Covid Patient in China: క్రేన్ సాయంతో కొవిడ్ రోగుల తరలింపు- చైనాలో షాకింగ్ ఘటన!
Covid Patient in China: చైనాలో కొవిడ్ రోగిని క్రేన్‌తో తరలిస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Covid Patient in China: చైనాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే వుహాన్ నగరంలో పాక్షిక లాక్‌డౌన్ విధించింది ప్రభుత్వం. తాజాగా కరోనా రోగులపై అమానుషంగా ప్రవర్తిస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా సోకిన వారిని తరలించేందుకు చైనాలో క్రేన్ వినియోగిస్తున్నారు.
中国式现代化。【方老师,投稿一个防疫大革命的荒谬视频。一个阳性患者被吊机吊出小区,因为他们不敢进去接,也不想患者的细菌留在地板上,这样能保证最小的接触面积。】 pic.twitter.com/2BM3Afm3V6
— 方舟子 (@fangshimin) October 25, 2022
ఇదీ సంగతి
కొవిడ్ పేషెంట్‌ను క్రేన్‌కు కట్టి కంటైనర్‌లోకి చేర్చుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనా అధికారులు ఒక కొవిడ్ పాజిటివ్ రోగిని క్రేన్ సహాయంతో పైకి ఎత్తి సమీపంలో ఉన్న కంటైనర్ గదికి తరలిస్తున్నట్లు ఈ వీడియోలో ఉంది. భౌతిక దూరం పాటించడం కోసం మరీ ఇంతలా చేయాలా అని నెటిజన్లు షాక్ అవుతున్నారు.
చైనాకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ వీడియో ఏ నగరానికి చెందినదో తెలియలేదు. చైనాలో వరుసగా మూడో రోజు కూడా 1,000 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడి ప్రభుత్వం దేశవ్యాప్తంగా మరిన్ని ఆంక్షలను విధించింది. ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా చూసేందుకు చైనా అధికారులు చాలా శ్రమిస్తున్నారు.
లాక్‌డౌన్
వుహాన్‌లో మళ్లీ కేసులు పెరుగుతుండటంతో పలు జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్ విధించారు. సుమారు 9 లక్షల జనాభా కలిగిన వుహాన్‌లోని హన్‌యాంగ్ జిల్లాలో మంగళవారం ఒక్కరోజే 18 కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు అత్యవసరం మినహా మిగతా కార్యకలాపాలన్నింటినీ మూసివేయాలని నిర్ణయించారు.
సూపర్ మార్కెట్లు, ఫార్మసీలను మాత్రమే తెరిచేందుకు అనుమతిచ్చారు. ఈ లాక్‌డౌన్ నిబంధనలు వచ్చే ఆదివారం వరకూ ఉంటాయని.. పరిస్థితులను బట్టి తదుపరి కొనసాగింపు ఉంటుందని చెప్పారు.
తొలిసారి అదే
ప్రపంచంలోనే తొలిసారి లాక్‌డౌన్‌లోకి వెళ్లిన ప్రాంతంగా వుహాన్ నిలిచింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తుంటే.. చైనా మాత్రం జీరో-కొవిడ్ వ్యూహాన్ని పాటిస్తోంది.
కరోనా మాట దేవుడెరుగు ముందు.. ఆంక్షలు పేరుతో జనాలను చైనా చంపేస్తోందని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. కఠిన లాక్‌డౌన్‌లతో చైనాలో ప్రజలు ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి.
చైనా అధికారుల తీరును చూస్తుంటే కరోనా వైరస్ కంటే లాక్‌డౌన్‌తోనే చైనా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. షాంఘై వంటి నగరాల్లో భారీ స్థాయిలో ఇటీవల కొవిడ్ టెస్టులు జరిపారు. కొవిడ్ నమూనాలు ఇచ్చేందుకు నిరాకరించిన ఓ యువతిని బలవంతంగా నేలపై పడేసి శాంపిల్‌ను సేకరించిన ఓ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది.
这个强行检测姿势应该让全世界看一看🤬😡 pic.twitter.com/PUwnfCXF4t
— 浩哥i✝️i🇺🇸iA2 (@S7i5FV0JOz6sV3A) April 27, 2022
Also Read: Gujarat News: 'ఫైర్ హెయిర్ కట్' చేయిస్తున్నారా? ఓ సారి ఈ వీడియోపై లుక్కేయండి!