Maharashtra: మహారాష్ట్రలో మరో డ్రంక్ అండ్ హిట్ కేసు, చావు బతుకుల్లో మూడు నెలల చిన్నారి
Maharashtra: మహారాష్ట్రలో మరో డ్రంక్ అండ్ హిట్ కేసులో తీవ్రంగా గాయపడిన మూడు నెలల చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.
![Maharashtra: మహారాష్ట్రలో మరో డ్రంక్ అండ్ హిట్ కేసు, చావు బతుకుల్లో మూడు నెలల చిన్నారి Another Drink Driving Case In Maharashtra 3 Month Old Baby Critical Maharashtra: మహారాష్ట్రలో మరో డ్రంక్ అండ్ హిట్ కేసు, చావు బతుకుల్లో మూడు నెలల చిన్నారి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/25/2a88206458e8857ebf988b8ec2db655b1716619951402517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Drink Driving Case: పుణేలో పోర్షే యాక్సిడెంట్ విచారణ కొనసాగుతుండగానే మరో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అలజడి సృష్టించింది. నాగ్‌పూర్‌లో ఓ కార్ అదుపు తప్పి మహిళతో పాటు ఇద్దరు చిన్నారులను ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కార్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు. కార్‌లో లిక్కర్ బాటిల్స్ కూడా దొరికాయి. ఈ ఘటనలో తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. వీళ్లలో మూడు నెలల పసికందు కూడా ఉన్నాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...ఈ ప్రమాదం జరిగిన సమయంలో కార్‌లో నిందితుడితో పాటు అతని స్నేహితులు మద్యం సేవిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే నిందితులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ స్థానికులు వెంటనే వాళ్లను వెంబడించి పట్టుకున్నారు. వాళ్లలో ఒకరిని బంధించి పోలీసులకు అప్పగించారు. ఆవేశంతో కార్‌ని ధ్వంసం చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)