Anant Radhika Enguagement: అంగరంగ వైభవంగా అనంత్-రాధిక నిశ్చితార్థం, ఈరోజు సాయంత్రమే!
Anant Radhika Engagement: ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, విరేన్ మర్చెంట్ కూతురు రాధికా మర్చెంట్ ల నిశ్చితార్థం ఈరోజు సాయంత్రం ముంబయిలో అంగరం వైభవంగా జరగనుంది.
Anant Radhika Engagement: ముకేష్, నీతూ అంబానీల కుమారుడు అనంత్ అంబానీ తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా మర్చెంట్ లు పెళ్లి చేసుకోబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజే ముంబయి వేదికగా వీరిద్దరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ వేడుకలు అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు హాజరయ్యే వారిని భారత సంప్రదాయ దుస్తుల్లో హాజరు కావాలని కోరారు. వీరెన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ అనంత్ అంబానీ కొన్నాళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. గత మంగళవారం అనంత్ అంబానీ రాధిక మర్చంట్ మెహందీ వేడుక ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ రోజు సాయంత్రం నిర్వహించనున్న నిశ్చితార్థాన్ని గోల్ దానాగా పిలవనున్నారు. గుజరాతీయ సంప్రదాయం ప్రకారం ఈ గోల్ దానా వేడుక జరగనుంది. నిశ్చితార్థానికి హాజరయ్యే అతిథులకు బెల్లం, దనియాలు అందిస్తారు. ఈ వేడుకను గోల్ దానాగా పిలుస్తుంటారు. అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల గోల్ దానా వేడుక ఈ రోజు సాయంత్రం 7 గంటలకు అల్టామౌంట్ రోడ్, ముంబయిలో జరగనుంది.
డిజైనర్ లుక్కులో అతిలోక సుందరిలా మెరిసిపోయిన రాధిక..
మంగళవారం జరిగిన మెహందీ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. మెహందీ వేడుక కోసం రాధికా మర్చంట్ దుస్తులను ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్లు అబి జానీ, సందీప్ ఖోస్లా రాధికా దుస్తులను తీర్చిదిద్దారు. మల్టీకలర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన పింక్ కలర్ లెహంగాలో రాధికా అద్భుతంగా ఉన్నారు. లెహంగాను మిర్రర్ వర్క్ తో రూపొందించారు. కింద గోల్డెన్ బ్యాండ్ చూడచక్కగా ఉన్నారు. హాఫ్ స్లీవ్ మ్యాచింగ్ బ్లౌజ్ ధరించారు. పింక్ కలర్ దుపట్టా మంచి లుక్ ఇచ్చారు. ఈ డిజైనర్ డ్రెస్సులో రాధిక అతిలోక సుందరిలా మెరిసిపోయారు. ఆమెకు సంబంధించిన ఫోటోలు నెట్టింట దర్శనమిచ్చాయి. మెహందీ వేడుకలో భాగంగా రాధికా మర్చంట్ డ్యాన్స్ చేసిన వీడియో కూడా వైరల్ అవుతోంది. కళంక్ సినిమాలోని ఆలియా భట్ సాంగ్ ఘర్ మోర్ పర్దేశియా పాటకు రాధికా మర్చంట్ అద్భుతంగా డ్యాన్స్ చేశారు. అనంత్ అంబానీ రాధిక మర్చంట్ పెళ్లి నిశ్చయం అయినప్పటి నుంచి ముఖేష్ అంబానీ నివాసం యాంటిలియా ఫోటోలు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి.
రాధికా మర్చంట్ 2017లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. లగ్జరీ హాలిడే హోం డెవలపర్ గ్రూపులో చేరారు. తర్వాత ఆమె కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఎన్కోర్ హెల్త్ కేర్‌లో డైరెక్టర్‌గా మారారు. రాధికా మర్చంట్ శిక్షణ పొందిన భరతనాట్య నృత్యకారిణి. గురు భావన థాకర్ వద్ద భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు. తర్వాత ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో ఆమె ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమానికి అమీర్ ఖాన్, సాగరిక ఘాట్గే, రణవీర్ సింగ్, సల్మాన్ ఖాన్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు.