Top Headlines Today: జగన్ పై ఈసీకి ఫిర్యాదు చేయనున్న టీడీపీ ?, గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు షాక్ తప్పదా ? - నేటి టాప్ న్యూస్
BRS leaders Meeting News | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో జులై 5న ఉదయం నుంచి జరిగిన టాప్ హెడ్ లైన్స్ ఇలా ఉన్నాయి. ఒక్క క్లిక్ తో ప్రధాన వార్తలు అందిస్తున్నాం.
AP Telangana News | గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు షాక్ తప్పదా ? కీలక సమావేశానికి పలువురు ఎమ్మెల్యేల డుమ్మా !
గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పరిస్థితి గందరగోళంగా మారింది. తెలంగాణ భవన్ లో ఆ పార్టీ నిర్వహించిన కీలక సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజర్ అయ్యారు. గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెపై అవిశ్వాసం పెట్టాలన్న యోచనలో బీఆర్ఎస్ ఉంది. అందుకే కార్పొరేటర్లు ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రావాలని గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ సమాచారం పంపారు.అయితే ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
https://telugu.abplive.com/telangana/five-brs-mlas-did-not-attend-the-key-meeting-of-greater-hyderabad-leaders-170217
పగిలిన పట్టిసీమ పైప్ లైన్ - 20 అడుగుల ఎత్తులో ఎగిసిపడిన నీళ్లు, పంటలు మునుగుతున్నాయని రైతుల ఆందోళన
ఏలూరు జిల్లా పోలవరం (Polavaram) మండలం విక్కిసిరావుపేట వద్ద శుక్రవారం ఉదయం పట్టిసీమ పైప్ లైన్ పగిలిపోయింది. ఎయిర్ వాల్ లీక్ అయిన ఘటనలో 20 అడుగులు ఎత్తులో నీళ్లు ఎగిసిపడుతున్నాయి. పట్టిసీమ ఎత్తిపోతల నుంచి పైప్ లైన్ ద్వారా కుడి కాల్వలోకి నీళ్లు వెళ్లే మార్గంలో పైప్ లైన్ ధ్వంసమైంది. ఈ క్రమంలో గోదావరి జలాలు పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. గోదావరి నది నుంచి పోలవరం కుడి కాల్వ వరకు డెలివరీ ఛానల్ ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
అర్థరాత్రి బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ - కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు
బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించేశారు. గురువారం అర్థరాత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా చేరివపోవడంతో ఆపార్టీ మరింత ఇరకాటంలో పడింది. తెలంగాణలో చరిత్ర రిపీట్ అవుతోంది. గతంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పరిణామాలు ఇప్పుడు మళ్లీ చూస్తున్నాం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ప్రచార వాహనానికి నిప్పు పెట్టింది భరత్ రామ్ అనుచరుడే - అసలు ట్విస్ట్‌తో మాజీ ఎంపీకి షాక్ !
రాజమండ్రి మార్గాని భరత్ రామ్ కు చెందిన ప్రచార వాహనానికి నిప్పు పెట్టిన కేసులో పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. రాజమండ్రి నగరంలోని వీఎల్ పురానికి చెందిన దంగేటి శివాజీ పనికి పాల్పడినట్లుగా పోలీసులు ఆధారాలతో సహా అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరిచారు. ఈ దంగేటి శివాజీ మాజీ ఎంపీ భరత్ రామ్ ముఖ్య అనుచరుడే. ఎన్నికల ప్రచారంలోనూ చురుకుగా పాల్గొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఈవీఎం ధ్వంసంపై జగన్ చేసిన కామెంట్స్ - ఈసీకి ఫిర్యాదు చేయనున్న టీడీపీ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈవీఎం ధ్వంసంపై చేసిన వ్యాఖ్యలను కార్నర్ చేసే పనిలో టీడీపీ పడింది. సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ రోజు అప్పటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేటు పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేశారు. ఈ కేసుతో పాటు మరికొన్ని కేసుల్లో అరెస్టు అయిన ఆయన ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని సెంట్రల్ జైల్లో ఉన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి