అన్వేషించండి

Artificial Jyoti At Ram Janmabhoomi: అయోధ్య రామాలయంలో కృత్రిమ అఖండ జ్యోతి - ట్రస్ట్ తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు

Ayodhya Artificial Jyoti: అయోధ్యలోని రామజన్మభూమి ఆలయంలో ప్రతిష్ఠించిన కృత్రిమ జ్యోతిపై భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. అఖండ జ్యోతిని నిర్వహించలేనంత స్థితికి వెళ్లారా అని ప్రశ్నిస్తున్నారు.

Artificial Jyoti At Ram Janmabhoomi Temple In Ayodhya Sparks Debate: అయోధ్యలోని రామజన్మభూమి ఆలయంలో ప్రతిష్ఠించిన  కృత్రిమ జ్యోతి  సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. గర్భాలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించకముందు, తాత్కాలికంగా విగ్రహాన్ని ఉంచిన చోట శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఒక కృత్రిమ దీపాన్ని  ఏర్పాటు చేసింది. వేద మంత్రోచ్ఛారణలు, శాస్త్రోక్తమైన పూజల అనంతరం దీనిని ప్రతిష్ఠించినట్లు ట్రస్ట్ ఏప్రిల్ 11న అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ జ్యోతి చూడటానికి అసలైన దీపంలా కాకుండా ఎలక్ట్రానిక్ పరికరంలా కనిపిస్తుండటంతో భక్తుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆలయ ట్రస్ట్ నిర్ణయంపై మండిపడుతున్నారు. సంప్రదాయబద్ధంగా వెలిగించే అఖండ జ్యోతికి బదులుగా, కృత్రిమ కాంతిని ఇచ్చే పరికరాన్ని పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కొందరు వినియోగదారులు దీనిని  చైనా బొమ్మ   తో పోలుస్తూ, పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇటువంటి ఆధునిక పోకడలు అవసరమా అని అసహనం వ్యక్తం చేశారు.   అఖండ జ్యోతిని వెలిగించే సంప్రదాయం అంతరించిపోయిందా.. అని ప్రశ్నిస్తూ ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. 

సాధారణంగా హిందూ సంప్రదాయంలో దీపం అనేది నెయ్యి లేదా నూనెతో వెలిగించే అగ్ని స్వరూపం. కానీ, ఇక్కడ ఏర్పాటు చేసిన జ్యోతి ప్లాస్టిక్ , ఇతర లోహాలతో చేసిన ఎలక్ట్రానిక్ లైటులా ఉండటం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందనే వాదన వినిపిస్తోంది. ఇంతటి భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఆలయంలో ఒక అఖండ జ్యోతిని నిరంతరం వెలిగించడం ట్రస్ట్‌కు అంత కష్టమైన పనా  అని నెటిజన్లు నిలదీస్తున్నారు.

ఈ వివాదంపై ఆలయ అధికారులు ఇంకా పూర్తిస్థాయిలో స్పందించలేదు. కేవలం అది ఒక సంకేత రూపమని, శాస్త్రోక్తంగానే ప్రతిష్ఠించామని ప్రాథమికంగా తెలిపారు. అయితే, ఆధునిక సాంకేతికతను ధార్మిక సంప్రదాయాలతో ముడిపెట్టడంపై భక్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ గర్భాలయంలో సంప్రదాయ దీపాన్నే ఉంచాలని మెజారిటీ భక్తులు డిమాండ్ చేస్తున్నారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News:విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు- పలువురికి గాయాలు
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు- పలువురికి గాయాలు
TMC Parliament Split 2026: మమతా బెనర్జీకి భారీ షాక్ - చీలిన తృణమూల్- ఎన్డీయే కూటమిలోకి 20 మంది లోక్‌సభ ఎంపీలు.. స్పీకర్‌కు లేఖ!
మమతా బెనర్జీకి భారీ షాక్ - చీలిన తృణమూల్- ఎన్డీయే కూటమిలోకి 20 మంది లోక్‌సభ ఎంపీలు.. స్పీకర్‌కు లేఖ!
NDA Chief Ministers Meeting Delhi 2026: బుధవారం సీఎంలు, డిప్యుటీ సీఎంలతో ప్రధాని మోదీ భేటీ - చంద్రబాబు, పవన్ హాజరు - సంచలన నిర్ణయాలుంటాయా?
బుధవారం సీఎంలు, డిప్యుటీ సీఎంలతో ప్రధాని మోదీ భేటీ - చంద్రబాబు, పవన్ హాజరు - సంచలన నిర్ణయాలుంటాయా?
E85 Fuel India: ప్రతి కారు లేదా బైక్‌లో E85 ఇంధనాన్ని వాడవచ్చా? మైలేజీపై ప్రభావం చూపుతుందా..
ప్రతి కారు లేదా బైక్‌లో E85 ఇంధనాన్ని వాడవచ్చా? మైలేజీపై ప్రభావం చూపుతుందా..
Advertisement

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Miyapur Speech: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డే - మియాపూర్ సభలో 30 నెలల పాలనపై చర్చకు సీఎం రేవంత్ సవాల్!
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డే - మియాపూర్ సభలో 30 నెలల పాలనపై చర్చకు సీఎం రేవంత్ సవాల్!
Supreme Court Pre Marital Relationship Judgment: పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Thalliki Vandanam Scheme AP: ఏపీలో తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్! డబ్బులు పడే ముందు ఈ పని పూర్తి చేయండి!
ఏపీలో తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్! డబ్బులు పడే ముందు ఈ పని పూర్తి చేయండి!
Slumdog Teaser : స్లమ్ డాగ్ టీజర్ రివ్యూ - విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ మ్యాజిక్
స్లమ్ డాగ్ టీజర్ రివ్యూ - విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ మ్యాజిక్
Crime Thriller OTT : ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Monsoon Bike Safety Tips: వర్షాకాలంలో బైక్ స్కిడ్ అవ్వకూడదంటే టైర్లలో గాలి ఎంత ఉండాలి? ఈ గోల్డెన్ రూల్ పాటిస్తే మీ రైడ్‌ సేఫ్‌!
వర్షాకాలంలో బైక్ స్కిడ్ అవ్వకూడదంటే టైర్లలో గాలి ఎంత ఉండాలి? ఈ గోల్డెన్ రూల్ పాటిస్తే మీ రైడ్‌ సేఫ్‌!
Instagram Reel Theft: రీల్‌లో బంగారం చూపించారు - హోమ్‌టూర్‌ కూడా చేశారు - దొంగలకు ఇది సరిపోదా ?
రీల్‌లో బంగారం చూపించారు - హోమ్‌టూర్‌ కూడా చేశారు - దొంగలకు ఇది సరిపోదా ?
This Week Theatrical Releases : పెద్ది తర్వాత వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి - ఈ మూవీస్ డోంట్ మిస్
పెద్ది తర్వాత వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి - ఈ మూవీస్ డోంట్ మిస్
Embed widget