News
News
వీడియోలు ఆటలు
X

Ayodhya Ram Temple: అయోధ్య రాముడు కొలువుదీరేది అప్పుడే, ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ

Ayodhya Ram Temple: అయోధ్య రాముడి విగ్రహాన్ని వచ్చే ఏడాది జనవరి 22న ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు.

FOLLOW US: 
Share:

Ayodhya Ram Temple:

జనవరి 22న 

అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి తుది రూపుకు తీసుకొచ్చేందుకు అంతా సిద్ధమవుతోంది. ఎప్పటికప్పుడు ఈ నిర్మాణ పనులపై అప్‌డేట్స్ ఇస్తున్న ట్రస్ట్ ఇప్పుడు మరో ఆసక్తికర విషయం వెల్లడించింది. రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ముహూర్తం ఎప్పుడో చెప్పింది. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నట్టు ప్రకటించింది. జనవరిలోనే ఆలయ సందర్శనకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. అయితే...అప్పటికీ కొంత మేర పనులు మిగిలి ఉంటాయని, భక్తులకు అనుమతినిస్తూనే  ఆ పనులు కొనసాగిస్తామని ట్రస్ట్ వెల్లడించింది. సాలిగ్రామాలతో రాముడు, సీత విగ్రహాలను చెక్కనున్నారు. ఇందుకోసం నేపాల్ నుంచి ప్రత్యేక శిలల్ని తెప్పించారు. గండకి నదీ తీరంలో వీటిని గుర్తించి తీసుకొచ్చారు. ఈ శిలలకు 6 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు భావిస్తున్నారు. రాముడి విగ్రహం తయారయ్యాక..స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రాణపతిష్ఠ చేయనున్నారు. ఇదే విషయాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ స్పష్టం చేసింది. ఇప్పటికీ ఆలయ నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇవి మూడు రెట్లు పెరిగాయి. 

విగ్రహ తయారీ..

 రాముడి విగ్రహ తయారీపై ప్రత్యేక దృష్టి సారించింది రామ మందిర ట్రస్ట్. దాదాపు ఆరడుగుల రాముడి విగ్రహాన్ని తయారు చేయించి...వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి ప్రతిష్ఠించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అయితే..ఈ విగ్రహ తయారీ కోసం ప్రత్యేక శిలలు తెప్పించింది. నేపాల్ నుంచి రెండు సాలగ్రామ శిలలను తరలించారు. ఇప్పటికే ఇవి అయోధ్యకు చేరుకున్నాయి. రామ మందిర ప్రాంగణానికి చేరుకోగానే పూజారులు, స్థానికులు ఆ శిలలకు ఘనస్వాగతం పలికారు. పూలతో అలంకరించారు. పూజలు చేశారు. ఆ తరవాత ఆ శిలలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అప్పగించారు. రాముడితో పాటు సీతా దేవి విగ్రహాన్నీఈ శిలతోనే తయారు చేయనున్నారు. గర్భాలయంలో ఈ రెండు విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. నేపాల్‌లోని కలి గండకి నదీ తీరంలో ఈ శిలలను సేకరించారు. వీటిని సీతాజన్మ స్థలిగా భావించే జానక్‌పూర్ నుంచి ప్రత్యేక క్రేన్‌ల ద్వారా అయోధ్యకు తరలించారు. ఈ రెండు సాలగ్రామ శిలల్లో ఒక దాని బరువు 18 టన్నులు కాగా...మరోటి 16 టన్నులు. విగ్రహ తయారీకి ఈ రెండు శిలలు అనువుగా ఉన్నట్టు అధికారులు నిర్ధరించారు.

మరికొన్ని ఆలయాలు..

రాముడి ఆలయంతో పాటు అదే ప్రాంగణంలో మిగతా దేవుళ్ల ఆలయాలూ నిర్మించనున్నారు. ఈ కాంప్లెక్స్‌లో సూర్యాలయం, గణేషుడి ఆలయం, హనుమాన్, అన్నపూర్ణ మాత ఆలయాలు నిర్మించాలని ట్రస్ట్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. పార్క్ వెలుపల అగస్త్య, విశ్వామిత్ర, వశిష్ఠ, మాతా శబరి, జటాయు, అహల్య ఆలయాలు నిర్మించనున్నారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో సుగ్రీవ ఆలయం కూడా నిర్మించాలని నిర్ణయించారు. శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్‌లో సుగ్రీవుని ఆలయం కూడా రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే అయోధ్యలో రామాలయ గోపురం కనిపిస్తోంది. స్తంభాలను ఎక్కడికక్కడ పేర్చడం వల్ల ఓ రూపుకు వచ్చింది. మొదటి అంతస్తు ఎత్తు దాదాపు 20 అడుగులుగా ఉండనుంది. 

Also Read: Cheetah Deaths: ఆ చీతాలు చనిపోతాయని ముందే ఊహించాం, ఈ ప్రాజెక్ట్‌లో ఉన్న రిస్క్ అలాంటిది - సౌతాఫ్రికా

Published at : 28 Apr 2023 02:01 PM (IST) Tags: PM Modi Ayodhya Ayodhya Ram temple Ayodhya Ram Mandir Ram Lalla Pran Prathistha

సంబంధిత కథనాలు

Europa Clipper: మీరు కాకపోయినా మీ పేరైనా గురుగ్రహంపైకి వెళ్లాలనుకుంటున్నారా? ఈ నాసా ఆఫర్ మీకోసమే

Europa Clipper: మీరు కాకపోయినా మీ పేరైనా గురుగ్రహంపైకి వెళ్లాలనుకుంటున్నారా? ఈ నాసా ఆఫర్ మీకోసమే

Delivery Man Letter: ఫ్లవర్ పాట్ పగులగొట్టాడు, ఇంటర్నెట్‌లో హీరో అయిపోయాడు- ఎలాగంటే!

Delivery Man Letter: ఫ్లవర్ పాట్ పగులగొట్టాడు, ఇంటర్నెట్‌లో హీరో అయిపోయాడు- ఎలాగంటే!

EFLU: ఇఫ్లూలో 132 నాన్ టీచింగ్ ఉద్యోగాలు, అర్హతలివే!

EFLU: ఇఫ్లూలో 132 నాన్ టీచింగ్ ఉద్యోగాలు, అర్హతలివే!

Railway Apprenticeship: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, రాయ్‌పూర్‌లో 1033 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు!

Railway Apprenticeship: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, రాయ్‌పూర్‌లో 1033 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు!

TSLPRB: ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలు, ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!

TSLPRB: ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలు, ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!

టాప్ స్టోరీస్

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు