By: ABP Desam | Updated at : 11 May 2023 08:25 AM (IST)
Edited By: jyothi
నేడు విశాఖకు సీఎం జగన్, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
CM Jagan Vizag Visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నేడు విశాఖకు రాబోతున్నందును ముఖ్యమంత్రి జగన్ టూర్ షెడ్యూల్ ను అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం 2.20 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు సీఎం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా పీఎం పాలెంలోని వైఎస్సార్ స్టేడియం బి గ్రౌండ్ కు జగన్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించ నున్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో ఏపీ సీఎం జగన్ పాల్గొంటారు.
ఎండాడ వద్ద కాపు భవనానికి శంకుస్థాపన, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు భూమిపూజ
సాయంత్రం 4.30 నుంచి 4.50 గంటల మధ్య భీమిలి నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశం అవుతారు. సమావేశం ముగిసిన అనంతరం 4.50 గంటలకు ఆరిలోవ అపోలో ఆస్పత్రికి సీఎం జగన్ వెళ్తారు. 5.05 గంటలకు అపోలో క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. అనంతరం ఫోటో సెషన్, రేడియేషన్ ఎక్విప్మెంట్ వీక్షణ ఉంటుంది. తర్వాత 5.35 గంటలకు ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారు. ఆరిలోవ అపోలో ఆసుపత్రి నుండి సీ హేరియర్ మ్యూజియానికి బయలుదేరి వెళ్తారు. 6 గంటల వరకు బీచ్ రోడ్డులోని సీ హేరియర్ మ్యూజియం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత రామ్ నగర్ లోని కమర్షియల్ కాంప్లెక్స్, ఎంవీపీ ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనా ఫౌండేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు. ఆ తర్వాత ఎండాడ వద్ద కాపు భవనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం భీమిలి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భూమి పూజా చేస్తారు.
పీఎం పాలంలోని ఏసీఏ-వీడీసీఏ వద్ద 50 అడుగులు భారీ హోర్డింగ్
వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వైజాగ్ స్టాండ్స్ విత్ యూ.. థాంక్యూ సీఎం సార్ అంటూ నినదిస్తున్నారు. ఆయన ఈరోజు విశాఖకు వస్తున్నందున పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పీఎం పాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వద్ద సీఎం కార్యక్రమం ప్రాంతంలో దాదాపు 50 అడుగుల భారీ హోర్డింగ్ ను కొందరు ప్రజలు స్వచ్ఛద్ధంగా ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే ఈరోజు ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లలో పాల్గొంటారు.
మే 24న తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు టూర్
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ నెల 5వ తేదీన జరగాల్సిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన వాయిదా పడినట్లు రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. ఇదే నెల 24వ తేదీన సీఎం జగన్ పర్యటన ఉంటుందని పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులు, వర్షం కారణంగా ముఖ్యమంత్రి పర్యటనను వాయిదా వేయాల్సి వచ్చిందని వివరించారు. అలాగే ' వాలంటీర్లకు వందనం' కారక్రమంలో భాగంగా వాలంటీర్లకు నగదు పురస్కారాల ప్రదానం కార్యక్రమాన్ని మే 24వ తేదీన కొవ్వూరులో నిర్వహిస్తామని మంత్రి తానేటి వనిత వివరించారు.
Kuja Dosha Verdict: అత్యాచార బాధితురాలి జాతకాన్ని కోరిన అలహాబాద్ హైకోర్టు - ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే
ABP Desam Top 10, 3 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంలో 316 మంది ఏపీ వాసులు సురక్షితం, 141 మంది ఫోన్లు స్విచ్ఛాఫ్!
Odisha Train Accident: రైల్వే మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాల డిమాండ్, రైళ్లల్లో భద్రతపై ప్రశ్నల వర్షం
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
Coromandel Express Accident: రాంగ్ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్
Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్
Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?