Breaking News Today: హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వాన- మరోసారి మునిగిన నగరం
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ అంశాల అప్‌డేట్స్ ఇక్కడ అందిస్తున్నాం.
LIVE

Background
అమరావతి: "ఎమ్మెల్యేలందరితోపాటు మీకు కూడా సమయం ఇస్తామని వారు చెబుతున్నారు. కానీ ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే కొంత సమయం, కొన్ని నిమిషాలు మాత్రమే. అలాంటప్పుడు నేను ప్రజా సమస్యలను ఎలా సవివరంగా చెప్పగలుగుతాను?" అని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రశ్నించారు.
సభకు రండి, మాట్లాడేందుకు సమయం ఇవ్వాలనుకున్నారని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. దీనిపై, తమ పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఈ విషయాన్ని వెల్లడించడంతో జగన్ స్పందించారు: "నువ్వు, ఇంకా మనోళ్లెవరైనా వస్తే, అందరూ వెళ్లి స్పీకర్‌ను కలిసి అడగండి. ఆయన సమయం ఇస్తామంటే.. మనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సరే, రేపే సభకొస్తా" అని జగన్ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ గురువారం (సెప్టెంబర్ 18, 2025) ఓటు చోరీ గురించి మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన వివరణలో, సీఈసీ (ప్రధాన ఎన్నికల కమిషనర్) రాజ్యాంగాన్ని ఖూనీ చేయడం, ‘కాంగ్రెస్ మద్దతుదారుల’ పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం వంటి చర్యలు తీసుకున్నారని తెలిపారు. దీనిని ఆయన ఓటు దొంగల్ని రక్షించడమే అని పేర్కొన్నారు. "ప్రజాస్వామ్యాన్ని తలకిందుల చేయటానికి ప్రయత్నిస్తున్న వారిని, ఓటు చోరీని జరపుతున్న వారిని ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ రక్షిస్తున్నారు" అని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సాయంత్రం, రాహుల్ గాంధీ తన ఎక్స్ (X) ఖాతాలో ఒక పోస్ట్ చేయడం ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "ఈ దేశంలోని యువత, విద్యార్థులు, Gen Z తరాలు రాజ్యాంగాన్ని కాపాడతారని నాకు నమ్మకం ఉంది. వారు తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తారు. ఓటు చోరీని అడ్డుకుంటారు. వారికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఎప్పటికీ వారి పక్కన ఉంటాను. జై హింద్!" అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
తాజాగా, జెన్ జెడ్ యువత సోషల్ మీడియాలో బ్యాన్ విధించిన నేపథ్యంలో నిరసనలు నిర్వహించడంపై దృష్టి సారించగా, ఇది విశేష ప్రాధాన్యతను సంతరించుకున్న విషయం. మరోవైపు, తమ ఉద్యమంతో భారత్ లో ఓటు చోరీని అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని రక్షించే పాత్రలో Gen Z యువత ఉండే ప్రతిపాదనను రాహుల్ గాంధీ తాజాగా చేసిన ట్వీట్ ప్రధాన చర్చాంశంగా మారింది.
Annamayya District Latest News: అన్నమయ్య జిల్లాలో దారుణం- వర్షపు నీటిలో కొట్టుకుపోయిన స్కూల్ ఆటో- చిన్నారి గల్లంతు
Annamayya District Latest News: అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. భారీ వర్షాలకుస్కూల్ నుంచి వస్తున్న ఆటో కొట్టుకుపోయింది. ఈ దుర్ఘటనలో సమయంలో ఆటోలో ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. మున్సిపల్ పార్క్ వద్ద ఘటన జరిగింది. ఆరుగురు చిన్నారులను స్థానికులు రక్షించారు. మరో బాలిక కోసం గాలిస్తున్నారు.
Warangal Latest News: వరంగల్ జిల్లా రఘనాథ్‌పల్లిలో కడియంకు వ్యతిరేకంగా పోస్టర్లు
Warangal Latest News:వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో బీ ఆర్ ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాల్ పోస్టర్లు అంటించారు. ఈ పోస్టర్లలో కడియం నీ రాజీనామా ఎప్పుడు..? అంటూ కడియం శ్రీహరిపై విమర్శలు చేశారు. బీ ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల చెమట కష్టం వల్ల ఎమ్మెల్యే పదవి దక్కిందని, వెంటనే ఆ పదవికి రాజీనామా చేసి, తరువాత ఏ పార్టీ నుంచైనా పోటీ చేసుకోవాలని పోస్టర్ల ద్వారా బహిరంగంగా డిమాండ్ చేశారు.
ప్రజల సమస్యలను విస్మరిస్తూ వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తూ, ప్రజలు ఇలాంటి రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని స్పష్టం చేశారు.ఈ వాల్ పోస్టర్లతో రఘునాథపల్లి మండల కేంద్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.





















