అన్వేషించండి

Amit Shah Bihar Visit: 'నితీశ్‌ది వెన్నుపోటు రాజకీయం- 2024లో భాజపా తడాఖా చూపిస్తాం'

Amit Shah Bihar Visit: బిహార్ సీఎం నితీశ్ కుమార్‌పై భాజపా అగ్ర నేత అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు.

Amit Shah Bihar Visit: 2024 సార్వత్రిక ఎన్నికలకు భాజపా ఇప్పుడే ప్రచారం మొదలుపెట్టింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం పూర్నియాలో జరిగిన మెగా ర్యాలీలో ప్రసంగించారు. 'జన్ భావన మహాసభ' పేరుతో నిర్వహించిన ర్యాలీలో నితీశ్ కుమార్‌పై అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు.

" నితీశ్ కుమార్.. భాజపాకు వెన్నుపోటు పొడిచారు. రాజకీయ పొత్తులు మార్చుకుని నితీశ్ బాబు ప్రధాని కాగలరా? రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చాలా మందికి నితీశ్ ద్రోహం చేశారు. లాలూ జీ, రేపు మిమ్మల్ని వదిలిపెట్టి నితీశ్ బాబు కాంగ్రెస్ ఒడిలో కూర్చుంటారు జాగ్రత్త!  2014లో మీకు (బిహార్ సీఎం నితీష్ కుమార్) కేవలం 2 లోక్‌సభ స్థానాలు మాత్రమే వచ్చాయి. 2024 లోక్‌సభ ఎన్నికలు రానివ్వండి.. బిహార్ ప్రజలు.. లాలూ-నితీష్ ద్వయాన్ని తుడిచి పెట్టేస్తారు. 2025 ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో ఇక్కడ మేం అధికారంలోకి రాబోతున్నాం.                                               "
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

నితీశ్ ప్రయత్నాలు

ఇటీవల భాజపాతో తెగతెంపులు చేసుకున్న నితీశ్ కుమార్ మళ్లీ లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్‌జేడీతో చేరి బిహార్ ముఖ్యమంత్రి అయ్యారు. బిహార్ తర్వాత నితీశ్ కుమార్ ఇప్పుడు భాజపాను కేంద్రం నుంచి గద్దె దించాలని చూస్తున్నారు. ఇందుకోసం ఆయన సన్నాహాలు కూడా మొదలుపెట్టారు.

ఇటీవల నితీశ్.. దిల్లీలో పర్యటించి మొత్తం విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు.  "మేం ఏర్పాటు చేసేది థర్డ్ ఫ్రంట్ కాదు మెయిన్ ఫ్రంట్" అంటూ నితీశ్ చెబుతున్నారు. ప్రధాని పదవి రేసులో ప్రతిపక్షాల నుంచి నితీశ్ పేరే ఎక్కువగా వినిపిస్తున్నప్పటికీ ఆ వార్తలను ఆయన తోసిపుచ్చారు. అయితే జేడీయూ, దాని మిత్రపక్షాలు మాత్రం నితీశ్‌ను ప్రధాని పదవి రేసులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

ఈ సందర్భంగా నితీశ్ కుమార్ ఇటీవల సంచలన ప్రకటన చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాయేతర కూటమి గెలిస్తే అన్ని వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.

మేము (ప్రతిపక్షం) వచ్చేసారి (కేంద్రంలో) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, వెనుకబడిన రాష్ట్రాలకు ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వకూడదు? మేము బీహార్ గురించి మాత్రమే మాట్లాడటం లేదు, ఇతర వెనుకబడిన రాష్ట్రాల గురించి కూడా మాట్లాడుతున్నాం. ప్రత్యేక హోదా సాధించాలి. "

టాప్ హెడ్ లైన్స్

Breaking News: యూత్ కాంగ్రెస్ నేతల్ని అడ్డుకున్న పోలీసులు.. ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత.. 
యూత్ కాంగ్రెస్ నేతల్ని అడ్డుకున్న పోలీసులు.. ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత.. 
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Shreyas Iyer World Record: కెప్టెన్ గా శ్రేయస్ వరల్డ్ రికార్డ్ .. జింబాబ్వేపై విక్టరీతో 7 మ్యాచుల నిరీక్షణకు ఎండ్ కార్డ్, ధోని రికార్డు బ్రేక్ 
కెప్టెన్ గా శ్రేయస్ వరల్డ్ రికార్డ్ .. జింబాబ్వేపై విక్టరీతో 7 మ్యాచుల నిరీక్షణకు ఎండ్ కార్డ్, ధోని రికార్డు బ్రేక్ 
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
హైరైడర్ హైబ్రిడ్‌ & డస్టర్ టర్బో DCT కంపారిజన్‌ - లాంగ్‌టర్మ్‌లో ఎక్కువ లాభం ఇచ్చేది ఏ కారు?
సిటీలోఎక్కువ డ్రైవ్‌ చేసేవాళ్లకు ఏ SUV బెస్ట్‌? టయోటా హైరైడర్ హైబ్రిడ్‌ Vs రెనాల్ట్ డస్టర్‌ - ఏది కొనాలి?
Shreyas Iyer World Record: కెప్టెన్ గా శ్రేయస్ వరల్డ్ రికార్డ్ .. జింబాబ్వేపై విక్టరీతో 7 మ్యాచుల నిరీక్షణకు ఎండ్ కార్డ్, ధోని రికార్డు బ్రేక్ 
కెప్టెన్ గా శ్రేయస్ వరల్డ్ రికార్డ్ .. జింబాబ్వేపై విక్టరీతో 7 మ్యాచుల నిరీక్షణకు ఎండ్ కార్డ్, ధోని రికార్డు బ్రేక్ 
Embed widget