Gujarat bridge collapse: సడెన్‌గా కూలిన బ్రిడ్జి - సినిమాల్లోలా వేలాడిన ట్యాంకర్లు, కార్లు - గుజరాత్‌లో వంతెన ప్రమాదం వీడియోలు
Bridge collapse: గుజరాత్‌లో ఓ వంతెన కూలిపోయిన ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. బిజీగా ఉండే వంతెన మధ్యలో ఓ సెడెన్ గా కిందపడిపోయింది. లారీ, బస్సు, ద్విచక్ర వాహనాలు నదిలో పడిపోాయాయి.

Gujarat Vadodara bridge collapses : గుజరాత్‌లోని వడోదర జిల్లాలో బుధవారం తెల్లవారుజామున 43 ఏళ్ల వంతెన కూలిపోవడంతో మహిసాగర్ నదిలో అనేక వాహనాలు పడిపోయాయి. కనీసం తొమ్మిది మంది మరణించారు మరో తొమ్మిది మందిని రక్షించారు.
At least 3 killed, 10 rescued after six vehicles plunged into Mahisagar river following catastrophic collapse of Gambhira bridge portion in Padra taluka of Vadodara district at around 7:45 am today.
— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) July 9, 2025
In recent years bridges of #Bihar, #Gujarat have constantly made into headlines pic.twitter.com/tRYJXOmATT
వడోదర జిల్లాలోని పద్రా తాలూకాలోని ముజ్‌పూర్‌లో ఉన్న ఈ వంతెన ముజ్‌పూర్‌ను ఆనంద్ జిల్లాలోని గంభీరతో పాటు మధ్య గుజరాత్‌ను సౌరాష్ట్రకు కలిపే రహదారిపై ఉంది. ప్రమాదం జరిగిన వీడియోలు బీతావహంగా ఉన్నాయి. వంతెన నుండి ట్యాంకర్ ప్రమాదకరంగా వేలాడుతూ కనిపించింది. తర్వాత అది నదిలో పడిపోయింది. కనిపిస్తున్నప్పటికీ, నదిలో చిక్కుకున్న ఒక మహిళ తన కొడుకు కోసం సహాయం కోసం కేకలు వేస్తున్నట్లుగా కొన్ని శ్యాలు ఉన్నాయి.
In Gujarat’s Vadodara, the Gambhira Bridge connecting Anand and Vadodara collapsed.
— Mohammed Zubair (@zoo_bear) July 9, 2025
Several vehicles, including a truck, a tanker, and cars, plunged into the rive. Rescue and relief operations are currently underway. pic.twitter.com/0FFJ4GPZua
వంతెనలోని ఓ భాగం అకస్మాత్తుగా కిందపడిపోయినప్పుడు రెండు ట్రక్కులు, ఒక ఈకో వ్యాన్, ఒక పికప్ వ్యాన్, ఒక ఆటో-రిక్షా నదిలో పడిపోయాయని అధికారులు తెలిపారు. వడోదర జిల్లా అగ్నిమాపక , అత్యవసర బృందం, అలాగే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) లను సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్‌లో సహాయం చేయడానికి లోతైన నీటి డైవ్‌లతో పాటు ప్రమాద స్థలానికి ఒక బృందాన్ని పంపినట్లు NDRF ప్రకటించింది. వంతెన కూలినప్పుడు రెండు మోటార్ సైకిళ్ళు కూడా ఉన్నాయి, కానీ ఇప్పటివరకు, వారు కూడా నదిలోకి పడిపోయారా లేదా అనే దానిపై నిర్ధారణ లేదని అధికారులు చెబుతున్నారు.
#WATCH | Vadodara, Gujarat | The Gambhira bridge on the Mahisagar river, connecting Vadodara and Anand, collapses in Padra; local administration present at the spot. pic.twitter.com/7JlI2PQJJk
— ANI (@ANI) July 9, 2025
క్షతగా త్రులను వడోదర జిల్లాలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. రక్షించి ఐదుగురిలో నలుగురు తీవ్ర గాయాలతో బయటపడారరు. 43 సంవత్సరాల పురాతనమైన వంతెనను గత సంవత్సరం మరమ్మతులు చేసినట్లుగా అధికార వర్గాలుచెబుతున్నాయి.





















