అన్వేషించండి

Top Headlines Today: చంద్రబాబు విజయానికి టీటీడీపీ శ్రేణులు కృషి - తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై అప్ డేట్ - నేటి టాప్ న్యూస్

Telangana Latest News 7 July 2024: తన విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు కృషి చేశాయన్నారు చంద్రబాబు. నేటి ఉదయం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ హెడ్ లైన్స్ మీకోసం.

Andhra Pradesh Latest News - 'నా విజయానికి టీటీడీపీ శ్రేణులు కృషి చేశారు' - తెలంగాణ గడ్డపై టీడీపీకి పునఃవైభవం వస్తుందన్న ఏపీ సీఎం చంద్రబాబు - ఏపీలో తన విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు తీవ్రంగా కృషి చేశారని ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు (NTR Bhavan) ఆయన ఆదివారం వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. టీటీడీపీ ఆధ్వర్యంలో  జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - కొత్త రేషన్ కార్డులపై కీలక అప్ డేట్
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డులకు (Ration Cards) సంబంధించి మార్పులు చేర్పులకు అవకాశం కల్పించింది. శనివారం నుంచి ఎడిట్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసింది. మరోవైపు, ఎన్నికల కోడ్ ముగియడంతో కొత్త రేషన్ కార్డుల జారీపైనా కసరత్తు చేస్తోంది. త్వరలోనే అర్హులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు కావాలనుకునే వారు మీ సేవా కేంద్రాల్లో చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

జగన్‌పైకి అతను ఎందుకు దూసుకొచ్చాడు? దాడి చేయడానికా? అసలు నిజం చెప్పిన వ్యక్తి
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan) వైఎస్ఆర్ జిల్లా పర్యటన సాగుతోంది. ఇందులో భాగంగా శనివారం కడప (Kadapa) రిమ్స్ ఆస్పత్రిలో పార్టీ కార్యకర్తలను ఆయన పరామర్శించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు ఊహించని పరిణామం ఎదురైంది. ఓ వ్యక్తి అకస్మాత్తుగా జగన్ మీదకు దూసుకొచ్చాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని అడ్డగించి పక్కకు తీసుకెళ్లారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రభుత్వం  ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 8 (సోమవారం) నుంచి ఉచితంగా ఇసుకను అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేయగా.. అందుకు అనుగుణంగా జిల్లాల యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. ముందుగా అన్ని చోట్లా స్టాక్ ఉన్న కేంద్రాల్లో ఇసుక డంప్‌ల నుంచి ఉచితంగా ఇసుకను అందిస్తుంది. ఇందుకోసం రూపాయి కూడా చెల్లించనవసరం లేదు. అయితే, నిర్వహణ ఖర్చుల కింద టన్నుకు రూ.20, సీనరేజ్ కింద టన్నుకు రూ.88 వసూలు చేస్తారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
మణికొండ కేవ్ పబ్ కేసులో పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. పబ్ లో సైకడిక్ట్ డ్రగ్స్ పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వీకండ్ మత్తులో తేలడానికి పార్టీ నిర్వహించినట్లు గుర్తించారు. సైకడిక్ట్ పార్టీలో 80 డెసిబుల్స్ సౌండ్ మించి శబ్దంతో డీజే గౌరవ్ హోరెత్తించారు. గోవా నుంచి డ్రగ్స్ దిగుమతి చేసి విక్రయించినట్లు పోలీసులు తేల్చారు. పట్టుబడ్డ వారంతా రెండు రోజులుగా డీజే ఆర్టిస్ట్ గౌరవ్ తో కాంటాక్ట్ లో ఉన్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Andhra Pradesh News: సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
Sri Reddy Open Letter: మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Hyderabad Crime News: ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Embed widget