CDS Chopper Black Box: పేరుకే 'బ్లాక్ బాక్స్'.. కానీ కలర్, కథ వేరుంటది.. నిజం తేలాలంటే ఇదే కావాలి!

సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై ఇప్పటికే త్రివిధ దళాలు సంయుక్త దర్యాప్తు చేపట్టాయి. అసలు ప్రమాదం ఎలా జరిగిందో తెలియాలంటే 'బ్లాక్స్ బాక్స్' ముఖ్యం. అసలు దీని కథేంటో చూద్దామా?

FOLLOW US: 

బ్లాక్ బాక్స్.. సాధారణంగా విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు జరిగినప్పుడు మనకు ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో మళ్లీ ఈ బ్లాక్ బాక్స్ పేరు వినిపించింది. ఈ ప్రమాద కారణాలు తెలియాలంటే ఈ బ్లాక్ బాక్స్ గుట్టువిప్పాల్సిందే. సీడీఎస్ ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదానికి గురైన స్థలానికి 30 అడుగుల దూరంలోనే ఈ బ్లాక్ బాక్స్ లభ్యమైంది. అసలు ఈ బ్లాక్ బాక్స్ ఎలా ఉంటుంది? ఎలాంటి వివరాలు సేకరిస్తోంది? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం.  

బ్లాక్ బాక్స్ అంటే?

బ్లాక్‌ బాక్స్‌ను ప్రత్యేకమైన పదార్థంతో ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, నీటిలో మునిగినా ఎలాంటి డేటా ధ్వంసం కాకుండా ఉండేలా అన్ని జాగ్రత్త చర్యలతో దీన్ని తయారు చేస్తారు.

అయినా సరే..

ప్రయాణ సమయాల్లో రాడార్‌ సిగ్నల్స్‌ దొరకకపోయినా కూడా బ్లాక్ బాక్స్ పనిచేస్తుంది. ఈ బ్లాక్ బాక్స్ విమానం వెనక భాగంలో అమర్చి ఉంటుంది. ఎందుకంటే ప్రమాదానికి గురైనా విమానం వెనుక భాగం తక్కువగా నష్టపోతుంది. బ్లాక్ బాక్స్ అంటే నల్లగా కాకుండా ముదురు నారింజ రంగులో ఉంటుంది. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు ఈ బాక్స్‌ను సులభంగా గుర్తించడానికి ఈ రంగు పూస్తారు. ప్రమాద సమయానికి రెండు గంటల ముందు డాటా మాత్రమే ఇందులో ఉంటుంది. అందువలన ప్రమాదానికి ముందు ఏం జరిగిందో సులభంగా టేపుల నుంచి సేకరించిన సమాచారం ద్వారా ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటారు.

ఎన్ని ఉంటాయి? 

నిజానికి విమానాల్లో రెండు బ్లాక్ బాక్స్‌లు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ జెట్‌ రికార్డర్. ఇందులో విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తుంది? ఏ దిశలో ప్రయాణిస్తుంది? ఎంత వేగంగా ప్రయాణిస్తుంది? లాంటి సమాచారం రికార్డ్ అవుతుంటుంది.

రెండవది కాక్ పిట్ రికార్డర్.. అంటే విమానం నడిపే పైలెట్ తన సహ పైలెట్‌తో మాట్లాడే మాటలను, గ్రౌండ్ కంట్రోల్ రూమ్‌తో మాట్లాడే మాటలను రికార్డ్ చేస్తుంది. బ్లాక్ బాక్స్ అనేది విమానానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి తనలో నిక్షిప్తం చేసుకుంటూ ఉంటుంది.

Also Read: Sudha Bharadwaj Bail: ఆ కేసులో మూడేళ్ల తర్వాత జైలు నుంచి సుధా భరద్వాజ్ విడుదల

Also Read: Farmers Protest Called Off: రైతు ఉద్యమానికి శుభం కార్డు.. దిల్లీ సరిహద్దుల నుంచి ఇళ్లకు రైతులు

Also Read: Rohini Court Blast: దిల్లీ రోహిణి కోర్టులో పేలుడు.. ఏం జరిగిందంటే?

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,419 కేసులు.. 159 మరణాలు

Also Read: వారానికోసారి బోన్ సూప్, పోషకాహార లోపాన్ని తీర్చేస్తుంది, ఎలా చేయాలంటే...

Also Read:  కడుపునొప్పిని నిర్లక్ష్యం చేయద్దు... లివర్ సమస్య కావచ్చు

Also Read: సముద్రపు నాచుతో కరోనాను నిరోధించే ఔషధం తయారీ... కొత్త అధ్యయనం వెల్లడి

Also Read: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చూయింగ్ గమ్... తయారుచేసిన శాస్త్రవేత్తలు

Also Read: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 09 Dec 2021 05:25 PM (IST) Tags: Tamil Nadu chopper crash CDS Bipin Rawat Helicopter Crash Bipin Rawat Death CDS Bipin Rawat Death CDS Bipin Rawat Death News CDS Bipin Rawat Chopper Crash CDS Bipin Rawat Plane Crash Coonoor Chopper Crash Coonoor Helicoptor Crash Bipin Rawat Wife Death cds chopper crash What Is Black Box Mystery Behind Ill-fated Mi-17VH Helicopter Crash CDS Chopper Black Box Black Box details

సంబంధిత కథనాలు

Woman Police SHO: మరో మహిళా పోలీస్‌కు అరుదైన గౌరవం, ఎస్‌హెచ్‌వోగా నియమించిన నగర కమిషనర్

Woman Police SHO: మరో మహిళా పోలీస్‌కు అరుదైన గౌరవం, ఎస్‌హెచ్‌వోగా నియమించిన నగర కమిషనర్

Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్‌ తగ్గింపు - వారికి మాత్రమే !

Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్‌ తగ్గింపు - వారికి మాత్రమే !

Age Limit For Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచండి, సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Age Limit For Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచండి, సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్

Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్

Bhavani Island: ప‌ర్యాట‌క అద్బుతం విజయవాడ భ‌వానీ ఐల్యాండ్, న‌ది మ‌ధ్యలో ప్ర‌కృతి అందాలు

Bhavani Island: ప‌ర్యాట‌క అద్బుతం విజయవాడ భ‌వానీ ఐల్యాండ్, న‌ది మ‌ధ్యలో ప్ర‌కృతి అందాలు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్‌సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?

YSRCP Rajyasabha Equation :   వైఎస్ఆర్‌సీపీలో అర్హులు లేరా ?  రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?

Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?

Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?

Palnadu Students Fight : అచ్చంపేట వర్సెస్ క్రోసూరు స్టూడెంట్స్ - పల్నాడు జిల్లాలో ఇంటర్ విద్యార్థుల గ్యాంగ్ వార్ !

Palnadu Students Fight :  అచ్చంపేట వర్సెస్ క్రోసూరు స్టూడెంట్స్ - పల్నాడు జిల్లాలో ఇంటర్ విద్యార్థుల గ్యాంగ్ వార్ !

Bharti Airtel Q4 Earnings: జియోను బీట్‌ చేసిన ఎయిర్‌టెల్‌ ARPU, రూ.2007 కోట్ల బంఫర్‌ ప్రాఫిట్‌

Bharti Airtel Q4 Earnings: జియోను బీట్‌ చేసిన ఎయిర్‌టెల్‌ ARPU, రూ.2007 కోట్ల బంఫర్‌ ప్రాఫిట్‌