![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Lalu Prasad Yadav: కోలుకుంటున్న లాలూకు మరో షాక్- ఆ కేసు రీఓపెన్ చేసిన సీబీఐ!
Lalu Prasad Yadav: బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌పై ఉన్న అవినీతి కేసును సీబీఐ రీఓపెన్ చేసింది.
![Lalu Prasad Yadav: కోలుకుంటున్న లాలూకు మరో షాక్- ఆ కేసు రీఓపెన్ చేసిన సీబీఐ! CBI Reopens Corruption Case Against Former Bihar CM Lalu Yadav Report Lalu Prasad Yadav: కోలుకుంటున్న లాలూకు మరో షాక్- ఆ కేసు రీఓపెన్ చేసిన సీబీఐ!](https://static.abplive.com/wp-content/uploads/sites/2/2017/07/08080950/Lalu-Yadav-03-min.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Lalu Prasad Yadav: ఇటీవలే కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్న ఆర్‌జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాద్‌కు షాక్ తగిలింది. ఆయనపై ఉన్న అవినీతి కేసులో దర్యాప్తును సీబీఐ తిరిగి ప్రారంభించింది.
ఈ కేసులో
యూపీఏ-1 హాయంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై 2018లో సీబీఐ విచారణ ప్రారంభించింది. అయితే దానికి సంబంధించిన విచారణ 2021లో ముగిసింది. ఈ కేసులో లాలూతో పాటు ఆయన కుమారుడు, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, కుమార్తెలు చందా యాదవ్, రాగిణి యాదవ్ నిందితులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ కేసును సీబీఐ రీఓపెన్ చేసింది.
బెయిల్‌పై
లాలూ ప్రసాద్.. ప్రస్తుతం దాణా కుంభకోణానికి సంబంధించిన కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, అనారోగ్య కారణాలతో ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం ఇటీవలే సింగపూర్‌కు వెళ్లారు. లాలూకు కుమార్తె కిడ్నీ దానం చేయడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తుందని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడూ లాలూపై ఉన్న కేసును రీఓపెన్ చేయడంతో ప్రతిపక్షాలు మరిన్ని ఆరోపణలు చేసే అవకాశం ఉంది. 74 ఏళ్ల లాలూ కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతున్నారు.
జోడీ
మరోవైపు ఈ ఆగస్టులో భాజపాతో బంధం తెంచుకున్న నితీశ్ కుమార్.. ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన మహా కూటమితో జట్టుకట్టారు. ఆ రెండు పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. తేజస్వికి ఉపముఖ్యమంత్రి పదవి దక్కింది. నితీశ్ మరోసారి లాలూతో జోడీ కట్టడంతో భాజపా భయపడుతోందని ఆర్‌జేడీ చెబుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)