CM Jagan Sullurupeta Tour Postponed: వర్షాల ఎఫెక్ట్-సీఎం జగన్ సూళ్లూరుపేట పర్యటన వాయిదా
AP CM Jagan News : ఏపీ సీఎం వైఎస్ జగన్ సూళ్లూరుపేట పర్యటన వాయిదా పడింది. బయల్దేరేందుకు గంట ముందు పర్యటన వాయిదా పడినట్టు సీఎంవో ప్రకటించింది. త్వరలోనే రీ షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపింది.
CM YS Jagan Sullurupeta Tour Postponed: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (Andhra pradesh CM) వైఎస్ జగన్ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట (Sullurupeta) పర్యటన వాయిదా పడింది. ఇవాళ సూళ్లూరుపేట నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటించాల్సి ఉంది. ఉదయం 8గంటల 30 నిమిషాలకు పర్యటనకు బయల్దేరాల్సి ఉంది. అయితే.... సరిగ్గా గంట ముందు పర్యటన రద్దు చేసినట్టు సీఎం క్యాంపు కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు (Rains) పడుతున్నాయి. వర్షాల వల్ల హెలికాప్టర్ ప్రయాణానికి ఇబ్బందులు కలుగుతాయని.. అంతేకాదు... సీఎం సభకు వచ్చే ప్రజలు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక... సీఎం జగన్ పర్యటనను వాయిదా వేసినట్టు సీఎం క్యాంపు కార్యాలయం ప్రకటించింది. సూళ్లూరుపేట బయల్దేరాల్సి సరిగ్గా గంట ముందు... పర్యటన వాయిదా పడినట్టు తెలిపింది. త్వరలోనే ఈ పర్యటనను రీ షెడ్యూల్ చేస్తామని తెలిపింది.
సీఎం వైఎస్ జగన్ తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. వాకాడు మండలం రాయదరువు దగ్గర ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేయాల్సి ఉంది. దీంతో పాటు 94 కోట్ల రూపాయలతో పులికాట్ (Pulicat) సరస్సు సముద్ర ముఖ ద్వారం పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. అంతేకాదు ఓఎన్‌జీసీ (ONGC) పైప్‌లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని బాధితులకు కూడా సూళ్లూరుపేట నుంచి నిధులు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు తడ మండలం, మాంబట్టులోని పారిశ్రామికవాడలో బహిరంగ సభకి భారీ ఏర్పాట్లు చేశారు. కానీ వర్షాల కారణంగా ఈ పర్యటన వాయిదా పడింది.