మందుబాబులకు షాకింగ్ న్యూస్ - 4 శాతం పెరిగిన సేల్స్ ట్యాక్స్, మద్యం ధరలు పెంపు
Liquor Price Hike: ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL)పై సేల్స్ ట్యాక్స్‌ను బుధవారం 4 శాతం పెంచింది. మద్యం ధరలు పెంచుతూ కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Kerala Liquor Price Hike Latest News: కేరళలో మందుబాబులకు షాకింగ్ న్యూస్. మద్యం ధరలు పెంచుతూ కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL)పై సేల్స్ ట్యాక్స్‌ను బుధవారం 4 శాతం పెంచింది. దాంతో కేరళలో మద్యం ధరలు ఒక్కసారిగా పెరగనున్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలో విదేశీ మద్యాన్ని తయారు చేసి విక్రయించే డిస్టిలరీలపై విధిస్తున్న ఐదు శాతం టర్నోవర్ ట్యాక్స్ (ToT)ని ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. డిస్టీలరిలపై టర్నోవర్ టాక్స్ మాఫీ చేయటం వల్ల రాష్ట్ర ఆదాయానికి గండి పడుతుందని, దాని పుడ్చుకోవడానికి రాష్ట్ర జనరల్ సేల్స్ టాక్స్ రేటును 4 శాతం పెంచుతూ క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.
క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం..
కేరళ సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో విదేశీ మద్యం తయారీ, విక్రయాలు చేస్తున్న డిస్టిలరీలపై ఉన్న 5 శాతం టర్నోవర్ టాక్స్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో రాష్ట్ర జనరల్ సేల్స్ టాక్స్ రేటును 4శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేరళ క్యాబినెట్. డిస్టిలరీలపై టర్నోవర్ ట్యాక్స్ ను తగ్గించడం ద్వారా రాష్ట్ర ఖజానాపై భారం పడుతుంది. కనుక ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఐఎంఎఫ్ఎల్ పై సేల్స్ ట్యాక్స్‌ను 4 శాతం పెంచాల్సి వచ్చిందని ఓ ప్రకటనలో తెలిపారు.
కేరళ క్యాబినెట్ నిర్ణయాలు
కేరళ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ కూడా తన వేర్ హౌజ్ మార్జిన్ ను 1 శాతం పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కార్పొరేషన్ డిస్టిలరీలలో తయారైన విదేశీ మద్యం (IMFL) ధరలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు. జనరల్ సేల్స్ టాక్స్ రేటును పెంచడానికి కేరళ జనరల్ సేల్స్ టాక్స్ చట్టం,1963 ను సవరించడానికి కేరళ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. సవరించిన ధరలు అమలులోకి వస్తే విదేశీ మద్యం ధర 2 శాతం పెరగనుంది.

ఇతర నిర్ణయాలు
కేరళ స్టేట్ ఊమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు , నేషనల్ మైనరిటీ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పోరేషన్ నుంచి నిధులు పొందడానికి అదనంగా మరో 100 కోట్ల రూపాయలు గ్యారంటీ గా ఇవ్వడానికి నిర్ణయించారు.
నిబంధనల ప్రకారం అర్హత కలిగిన ఖైదీలకు, స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా మినహాయింపు ఇవ్వడానికి గుర్తించాలని నిర్ణయం తీసుకున్నారు. పోలీసు, ఎక్సైజ్, ఫింగర్ ప్రింట్ బ్యూరో లకు మహీంద్రా బొలెరో వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు.