Ahmedabad Flight Crash: విమానాశ్రయం సరిహద్దు దాటగానే కుప్పకూలిన విమానం - అహ్మదాబాద్ ఘోరంలో అసలేం జరిగింది?
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం అత్యంత విషాదంగా జరిగింది. ఇలా బయలుదేరగానే ఒక్క నిమిషం కాక ముందు అలా కుప్పకూలిపోయింది.

Air India Plane Crash Ahmedabad During Takeoff: లండన్ వెళ్లాల్సిన విమానం అలా గాల్లోకి లేచిన వెంటనే... విమానాశ్రయం సరిహద్దు గోడ దాటిన వెంటనే కుప్పకూలింది. ఎయిర్ ఇండియా B787 విమానం VT-ANB, ఫ్లైట్ AI-171గా అహ్మదాబాద్ నుండి లండన్ లోని గాట్విక్ ఎయిర్ పోర్టుకు బయలుదేరింది. అన్ని ముందస్తు చెకింగ్స్ పూర్తి చేసుకున్నప్పటికీ ఇలా జరగడంతో పెను విషాదం చోటు చేసుకుంది. విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు.ఇందులో 2 పైలట్లు మరియు 10 మంది క్యాబిన్ క్రూ ఉన్నారు.
విమానం కెప్టెన్ సుమీత్ సభర్వాల్ పైలట్ గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు 8200 గంటల ఫ్లైయింగ్ అనుభవం ఉంది. ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్‌కు 1100 గంటల ఫ్లైయింగ్ అనుభవం ఉంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకారం, విమానం అహ్మదాబాద్‌లోని రన్‌వే 23 నుండి 1339 IST (0809 UTC)కు బయలుదేరింది. ఇది ATCకి MAYDAY కాల్ ఇచ్చింది, కానీ ఆ తర్వాత ATC చేసిన కాల్‌లకు విమానం నుండి ఎలాంటి స్పందన రాలేదు. రన్‌వే 23 నుండి బయలుదేరిన వెంటనే విమానం విమానాశ్రయ సరిహద్దు వెలుపల భూమిపై పడిపోయింది. ప్రమాద స్థలం నుండి దట్టమైన నల్లని పొగలు లేచినట్లు DGCA తెలిపింది.
Flight AI171, operating Ahmedabad-London Gatwick, was involved in an incident today, 12 June 2025. At this moment, we are ascertaining the details and will share further updates at the earliest on https://t.co/Fnw0ywg2Zt and on our X handle (https://t.co/Id1XFe9SfL).
— Air India (@airindia) June 12, 2025
-Air India…
ఈ ఘోర ప్రమాదంలో ప్రయాణికులు, కానీ సిబ్బంది కానీ ఎవరైనా ప్రాణాలతో బయటపడితే అద్భుతమేనని ఇలాంటి ప్రమాదాలలను విశ్లేషించే నిపుణులు చెబుతున్నారు. విమానం గాలలోకి లేచి. ఆరు వందకుపైగా అడుగులకు ఎత్తుకు వెళ్లిన తర్వాత హఠాత్తుగా కూలిపోయింది. ఇలా కూలిపోవడం అసాధారణం అని.. ఎందుకు ఇలా జరిగిందో బ్లాక్ బాక్స్ వంటి ద్వారా తెలుసుకుంటేనే తెలుస్తుందని అంటున్నారు.
Air India Ahemdabad-London international flight has crashed during take off in Ahemdabad of Gujarat. 133 passengers reportedly were on board. High casualties expected. Emergency response teams are on site now. Rescue work is underway. pic.twitter.com/SxekWpvqTG
— Aditya Raj Kaul (@AdityaRajKaul) June 12, 2025
విమాన ప్రమాద మేఘాలు అహ్మదాబాద్ మొత్తం కమ్ముకున్నాయి. దీంతో ప్రజలు కూడా కంగారు పడ్డారు. విమానం కూలిపోయిందని వివరాలు తెలుసుకుంటున్నామని ఎయిర్ ఇండియా వర్గాలు చెబుతున్నాయి. ఈ విమానానికి అన్ని టెస్టులు చేసిన తర్వాత ఫ్లైయింగ్ కు అనుమతి ఇస్తారు. అలాంటప్పుడు.. ఇలా హఠాత్తుగా కుప్పకూలిపోేయే పరిస్థితి ఉండదని అంచనా వేస్తున్నారు.
Terrifying final moments of Air India Flight AI 171 crashing into a residential area in Ahmedabad today. Clearly catastrophic loss of lift. Details awaited. pic.twitter.com/TbgCjPLXXc
— Shiv Aroor (@ShivAroor) June 12, 2025





















