Metro Chicks: మెట్రోలో వెళ్లే మహిళలే టార్గెట్ - దిగంత్ అరెస్ట్ - ఇలా కూడా చేసేవాళ్లుంటారా ?
Namma Metro: బెంగళూరులో మెట్రోలో ప్రయాణించే మహిళల ఫోటోలు రహస్యంగా తీసి సోషల్ మీడియాలో పెడుతున్నాడో వ్యక్తి. అతని అకౌంట్ పై ఫిర్యాదు రావడంతో అరెస్టు చేశారు.

Namma Metro Chicks: బెంగళూరు నమ్మ మెట్రోలో మహిళా ప్రయాణికులను రహస్యంగా వీడియోలు , ఫోటోలు తీసి, వాటిని 'బెంగళూరు మెట్రో చిక్స్' (@metro_chicks) అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక 27 ఏళ్ల వ్యక్తిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. దిగంత్ అనే 27 ఏళ్ల వ్యక్తి అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. మెట్రోలో ప్రయాణిస్తూ, మహిళలను వారి సమ్మతి లేకుండా రహస్యంగా చిత్రీకరించి, ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
ఈ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 6,000 మందికి పైగా ఫాలోవర్లు కలిగి ఉన్నారు. "నమ్మ మెట్రోలో అందమైన అమ్మాయిలు" వంటి అభ్యంతరకరమైన క్యాప్షన్‌లతో వీడియోలను పోస్టు చేశాడు. ఈ ఖాతాకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానెల్ (Speedy_Weedy123) కూడా ఉంది, ఇది 1,188 సబ్‌స్క్రైబర్లను కలిగి ఉంది. వీటిని వివాదం కావడంతో డీయాక్టివేట్ చేశాడు.
ఈ ఇన్ స్టా ఖాతాను ఓ వ్యక్తి బెంగళూరు పోలీసులకు ట్యాగ్ చేసి, చర్య తీసుకోవాలని కోరడంతో వెలుగులోకి వచ్చింది. మే 21న, బనశంకరి పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 67 మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దిగంత్‌ను మే 23న పీన్యా ప్రాంతంలో అరెస్టు చేశారు. అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసి ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు.
ఈ ఘటన మెట్రో ప్రయాణికుల్ని .. ముఖ్యంగా మహిళా ప్రయాణికుల్ని షాక్ కు గురి చేసింది. ప్రయాణికుల భద్రతను రాజీ చేసే ఏ చర్యనూ సహించబోమని మెట్రో ప్రకటించింది. ఈ ఘటన తర్వాత, మెట్రో స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, మహిళలకు ప్రత్యేక కోచ్‌ల సంఖ్యను పెంచడం వంటి భద్రతా చర్యలను మెరుగుపరచాలని BMRCL పరిశీలిస్తోంది.
The account is called "Bangalore Metro Clicks" and the Instagram handle is: @metro_chicks https://t.co/OOxjQBrAYF
— Mr Ray (@ray_hitmann) May 18, 2025
The person behind this is filming unsuspecting women commuters —often zoomed in on their faces or bodies turning public transport into a playground for voyeurism. pic.twitter.com/GmxJeBbswD
ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. చాలా మంది మహిళా ప్రయాణికులు ఈ ఘటనను పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో మహిళలు ఎదుర్కొనే వేధింపుల సమస్యలో ఒక భాగంగా చూశారు. కొందరు మహిళలు మెట్రోలో తమకు ఎదురైన అసౌకర్య అనుభవాలను పంచుకున్నారు . ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మెట్రోలో ఎవరైనా రహస్యంగా రికార్డింగ్ చేస్తున్నట్లు గమనిస్తే, వెంటనే ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ 112కు కాల్ చేయాలి లేదా మెట్రో ప్రాంగణంలో ఉన్న సురక్ష యాప్‌ను ఉపయోగించాలని పోలీసులు సూచిస్తున్నారు.
Bengaluru police arrest a man running the voyeuristic instagram page "Bangalore Metro Chicks". @DCPSouthBCP says a 27 year old private company employee was arrested for recording women metro commuters without their consent or knowledge & uploading it on the page. pic.twitter.com/6bwZQvPrvQ
— Anusha Ravi Sood (@anusharavi10) May 23, 2025





















