అన్వేషించండి

Margani Bharat Ram : ప్రచార వాహనానికి నిప్పు పెట్టింది భరత్ రామ్ అనుచరుడే - అసలు ట్విస్ట్‌తో మాజీ ఎంపీకి షాక్ !

Bharat Ram Car : మాజీ ఎంపీ భరత్ రామ్ కారుకు ఆయన అనుచరుడే నిప్పు పెట్టినట్లగా పోలీసులు తేల్చారు. అయితే ఆయన తమ అనుచరుడు కాదని భరత్ అంటున్నారు.

Bharat Ram  campaign vehicle Fire Case :  రాజమండ్రి మార్గాని భరత్ రామ్ కు చెందిన ప్రచార వాహనానికి నిప్పు పెట్టిన కేసులో పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. రాజమండ్రి నగరంలోని వీఎల్ పురానికి చెందిన దంగేటి శివాజీ పనికి పాల్పడినట్లుగా పోలీసులు ఆధారాలతో సహా అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరిాచరు. ఈ దంగేటి శివాజీ మాజీ ఎంపీ భరత్ రామ్ ముఖ్య అనుచరుడే. ఎన్నికల ప్రచారంలోనూ చురుకుగా  పాల్గొన్నారు. మరి ఎందుకు నిప్పు పెట్టారంటే.. ఓడిపోయారన్న సానుభూతి భరత్ రామ్ కు రావాలన్న ఉద్దేశంతో తాను వాహనాన్ని తగులబెట్టానని పోలీసులకు చెప్పారు. 

భరత్ రామ్ ప్రచార వాహనానికి నిప్పు పెట్టి అనుచరుడే 

భరత్ రామ్ వాహనానికి నిప్పు పెట్టిన విషయం సంచలనం సృష్టించింది. టీడీపీ నేతలే  ఈ పని చేశారని భరత్ రామ్ ఆరోపించారు. అమరావతికి వెళ్లి నేరుగా డీజీపీ ద్వారకా తిరమల రావును కలిసి దర్యాప్తు చేయాలని కోరారు. పోలీసులు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. సీసీ ఫుటేజీ ఇతర ఆధారాలతో సహా దంగేటి శివాజీని అరెస్టు చేయడంతో కేసు మిస్టరీ వీడింది. నిందితుడు యూట్యూబ్‌లో వీడియో చూసి.. ముందుగా పెట్రోల్ పోసి.. తర్వాత దోమల కాయిల్‌ను అంటించి.. వాహనం దగ్గర పెట్టి వెళ్లాడు. వాహనం కాలిపోయిన తర్వాత శివాజీ..ఎంపీ భరత్ తండ్రి నాగేశ్వరరావుకు ఫోన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. దంగేటి శివాజీపై  ఐపిసి సెక్షన్ 435 కింద కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు.

ఈవీఎం ధ్వంసంపై జగన్ చేసిన కామెంట్స్‌ - ఈసీకి ఫిర్యాదు చేయనున్న టీడీపీ

తన అనుచరుడు అయితే తన వాహనానికి నిప్పెందుకు పెడతారన్న ఎంపీ 

అయితే టీడీపీ నేతలపై ఆరోపణలు చేసిన భరత్ రామ్‌కు ఈ కేసు చిక్కుముడి వీడటంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. దీంతో ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పుడల్లా ఎన్నికలు లేవు తనకు సానుభూతి ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. దంగేటి శివాజీ వైసీపీ కార్యకర్త కాదని.. తమ అనుచరుడు కాదని మార్గాని  భరత్ స్పష్టం చేశారు. మాపై అభిమానం ఉంటే మా ఆస్తి ఎందుకు ధ్వంసం చేస్తారని ఆయన ప్రశ్నించారు. కావాలంటే తాను మార్కండేయ స్వామి ఆలయంలో ప్రమాణానికి సిద్దమని.. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రమాణానికి వస్తారా అని సవాల్ చేశారు. 

ఆలయంలో ప్రమాణం చేస్తానని సవాల్ 

గత ఎన్నికలలో రాజమండ్రి ఎంపీగా ఉన్న భరత్ రామ్..రాజమండ్రి సిటీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఘోరంగా ఓడిపోయారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు లక్షా 23వేలకుపైగా ఓట్లు రాగా.. భరత్ రామ్‌కు కేవలం 51 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆయన 71 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. మెజార్టీ కన్నా భరత్ రామ్ కు వచ్చిన ఓట్లే తక్కువ. ఈ ఓటమిపై భరత్ రామ్ ఆవేదన చెందుతున్నారు. ఈ సమయంలో ఆయన కారును  ఆయన అనుచరుడే తగులపెట్టడం సంచలనంగా మారింది. సమర్థించుకోలేక.. ప్రమాణాలు పేరుతో నాటకాలు ఆడుున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viral News: పార్టీకి ఉపయోగపడకుంటే రాజకీయాలు ఎందుకయ్యా? మంత్రి సుభాష్‌కు చంద్రబాబు క్లాస్‌- ఆడియో వైరల్
పార్టీకి ఉపయోగపడకుంటే రాజకీయాలు ఎందుకయ్యా? మంత్రి సుభాష్‌కు చంద్రబాబు క్లాస్‌- ఆడియో వైరల్
APTET Results: ఏపీ టెట్‌-2024 జులై ఫలితాలు విడుదల, 50.79 శాతం అర్హత - రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ టెట్‌-2024 జులై ఫలితాలు విడుదల, 50.79 శాతం అర్హత - రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే
Actress Kasturi : తమిళనాడులోని తెలుగువారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళనాడులోని తెలుగువారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
Andhra Pradesh News: సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ మద్దతుదారులపై కేసులు- పోలీసులకు జగన్ వార్నింగ్
సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ మద్దతుదారులపై కేసులు- పోలీసులకు జగన్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఎందుకయ్యా నీకు రాజకీయాలు, మంత్రి వాసంశెట్టికి క్లాస్ పీకిన చంద్రబాబుRohit Sharma Virat Kohli Failures |  హిట్ మ్యాను, కింగు ఇద్దరూ ఆడకపోతే ఎవరిని అని ఏం లాభం | ABP DesamIndia Strategical Failures vs NZ Test Series | గంభీర్ సారు గారి దయతో అప్పన్నంగా అప్పచెప్పాం | ABP DesamRishabh pant out Controversy | రిషభ్ పంత్ అవుటా..నాట్ అవుటా..వివాదం మొదలైంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: పార్టీకి ఉపయోగపడకుంటే రాజకీయాలు ఎందుకయ్యా? మంత్రి సుభాష్‌కు చంద్రబాబు క్లాస్‌- ఆడియో వైరల్
పార్టీకి ఉపయోగపడకుంటే రాజకీయాలు ఎందుకయ్యా? మంత్రి సుభాష్‌కు చంద్రబాబు క్లాస్‌- ఆడియో వైరల్
APTET Results: ఏపీ టెట్‌-2024 జులై ఫలితాలు విడుదల, 50.79 శాతం అర్హత - రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ టెట్‌-2024 జులై ఫలితాలు విడుదల, 50.79 శాతం అర్హత - రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే
Actress Kasturi : తమిళనాడులోని తెలుగువారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళనాడులోని తెలుగువారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
Andhra Pradesh News: సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ మద్దతుదారులపై కేసులు- పోలీసులకు జగన్ వార్నింగ్
సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ మద్దతుదారులపై కేసులు- పోలీసులకు జగన్ వార్నింగ్
Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- లోయలో బస్‌ పడి 28 మంది మృతి
ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- లోయలో బస్‌ పడి 28 మంది మృతి
Dil Raju: నేను ట్రాక్ తప్పాను.. నాగ వంశీ ట్రాక్ తప్పలేదు,  ఫెయిల్యూర్స్ ఒప్పుకున్న దిల్ రాజు!
నేను ట్రాక్ తప్పాను.. నాగ వంశీ ట్రాక్ తప్పలేదు, ఫెయిల్యూర్స్ ఒప్పుకున్న దిల్ రాజు!
Telangana News: తెలంగాణలోనే ఉన్న
తెలంగాణలోనే ఉన్న "క" సినిమాలో చెప్పిన క్రిష్ణగిరి- సాయంత్రం 4 గంటలకే చీకటి
Jeevan Pramaan Patra: లైఫ్‌ సర్టిఫికెట్ల ప్రాసెస్‌ ప్రారంభం - ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఎలా సబ్మిట్‌ చేయాలి?
లైఫ్‌ సర్టిఫికెట్ల ప్రాసెస్‌ ప్రారంభం - ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఎలా సబ్మిట్‌ చేయాలి?
Embed widget