Top Headlines Today: మాజీ సీఎంపై మంత్రి నారా లోకేశ్ ఫైర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు లీగల్ నోటీసులు - నేటి టాప్ న్యూస్
Andhra Pradesh Telangana Latest News 23 June 2024: నేటి ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. ఒక్క క్లిక్ చేసి 5 ప్రధాన వార్తలు చదవండి.
![Top Headlines Today: మాజీ సీఎంపై మంత్రి నారా లోకేశ్ ఫైర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు లీగల్ నోటీసులు - నేటి టాప్ న్యూస్ Andhra Pradesh Telugu News Today from AP and Telangana on 23 June 2024 Top Headlines Today: మాజీ సీఎంపై మంత్రి నారా లోకేశ్ ఫైర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు లీగల్ నోటీసులు - నేటి టాప్ న్యూస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/b69ae06505c03c80c805c99a9981e0f71719134339805233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Andhra Pradesh Telugu News: 'జగన్ ఏపీ నీ తాత జాగీరా?' - మాజీ సీఎంపై మంత్రి నారా లోకేశ్ ఫైర్
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై (Jagan) మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వైసీపీ కార్యాలయాలపై ఆయన ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో చేసిన భూ కేటాయింపులపై మండిపడ్డారు. 'జగన్.. ఏంటీ ప్యాలెస్‌ల పిచ్చి. ఈ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా.?. కేవలం వైసీపీ కార్యాలయాల కోసం 26 జిల్లాల్లో భూ కేటాయింపులు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
రాష్ట్రంలో మహిళలకు గుడ్ న్యూస్ - ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి కీలక ప్రకటన
రాష్ట్రంలో మహిళలకు గుడ్ న్యూస్. నెలలోగా మహిళలకు ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం (Free Bus Scheme) కల్పిస్తామని మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి (Ramprasad Reddy) తెలిపారు. సచివాలయం నాలుగో బ్లాక్‌లోని ఛాంబర్‌లో ఆయన రవాణా, క్రీడల శాఖల మంత్రిగా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుపై ఆయన తొలి సంతకం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మంత్రి పొన్నంపై ఆరోపణలు - బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆ మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు
రామగుండం ఎన్టీపీసీ నుంచి ఉత్పత్తి అయ్యి, అక్కడి నుంచి తరలిస్తున్న ఫ్లై యాష్ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఫ్లై యాష్ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిరాధార ఆరోపణలు చేసిన హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సహా ఓ గ్రూపునకు చెందిన మీడియా సంస్థలపై లీగల్ నోటీసులు పంపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలంగాణలో సింగరేణి బొగ్గు రాజకీయం - గనుల వేలంలో పాల్గొంటే మంచిదా ? పాల్గొనకపోతేనా ?
తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు బొగ్గు చుట్టూ తిరుగుతోంది. తెలంగాణలోని బొగ్గు గనులు సింగరేణికి కేటాయించకుండా కేంద్రం వేలం వేసింది. ఈ వేలం ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొన్నది. అందుకే బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయని కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తమ హయాంలో బొగ్గు బ్లాకుల వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకించామని సింగరేణిని కూడా వేలంలో పాల్గొనడానికి అంగీకరించలేదని బీఆర్ఎస్ వాదిస్తోంది. అయితే ఈ విషయంపై కాంగ్రెస్ భిన్నంగా స్పందిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హతకు చాన్స్ - టీడీపీకి జగన్ అలాంటి అవకాశం ఇస్తారా ?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఊహించని మలుపులు తిరిగాయి. ఓడలు బండ్లు అయ్యాయి. బండ్లు ఓడలయ్యాయి. వైఎస్ఆర్‌సీపీ ప్రధాన ప్రతిపక్ష హోదాకు దూరమయింది. పూలమ్మిన చోట రాళ్లమ్మడం ఎలా అని జగన్ అనుకుంటున్నారేమో కానీ అసెంబ్లీ వైపు రావాలని ఆయన అనుకోవడం లేదు. ప్రమాణ స్వీకారం తప్పనిసరి కాబట్టి ఆ తంతు పూర్తి చేసి పది నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండకుండా వెళ్లిపోయారు. స్పీకర్ ఎన్నికలకు తాను డుమ్మా కొట్టారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)