Bharat Jodo Yatra: జోడో యాత్రలో జోష్- అన్నయ్యతో కలిసి అడుగులేసిన ప్రియాంక గాంధీ
Bharat Jodo Yatra: మధ్యప్రదేశ్‌లో సాగుతోన్న కాంగ్రెస్ జోడో యాత్రలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన కుటుంబంతో కలిసి పాల్గొన్నారు.
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో గురువారం మరింత జోష్ కనిపించింది. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా.. రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రలో గురువారం పాల్గొన్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది.
ఉత్తర్‌ప్రదేశ్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీగా ఉన్న ప్రియాంక గాంధీ ఈ యాత్రలో పాల్గొనడం ఇదే తొలిసారి. ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా కూడా యాత్రలో చేరినట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
भारत जोड़ो यात्रा में श्री राहुल गांधी जी के साथ कदम से कदम मिला रही हैं कांग्रेस महासचिव श्रीमती प्रियंका गांधी जी। #BharatJodoYatra pic.twitter.com/DE6YkeRiyz
— MP Congress (@INCMP) November 24, 2022
అంతకుముందు
నవంబర్ 24, 25 తేదీల్లో బుర్హాన్‌పూర్-ఇండోర్ మధ్య జరిగే యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొంటారని మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ కమల్ నాథ్ అంతకుముందు తెలిపారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కూడా ప్రియాంక పాదయాత్రలో చేరడంపై ట్వీట్ చేశారు. ప్రియాంక గాంధీ అక్కడ నాలుగు రోజుల పాటు యాత్రలో పాల్గొంటారని ఆయన తెలిపారు.
విజయం మాదే
మధ్యప్రదేశ్‌లో జోడో యాత్ర అత్యంత విజయవంతమవుతుందని కమల్‌నాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు. సమాజాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో యాత్ర చేపట్టామని, ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని కమల్‌నాథ్ అన్నారు.
సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కాంగ్రెస్ పాదయాత్ర ప్రారంభమైంది. ఇది ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల మీదుగా సాగింది.
రాజస్థాన్‌కు వెళ్లే ముందు బుర్హాన్‌పూర్, ఖాండ్వా, ఖర్గోన్, ఇండోర్, ఉజ్జయిని, అగర్ మాల్వా జిల్లాలను యాత్ర కవర్ చేస్తుందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
Also Read: మందుబాబులకు షాకింగ్ న్యూస్ - 4 శాతం పెరిగిన సేల్స్ ట్యాక్స్, మద్యం ధరలు పెంపు