అన్వేషించండి

Viral News: చనిపోయిన వ్యక్తిపై భూ కబ్జా కేసు, మహిళపై లైంగిక వేధింపులు.. సీఐపై సస్పెన్షన్ వేటు

Telangana News | వరంగల్ జల్లాలో సంచలనం రేపిన కేసులో సీఐదే తప్పిదమని పోలీస్ శాఖ గుర్తించింది. వరంగల్ సీఐ వెంకటరత్నంను సస్పెండ్ చేస్తూ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

Warangal CI Suspension | వరంగల్: తన విధులలో నిర్లక్ష్యం వహించడంతో పాటు డిపార్ట్‌మెంటుకు చెడ్డ పేరు తీసుకువచ్చిన ఇన్‌స్పెక్టర్‌పై పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది. చనిపోయిన వ్యక్తిపై భూ కబ్జా కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్ జె. వెంకట రత్నంను సస్పెండ్ చేశారు. ఈ మేరకు వరంగల్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు సైతం జారీ చేశారు. తొమ్మిదేళ్ల కిందట చనిపోయిన వ్యక్తిపై భూ కబ్జా కేసు నమోదు చేయడంతో ఎఫ్ఐఆర్ కాపీ వైరల్ అయింది. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరించడం, మరో కేసులో నిందితురాలిపై పోలీస్ స్టేషన్ ఆవరణలో లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లుగా ప్రాథమిక విచారణలో తేలడంతో ఇన్‌స్పెక్టర్ పై చర్యలు తీసుకున్నారు.

.మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు

ఈ ఏడాది జనవరి 21న ఓ మహిళ భూమి కబ్జా విషయంపై వరంగల్ పరిధిలోని ఏజే మిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తమ భూమిని ఆక్రమించారని, అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేయగా.. ఇన్స్‌పెక్టర్ జె. వెంకట రత్నం ఫిర్యాదులో ఉన్న వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్ నెంబర్ 47/2025లో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రశేఖర్ చనిపోయి 9 ఏళ్లు అవుతోంది. అయితే ఎప్పుడో చనిపోయిన వ్యక్తి ఇప్పుడు వచ్చి బెదిరించడం ఎలా సాధ్యమని మృతుడి బంధువులు వచ్చి ప్రశ్నిస్తే నా ఇష్టం అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

Viral News: చనిపోయిన వ్యక్తిపై భూ కబ్జా కేసు, మహిళపై లైంగిక వేధింపులు.. సీఐపై సస్పెన్షన్ వేటు

చనిపోయిన మనిషి ఇప్పుడు భూమి కబ్జా చేయడం ఏంటి, పైగా ఆ భూమిలో రాళ్లు పీకి పారేసి.. చంపేస్తానని బెదిరించడం సాధ్యమా అని చంద్రశేఖర్ బంధువులు ప్రశ్నించారు. గట్టిగా మాట్లాడితే మీ మీద కూడా కేసులు నమోదు చేసి లోపల వేస్తానని బెదిరించడంతో వారు తిరిగి వెళ్లిపోయారు. ఏప్రిల్ నెలలో ఈ సంచలన కేసు హాట్ టాపిక్ అయింది.

9 ఏళ్ల కిందట చనిపోయి.. ఇప్పుడు కబ్జాలు చేస్తున్నాడా..!

ఉన్నతాధికారులు దీనిపై స్పందించి విచారణకు ఆదేశించారు. డబ్బు కోసం నిందితులతో కుమ్మక్కై, ఏ తప్పు చేయని వారిపై అన్యాయంగా కేసు నమోదు చేశారని వరంగల్ కమిషనర్ గుర్తించారు. అందులోనూ తొమ్మిదేళ్ల కిందట చనిపోయిన వ్యక్తి వచ్చి భూమి కబ్జా చేయడం ఏంటని తలపట్టుకున్నారు. ఫిర్యాదు అందుకున్నాక అందులోని వ్యక్తుల సమాచారం ఏంటో తెలుసుకోకుండా కేసులు నమోదు చేయడం, బాధితుడి తరఫు వారు వచ్చి విషయం చెప్పినా తప్పిదాన్ని సరిచేయకపోగా.. వారిపైనే కేసులు పెడతానని బెదిరించినట్లు గుర్తించిన పోలీస్ శాఖ ఇన్‌స్పెక్టర్ వెంకటరత్నంపై చర్యలు తీసుకుంది. కేసు నమోదు చేసే సమయంలో కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయలేదని, నిందితుడు బతికున్నాడా లేదా కూడా గుర్తించకుండా కేసు నమోదు చేయడపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Embed widget