Top Headlines Today: తోకలు కత్తిరిస్తామంటూ విజయసాయిరెడ్డి కౌంటర్, నిరుద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ లేఖాస్త్రాలు - నేటి టాప్ న్యూస్
Telugu News Today 15 July 2024 | తనపై వచ్చిన ఆరోపణలపై వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. సోమవారం నుంచి ఏపీ, తెలంగాణలో జరిగిన లేటెస్ట్ వార్తలు ఇక్కడ మీకోసం.
AP and Telangana Latest News - త్వరలోనే అధికారంలోకి వస్తాం- తోకలు కత్తిరిస్తాం- విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
అధికారం కోల్పోయిన తర్వాత ప్లాన్ ప్రాకారం వైసీపీ నేతలపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఓ అధికారితో సంబంధం ఉందంటూ వచ్చిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఓ గిరిజన మహిళను అనవసరంగా ఇందులోకి లాగి పెద్ద తప్పు చేశారని హెచ్చరించారు. ఓ ఎంపీగా ఉన్నందున రకరకాల పనులపై చాలా మంది వస్తుంటారని అలాంటి వారందరితో సంబంధాలు అంటగడతారా అని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళనలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్లు సాధించుకునేందుకు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం శోచనీయం అన్నారు. వారి సమస్యలకు పరిష్కారం చూపకపోగా, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కీలకమైన నామినేటెడ్ పదవిపై జేసీ పవన్‌కుమార్‌రెడ్డి కన్ను! కన్ఫార్మ్ అయినట్లు సమాచారం
జేసీ బ్రదర్స్...ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జేసీ కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత అలాంటింది. దాదాపు 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని నడిపిన జేసీ దివాకర్‌రెడ్డి వయోభారంతో ఇక చాలించుకున్నారు. ఆయన వారసుడిగా తెరపైకి వచ్చిన కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి(Pawan Kumar Reddy) తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లోనే ఓటమి చవిచూశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఆదిలాబాద్, బెల్లంపల్లిలో గాలినాణ్యత ఎంత దారుణంగా పడిపోయిందంటే?
తెలంగాణలో ఈ రోజు మంచిర్యాల, ఆదిలాబాద్, బెల్లంపల్లి, రామగుండంలలో వాయు నాణ్యతా పడిపోయింది. ఇక్కడి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AOI) పూర్ గా చూపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు సైతం స్వల్ప చికాకులను అనుభవిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో గాలి నాణ్యత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈరోజు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మందపల్లి, పుంగనూరు లలో గాలి నాణ్యత పూర్తిగా పడిపోయింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
వారసత్వాన్ని ప్రజలపై రుద్దకండి- రక్తసంబంధాన్నే పక్కన పెట్టేస్తాను- పార్టీ నేతలకు పవన్ హెచ్చరిక
వారసత్వ రాజకీయాలపై జసేనన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్టీ నేతలకు ఘాటు హెచ్చరికలు చేశారు. క్రమశిక్షణ తప్పి తనకు తలనొప్పులు తీసుకురావద్దని సూచించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో తన పార్టీ ప్రజాప్రతినిధులను సన్మానించారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడిన పవన్... కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయా కుటుంబాల నుంచి కొత్త తరం నాయకులు రావడం సంతోషమే అన్న పవన్ కల్యాణ్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి