![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
BKU Leader Rakesh Tikait: ఎండైనా, వానైనా తగ్గేదేలే.. వరద నీటిలో టికాయత్ వినూత్న నిరసన
బీకేయూ నేత రాకేశ్ టికాయత్ ఉత్తర్ ప్రదేశ్- దిల్లీ సరిహద్దులో వినూత్న నిరసన చేపట్టారు. వరద నీటిలో కూర్చొని టికాయత్ చేసిన నిరసన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
![BKU Leader Rakesh Tikait: ఎండైనా, వానైనా తగ్గేదేలే.. వరద నీటిలో టికాయత్ వినూత్న నిరసన BKU Leader Rakesh Tikait Stages Protest On Waterlogged Road At Ghazipur Border, Images Go Viral BKU Leader Rakesh Tikait: ఎండైనా, వానైనా తగ్గేదేలే.. వరద నీటిలో టికాయత్ వినూత్న నిరసన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/12/94022082a344f83ef5cb9f35de185382_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కొత్త సాగు చట్టాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. అయితే భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ వినూత్నంగా నిరసన చేపట్టారు. టికాయత్ తో పాటు రైతులు ఉత్తర్ ప్రదేశ్- దిల్లీ సరిహద్దులోని ఘజీపుర్ వద్ద వరద నీటితో నిండి పోయిన ఫ్లైఓవర్ పై ఆందోళన చేశారు.
Rakesh Tikait's weekend in resort : Godi media pic.twitter.com/hi7rtouxPi
— SAJI ☭ (@SAJIMONSJ7) September 11, 2021
Also Read:Warda Snake Bite: పాప తల వద్ద నాగుపాము.. చివరికి వెళ్తూ వెళ్తూ..
వైరల్..
దిల్లీ సరిహద్దు వద్ద నిరసన చేస్తోన్న రైతుల టెంట్లు, సామగ్రి వరద నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో అదే నీటిలో కూర్చొని వినూత్నంగా నిరసన చేపట్టారు టికాయత్. ఆదివారం దిల్లీలో భారీ వర్షం కురిసింది. వరద ధాటికి ఘజీపుర్ సరిహద్దు మొత్తం నీటితో నిండిపోయింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని రైతులు ఆరోపించారు. రాకేశ్ టికాయత్ నీటిలో కూర్చొని నిరసన చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
That’s Rakesh Tikait for you
— Rishi Bagree (@rishibagree) September 12, 2021
pic.twitter.com/Hf9q73jfzt
2020 నవంబర్ 26 నుంచి రైతులు.. కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్ని నెలలు గడుస్తోన్న వారు ఆందోళన విరమించలేదు. సాగు చట్టాలు రద్దయ్యే వరకు తమ ఆందోళన విరమించేది లేదని తేల్చిచెబుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం వారితో చర్చలు జరిపినా విఫలమయ్యాయి.
Also Read:Edible Oil: దిగిరానున్న వంట నూనెల ధరలు.. దిగుమతి సుంకాలను తగ్గించిన కేంద్రం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)