అన్వేషించండి

Amul Milk Prices Hike: మరోసారి అమూల్ పాల ధర పెంపు, ఈసారి ఎంతంటే?

Amul Milk Prices Hike: అమూల్ పాల ధరను పెంచుతూ.. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది. లీటర్ కు రెండు రూపాయల చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. 

Amul Milk Prices Hike: ఇప్పటికే నిత్యావసర వస్తువులపై ధరలు పెరిగాయి. ఇది చాలదన్నట్లు ఇప్పుడు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) శనివారం రాష్ట్రంలో అమూల్ పాల ధరను లీటరుకు 2 రూపాయలు పెంచింది. డిసెంబర్ 2022లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత పాల ధరలు పెరగడం ఇదే తొలిసారి. గుజరాత్ లోని జీసీఎంఎంఎఫ్.. రాష్ట్రంలోని పాల సహకార సంఘాల అపెక్స్ బాడీ సాధారణంగా పాల ధరల పెంపుదల గురించి ముందుగానే ప్రకటిస్తారు. కానీ ఈసారి నేరుగా పాల ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి ప్రకటన చేయకుండా అమూల్ పాల ధర లీటరుకు 2 రూపాయల చొప్పున పెంచారు. రాష్ట్రంలో పశుగ్రాసం, రవాణా ఖర్చులు పెరగడంతోపాల ఉత్పత్తి వ్యయం పెరిగిన దృష్ట్యా ధరలు పెంచినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

కొత్త ధరలు ఎంతంటే..?

ధరల సవరణ తర్వాత ప్రస్తుతం అమూల్ గేదె పాల ధర లీటరుకు రూ.68కి చేరుకోగా, అమూల్ గోల్డ్ ధర రూ.64కు, అమూల్ శక్తి లీటరుకు రూ.58కి చేరుకుంది. అమూల్ ఆవు పాల ధర ఇప్పుడు లీటరుకు రూ.54కి, అమూల్ తాజా రూ.52కి, అమూల్ టీ-స్పెషల్ లీటరుకు రూ.60కి పెంచారు.

గుజరాత్‌కు మినహాయింపు..

గత ఆరు నెలల్లో, జీసీఎంఎంఎఫ్ భారతదేశం అంతటా వివిధ బ్రాండ్ల అమూల్ పాల ధరలను రెండు సార్లు పెంచింది. అయితే దీని నుంచి గుజరాత్‌కు మినహాయింపు లభించింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమూల్ గుజరాత్ మినహా అన్ని మార్కెట్లలో 2022 అక్టోబర్‌లో లీటరుకు రూ. 2, ఆపై ఫిబ్రవరి 2023లో లీటరుకు రూ. 3 పెంచింది. ఇప్పుడు ఈసారి అది చేయలేదు.

ఫిబ్రవరిలోనే 3 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటన

అమూల్ పాల ధరలను లీటరుకు రూ. 3 పెంచినట్లు.. సహకార బ్రాండ్ అమూల్‌ను ప్రమోట్ చేస్తున్న గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది అక్టోబర్‌లో గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాల్లో బ్రాండ్ తన ఫుల్‌క్రీమ్ మిల్క్, గేదె పాల ధరలను లీటరుకు 2 రూపాయల చొప్పున పెంచింది. దీనికి ముందు ఆగస్ట్ 2022లో లీటరుకు రూ. 2 పెంచారు. గుజరాత్, ఢిల్లీ ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, ముంబై, అహ్మదాబాద్, సౌరాష్ట్ర ప్రాంతంలోని అమూల్ పాలను విక్రయించే అన్ని ఇతర మార్కెట్‌లలో పాల ధరలను లీటరుకు రూ. 2 పెంచాలని జీసీఎంఎంఎఫ్ నిర్ణయించిందని ఆనంద్-ప్రధాన కార్యాలయ సమాఖ్య తెలిపింది.

ధరలు పెంచడంతో ప్రస్తుతం అమూల్ గోల్డ్ పాలు లీటర్ ధర 66 రూపాయలు అయింది. అమూల్ తాజా పాలు లీటర్ ధర రూ.54, అమూల్ ఆవు పాటు లీటర్ ధర రూ.56, అమూల్ ఏ2 గేదె పాల ధర లీటర్ రూ.70 కు పెంచుతూ అమూల్ డెయిరీ నిర్ణయం తీసుకుంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీతోపాటు దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలో మదర్ డెయిరీ లీడింగ్ మిల్క్ సప్లయర్, పాలీ ప్యాక్స్, వెండింగ్ మిషన్ల ద్వారా రోజూ 30 లక్షల లీటర్లకుపైగా పాలను విక్రయిస్తోంది. అమూల్ దేశంలోనే లీడింగ్ మిల్క్ సప్లయర్, అమూల్ యజమానులు కూడా లక్షల మంది రైతులే. 75 ఏళ్ల క్రితం రెండు గ్రామాల నుంచి 247 లీటర్ల పాలను సేకరించడంతో మొదలైన అమూల్ ప్రయాణం ఇప్పుడు 260 లక్షల లీటర్లకు దూసుకెళ్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget