అన్వేషించండి

Apple : రూల్స్ ప్రకారం యాప్ స్టోర్ డేటా ఇవ్వని యాపిల్ - ఇండియాలో రూ. 3,800 కోట్ల జరిమానా గండం?

Apple fine: యాప్ స్టోర్ నిబంధనల ఉల్లంఘన కేసులో అడిగిన ఆర్థిక వివరాలను సమర్పించకపోవడంతో ఇండియాలో యాపిల్‌కు రూ. 3,800 కోట్ల జరిమానా గండం పొంచి ఉంది.

Apple to face Rs 3800 crore fine: ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థకు  కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి గట్టి సెగ తగులుతోంది. యాప్ స్టోర్ నిబంధనల ఉల్లంఘన కేసులో అడిగిన ఆర్థిక వివరాలను సమర్పించకపోవడంతో, యాపిల్‌పై సుమారు రూ. 3,800 కోట్ల భారీ పెనాల్టీ పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. భారత మార్కెట్లో తన గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ, యాప్ డెవలపర్లను తన సొంత పేమెంట్ వ్యవస్థనే వాడాలని ఒత్తిడి చేస్తోందన్న ఆరోపణలపై గత కొంతకాలంగా విచారణ సాగుతోంది. తాజాగా ఈ విచారణ తుది దశకు చేరుకోవడంతో యాపిల్ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది.                           
 
భారత మార్కెట్లో తమది చాలా చిన్న పాత్ర అని, తాము ప్రధాన ప్లేయర్లం కాదని యాపిల్ వాదిస్తోంది. అయితే యాపిల్ వాదనను సిసిఐ కొట్టివేస్తోంది. గణాంకాల ప్రకారం.. రెండేళ్ల క్రితం భారత్‌లో 4 శాతంగా ఉన్న ఐఫోన్ల మార్కెట్ వాటా ప్రస్తుతం 9 శాతానికి పైగా పెరిగింది. ఈ వేగవంతమైన వృద్ధిని చూస్తుంటే, యాపిల్ తన మార్కెట్ స్థానాన్ని దుర్వినియోగం చేస్తోందని సిసిఐ 2024 నివేదికలో స్పష్టం చేసింది. తన వ్యాపారం పెరుగుతున్న కొద్దీ, పాత వాదనలతో తప్పించుకోవడం యాపిల్‌కు ఇప్పుడు కష్టతరంగా మారింది.                
 
అక్టోబర్ 2024 నుండి యాపిల్ తన ఆర్థిక వివరాలను సమర్పించకుండా కాలయాపన చేస్తోందని నియంత్రణ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జరిమానా మొత్తాన్ని నిర్ణయించడానికి ఈ డేటా అత్యంత కీలకమని సిసిఐ స్పష్టం చేసింది. అయితే, యాపిల్ మాత్రం ఈ వ్యవహారాన్ని ఢిల్లీ హైకోర్టుకు తీసుకెళ్లింది. జరిమానాల లెక్కింపుపై ఉన్న నిబంధనలను సవాల్ చేస్తూ, విచారణను నిలిపివేయాలని కోరినప్పటికీ సిసిఐ అందుకు నిరాకరించింది. గ్లోబల్ టర్నోవర్ ఆధారంగా జరిమానా వేస్తే అది అన్యాయమని యాపిల్ వాదిస్తోంది.                     
 
యాపిల్ అభ్యర్థనలను తోసిపుచ్చిన సిసిఐ, వివరణ ఇవ్వడానికి మరో రెండు వారాల గడువు మాత్రమే ఇచ్చింది. ఈ కేసుపై మే 21వ తేదీని తుది విచారణా దినంగా ఖరారు చేసింది. ఒకవేళ ఆ లోపు సరైన డేటా ఇవ్వకపోతే, లభించిన సమాచారం ఆధారంగానే భారీ పెనాల్టీ విధిస్తామని హెచ్చరించింది. ఈ కేసులో వెలువడే తీర్పు భవిష్యత్తులో భారత్‌లో ఇతర అంతర్జాతీయ టెక్ కంపెనీల పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.                        
 
భారత్‌ను తన తదుపరి అతిపెద్ద తయారీ కేంద్రంగా మార్చుకోవాలని చూస్తున్న యాపిల్‌కు, ఈ చట్టపరమైన సమస్యలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఒకవైపు ఐఫోన్ల విక్రయాలు పెరుగుతున్నా, మరోవైపు నియంత్రణ సంస్థల కొరడా దెబ్బ యాపిల్ లాభాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మే 21న జరగబోయే విచారణలో యాపిల్ ఎలాంటి అస్త్రాలను ప్రయోగిస్తుందోనని టెక్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget