జరిగింది ?
ChatGPT Down: చాట్ జీపీటీ డౌన్ కావడం సంచలనంగా మారింది. దీన్ని వాడుతున్న మిలియన్ల మంది ఇబ్బందులకు గురయ్యారు.
![ChatGPT Down: ఆగిపోయిన చాట్ జీపీటీ - ఏం జరిగింది ? ChatGPT Down OpenAI Chat Bot Outage Users Report Glitch ChatGPT Down: ఆగిపోయిన చాట్ జీపీటీ - ఏం జరిగింది ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/23/49896a7347db138f4298c6ccd19484701737636616728228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ChatGPT Down OpenAI Chat Bot Outage Users Report Glitch: గురువారం నాడు ChatGPTలో భారీ అంతరాయం ఏర్పడింది. హఠాత్తుగా పని చేయడం మానేసింది. దీని వలన ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఇబ్బంది పడ్డారు. విస్తృతంగా ఉపయోగించే AI ఆధారిత చాట్‌బాట్ అయిన ChatGPT వెబ్ సర్వర్ పని చేయలేదు. ఇది వెబ్‌సైట్ సర్వర్ కమ్యూనికేషన్‌లో సమస్య ఉందని సూచిస్తోంది. దీనిపై ఇంకా ఓపెన్ ఏఐ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
చాట్ జీపీటీ .. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లో ఓ సంచలనం. ప్రారంభమైన అనతి కాలంలోనే అన్ని విభాగాల్లోకి చొచ్చుకుపోయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ చాట్ జీపీటీని వాడే ప్రయత్నం చేస్తున్నారు.చాట్ జీపీటీ డౌన్ కావడంపై ఎక్స్ లో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
Bruh ChatGPT is down again??? During the work day?
— Mustafa (@KingMusss) January 23, 2025
So you’re telling me I have to… THINK?! pic.twitter.com/vXGWjGzJMq
చాట్ జీపీటీ ఎందుకు ఆగిపోయిందో తెలుసుకనేందుకు యూజర్లంతా ఎక్స్ కు పరుగులు పెడుతున్నారని కొంత మంది జోకులు వేస్తున్నారు.
Everyone right now going to X/twitter to see if #ChatGPTdown pic.twitter.com/llBzR2BNMb
— Amit Dhayal (@AmitDhayalrj18) January 23, 2025
అయితే ఇదే తొలి సారి కాదని తరచుగా డౌన్ అవుతోందని కొంత మంది కంప్లయింట్ చేస్తున్నారు.
IS CHATGPT DOWN AGAIN ARE YOU KIDDING I WAS WORKING ON MY ESSAY pic.twitter.com/CxtrmUyq3A
— mateo (@BBT0_) January 23, 2025
చాట్ జీపీటీ డౌన్ అయిందని.. ఇప్పుడు బ్రెయిన్ వాడాల్సిన సమంయ వచ్చిందని కొంత మంది హిలేరియస్ కామెంట్స్ పెడుతున్నారు.
POV: ChatGPT IS DOWN AND IM FORCED TO USE MY BRAIN AGAIN 💀 #ChatGPTdown pic.twitter.com/8XDXungBbW
— 𝕊𝔸𝕄𝕀 (@ADF_SAMI) January 23, 2025
ChatGPT is down, but wait.. their API too, so a lot of AI apps that rely on OpenAI / ChatGPT are also down 🥲 pic.twitter.com/Da9Ka53iBq
— ECALL (@0xecall) January 23, 2025
ChatGPT ఏఐ ఆధారిత మెషిన్ లెర్నింగ్ చాట్ బాట్. చాట్ GPT అంటే చాట్ జనరేటివ్ ప్రీట్రైన్డ్ ట్రాన్స్‌ఫార్మర్. దీన్ని అభివృద్ధి చేసిన కంపెనీ పేరు ఓపెన్ ఏఐ. ఇది వినియోగదారు అడిగిన ప్రశ్నలను అర్థం చేసుకుని పూర్తి వివరాలతో సమాధానాన్ని సిద్ధం చేసి అందజేస్తుంది.
Chat GPT నవంబర్ 30, 2022న ప్రారంభించారు. GPT వంటి చాట్ బాట్‌లు పెద్ద మొత్తంలో డేటా, కంప్యూటింగ్ టెక్నాలజీల ద్వారా సమాచారాన్ని సేకరిస్తాయి. పదజాలాన్ని ఉపయోగించడమే కాకుండా, పదాలను సరైన సందర్భంలో ఉపయోగిస్తుంది. Google, Metaతో సహా ఇతర సాంకేతిక సంస్థలు కూడా ఇటువంటి ప్రోగ్రామ్‌లను ఉపయోగించి ప్రశ్నలకు సమాధానమిచ్చే నమూనాలను అభివృద్ధి చేశాయి. అదే సమయంలో ఓపెన్ AI ద్వారా అభివృద్ధి చేసిన చాట్ GPT ఇంటర్‌ఫేస్ సాధారణ ప్రజలకు నేరుగా అందుబాటులో ఉంటుంది. లాంఛ్ చేసిన అనతి కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించేలా మారిపోయింది. ఇప్పుడు సమస్యలు రావడం వల్ల అందుకే అలజడి కనిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)