76th Infantry Day: 'పీఓకేను హస్తగతం చేసుకుంటాం'- పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్
76th Infantry Day: త్వరలోనే పీఓకేను హస్తగతం చేసుకుంటామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
76th Infantry Day: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు.పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో అరాచకాలు జరుగుతున్నాయని ఇలా చేస్తే తర్వాత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని రాజ్‌నాథ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను త్వరలోనే తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు.
శ్రీనగర్‌లో నిర్వహించిన 'శౌర్య దివస్' కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ భూభాగంపై జరిగిన తొలిదాడిని 1947 అక్టోబర్ 27 సైన్యం తిప్పికొట్టింది. దీనిని పురస్కరించుకొని ఆర్మీ 'ఇన్‌ఫాంట్రీ డే'ను జరుపుకొంటుంది.
అమిత్ షా
సహించేది లేదు
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం.. ఉగ్రవాదాన్ని ఎట్టపరిస్థితుల్లో ఉపేక్షించలేదని అమిత్ షా అన్నారు. ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశంలోనే కశ్మీర్‌ను శాంతివనంగా తీర్చిదిద్దుతామన్నారు.
కశ్మీర్ ప్రాంతీయ పార్టీలతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సైతం కశ్మీర్‌లో శాంతి నెలకొనాలంటే పాక్‌తో చర్చలు జరపాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
Also Read: Hate Speech Case: హేట్ స్పీచ్ కేసులో ఆజం ఖాన్‌కు మూడేళ్లు జైలు శిక్ష