News
News
X

Hate Speech Case: హేట్ స్పీచ్ కేసులో ఆజం ఖాన్‌కు మూడేళ్లు జైలు శిక్ష

Hate Speech Case: సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌ను విద్వేషపూరిత ప్రసంగం కేసులో దోషిగా తేల్చింది కోర్టు. ఆయనకు మూడేళ్లు జైలు శిక్ష విధించింది.

FOLLOW US: 
 
Hate Speech Case: విద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌కు భారీ షాక్ తగిలింది. ఈ కేసులో ఆజం ఖాన్‌ను దోషిగా తేల్చింది ఉత్తర్‌ప్రదేశ్‌ రాంపుర్ కోర్టు.

2019 నాటి విద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ సహా మరో ఇద్దరు నిందితులకు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. దీంతో పాటు రూ.2000 జరిమానా విధించింది. ఆజం ఖాన్‌పై అవినీతి, దొంగతనం సహా మొత్తం దాదాపు 90 కేసులు ఉన్నాయి.

News Reels

చీటింగ్ కేసులో జైలుకెళ్లిన ఆజం ఖాన్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడంతో ఈ ఏడాది మొదట్లో జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన దాదాపు రెండేళ్లపాటు జైలులో గడిపారు.

ఇదే కేసు

హేట్ స్పీచ్ కేసులో ఆయనకు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడటంతో ఆయన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు. 2019లో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, అప్పటి కలెక్టర్ ఆంజనేయకుమార్ సింగ్‌పై ఆజం ఖాన్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. 

జయప్రదపై

2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో యూపీ రామ్​పుర్​​ లోక్​సభ స్థానానికి పోటీ చేసిన సినీనటి జయప్రదపై ఓ బహిరంగ సభలో ఆజం ఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

    "ఆమెను (జయప్రద) రామ్​పుర్​​కు నేనే తీసుకువచ్చాను. ఆమె జోలికి ఎవరూ రాకుండా నేను చూసుకున్నాను. అందుకు మీరే సాక్ష్యం. రాంపుర్​, ఉత్తర్​ప్రదేశ్​, దేశ ప్రజలకు ఆమె నిజస్వరూపం తెలియడానికి 17 ఏళ్లు పట్టింది. నేను మాత్రం 17 రోజుల్లోనే కనిపెట్టాను......"

    -ఆజంఖాన్, ఎస్పీ సీనియర్​ నేత

ఆజం ఖాన్​ వ్యాఖ్యలపై అప్పట్లో జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలని షోకాజ్​ నోటీసులు జారీచేసింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.

Also Read: Covid Patient in China: క్రేన్ సాయంతో కొవిడ్ రోగుల తరలింపు- చైనాలో షాకింగ్ ఘటన!

Published at : 27 Oct 2022 04:41 PM (IST) Tags: samajwadi party Azam Khan Hate Speech Case

సంబంధిత కథనాలు

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

TSPSC JL Recruitment: 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు ఇలా!

TSPSC JL Recruitment: 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు ఇలా!

వరంగల్ నగరంలో నూతన సీపీ అకస్మిక తనిఖీలు, పోలీసులకు కీలక సూచనలు

వరంగల్ నగరంలో నూతన సీపీ అకస్మిక తనిఖీలు, పోలీసులకు కీలక సూచనలు

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Vijayawada Pipe Leak: స్విమ్మింగ్ పూల్ లో క్లోరిన్ పైప్ లీక్, చిన్నారులకు అస్వస్థత

Vijayawada Pipe Leak: స్విమ్మింగ్ పూల్ లో క్లోరిన్ పైప్ లీక్, చిన్నారులకు అస్వస్థత

టాప్ స్టోరీస్

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp :  కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

Woman Kidnap Case:యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ - నిందితుడితో గతంలోనే పరిచయం, పెళ్లికి నో చెప్పడంతో రచ్చరచ్చ

Woman Kidnap Case:యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ - నిందితుడితో గతంలోనే పరిచయం, పెళ్లికి నో చెప్పడంతో రచ్చరచ్చ