Top Headlines Today: రూల్స్ తెలుసుకోవాలంటూ జగన్‌కు మంత్రి పయ్యావుల కౌంటర్! ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అధిష్ఠానం నుంచి కాల్ - నేటి టాప్ న్యూస్
Andhra Pradesh Telangana Latest News 26 June 2024: నేటి ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. ఒక్క క్లిక్ చేస్తే 5 ప్రధాన వార్తలు ఒకేచోట మీకోసం.
వలసల సంక్షోభంలో బీఆర్ఎస్ - నింపాదిగా కేసీఆర్ - వ్యూహమా ? నిర్లక్ష్యమా ?
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాలు మరింత డైనమిక్‌గా మారిపోయాయి. భారత రాష్ట్ర సమితి ఒక్క ఎంపీ స్థానం కూడా గెలుచుకోకపోవడం మెజార్టీ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడంతో ఆ పార్టీ భవిష్యత్‌పై నేతల్లో ఆందోళన ప్రారంభమయింది. లోక్ సభ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చూస్తే అసెంబ్లీ స్థానాల్లో కేవలం మూడు అంటే మూడు స్థానాల్లో మాత్రమే ఆధిక్యత లభించింది. వ్యూహాత్మకంగా బీజేపీకి బీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చిందన్న ఓ ప్రచారం ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కేబినెట్ హోదా కోసమే - రూల్ బుక్ చదువుకోవాలి - జగన్‌కు పయ్యావుల స్ట్రాంగ్ కౌంటర్
జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా తాము కాదని ప్రజలే ఇవ్వలేదని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ రాసిన లేఖపై స్పందించారు. జగన్‌మోహన్ రెడ్డి తప్పుడు సమాచారంతో లేఖలు రాశారని ఆయన రూల్ బుక్ చదవాలని సూచించారు. ఆయన చదవకపోతే మనుషుల్ని పెట్టి చదివించుకోవాలన్నారు. లేఖ రాసిన సలహాదారుడ్ని కూడా మార్చుకోవాలని అందులో అన్నీ తప్పులే ఉన్నాయన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
రేవంత్ రెడ్డి దూకుడు పార్టీని, ప్రభుత్వాన్ని దెబ్బ తీస్తోందా ? ఈ రెండు ఉదాహరణలు చాలవా?
క్రికెట్ లో గాని... మరే ఇతర రంగంలో అయినా దూకుడు అనేది కొన్నిసార్లు సక్సెస్ ఫార్ములా అవుతుంది. మరికొన్ని సార్లు పెద్ద దెబ్బే తగిలేలా చేస్తోంది. రాజకీయ రంగంలో కూడా అంతే. దూకుడు రాజకీయాలు కొన్నిసార్లు ప్రత్యర్థుల మైండ్ బ్లాంక్ చేస్తాయి. కొన్ని సార్లు ఆ దూకుడు నిర్ణయాలే ప్రత్యర్థులకు అస్త్రాలుగా మారతాయి. ఇక తెలంగాణ పాలిటిక్స్ విషయాలకు వస్తే.. సీఎం రేవంత్ రెడ్డి అంటే ఓ దూకుడు స్వభావం ఉన్న రాజకీయ నేత. ఆ స్వభావమే రేవంత్ రెడ్డిని సీఎం పీఠం ఎక్కించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఏపీలో తర్వాత తరం రాజకీయం ఎవరిది ? మిత్రులెవరు ? ప్రత్యర్థులెవరు ?
2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మేలి మలుపును తిప్పాయి. సూపర్ సీనియర్ అయిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ఉండవచ్చు కానీ రాజకీయాల్ని మలుపు తిప్పింది. ఇప్పుడు ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది యువనేతలే. కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు.. రాజకీయంగా ఎదురుదెబ్బలు తిన్నా ముందడుగు వేసిన వారు అనేక మంది యువనేతలు ఈ సారి అటు లోక్ సభలో.. ఇటు అసెంబ్లీలో అడుగు పెట్టారు. ముందు ముందు 1980 బ్యాచ్ పొలిటీషియన్లు అంతా సైడ్ కానున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తిరుగుబాటు జెండా ఎగరేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అధిష్ఠానం నుంచి కాల్
తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం రేపిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన ఢిల్లీ బయల్దేరి వెళ్తున్నారు. గత రెండు రోజులుగా తెలంగాణ సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ టైంలో రాష్ట్రంలో జీవన్ రెడ్డి హడావుడి చేయడంతో కొంత గందరగోళం నెలకొంది. దీంతో జోక్యం చేసుకున్న అధినాయకత్వం ఆయన్ని ఢిల్లీకి పిలిచింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారా ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ ఫోన్ చేసి ఢిల్లీ రావాలని కబురు పెట్టారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి