CBI Summons: లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు, ఏప్రిల్ 16న విచారణకు పిలుపు
CBI Summons: లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది.
CBI Summons Kejriwal:
కేజ్రీవాల్‌కు సమన్లు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. లిక్కర్ పాలసీ కేసు విచారణలో భాగంగా ఏప్రిల్ 16న ఢిల్లీలోని హెడ్‌క్వార్టర్స్‌కు రావాలని నోటీసులు పంపింది. ఇప్పటికే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఇదే కేసులో అరెస్ట్ చేశారు. జైల్లోనే విచారణ కొనసాగిస్తున్నారు ఈడీ అధికారులు. కీలకమైన వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సీబీఐ సమన్లపై కేజ్రీవాల్ స్పందించారు. ట్విటర్ వేదికగా ఈ వేధింపులు ఆగవు అంటూ ట్వీట్ చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతానంటూ పోస్ట్ చేశారు. ఈ సమన్లు రాకముందు రోజే అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
"దేశంలో ఎన్నో జాతి వ్యతిరేక శక్తులున్నాయి. దేశం అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నాయి. పేదలకు మెరుగైన విద్య అందించడం వాళ్లకు ఇష్టం లేదు. దేశ ప్రజలు పురోగతి సాధించడం వాళ్లకు నచ్చడం లేదు. వీళ్లంతా కలిసి సిసోడియాను జైలుకు పంపారు. ఆయనను కటకటాల పాలు చేసిన వాళ్లంతా దేశానికి శత్రువులే. విద్యను పేద విద్యార్థులందరికీ అందించాలనుకున్న వ్యక్తిని ఆ డిక్టేటర్ (ప్రధాని మోదీ) జైలుకు పంపారు. ఇది ప్రజలు గుర్తు పెట్టుకుంటారు"
- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి
CBI summons Delhi CM and AAP national convenor Arvind Kejriwal on April 16 to question him in the excise policy case. pic.twitter.com/jlStNKhU2Y
— ANI (@ANI) April 14, 2023
#WATCH | Delhi CM Arvind Kejriwal says, "We have several anti-national forces in the country that don't want the country to progress. Who doesn't want quality education for the children of the poor & Dalits of the country?... All those who didn't want it sent Manish Sisodia to… pic.twitter.com/QjuW37lfd8
— ANI (@ANI) April 14, 2023
సిసోడియా బెయిల్ పిటిషన్ నిరాకరణ..
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియాకు రౌస్ అవెన్యూ కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన వేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. మార్చి 24న సిసోడియా బెయిల్ పిటిషన్‌పై తీర్పుని రిజర్వ్‌లో ఉంచిన కోర్టు...ఇప్పుడు ఈ తీర్పునిచ్చింది. ఢిల్లీ స్పెషల్ కోర్టు పిటిషన్‌ను తిరస్కరించిన నేపథ్యంలో సిసోడియా...ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్దమవుతున్నారు. గత నెల 22న ఢిల్లీ మాజీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని మరి కొద్ది రోజుల పాటు పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఏప్రిల్ 5వ తేదీ వరకూ కస్టడీలోనే ఉండాలని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో మనీశ్ సిసోడియా అభ్యర్థననూ పరిగణనలోకి తీసుకుంది. కస్టడీలోకి ఆధ్యాత్మిక పుస్తకాలు తీసుకెళ్లేందుకు అనుమతినివ్వాలని సిసోడియా కోరారు. దీనిపై అప్లికేషన్ పెట్టుకోవాలని కోర్టు వెల్లడించింది. రౌజ్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా వేశారు. ఇన్నాళ్లూ దీనిపై విచారణ జరగలేదు. కస్టడీని పొడిగిస్తోందే తప్ప ఏ నిర్ణయమూ తీసుకో లేదు. మార్చి 25న ఈ పిటిషన్‌పై విచారించాల్సి ఉన్నా...ఢిల్లీ కోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై ఈడీ వివరణను కోరింది కోర్టు. స్పెషల్ జడ్జ్ ఎమ్కే నాగ్‌పాల్ ఈ విషయమై ఈడీకి నోటీసులు ఇచ్చారు. కీలక వివరాలు సిసోడియా చెప్పడం లేదని, విచారణకు సహకరించడం లేదని అధికారులు ఆరోపిస్తున్నారు. సిసోడియా మాత్రం తాను అన్ని ప్రశ్నలకూ సమాధానం చెబుతున్నట్టు వివరిస్తున్నారు.