News
News
X

Gujarat News: 'ఫైర్ హెయిర్ కట్' చేయిస్తున్నారా? ఓ సారి ఈ వీడియోపై లుక్కేయండి!

Gujarat News: ఫైర్ హెయిర్ కట్ చేస్తోన్న సమయంలో మంటలు కారణంగా ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

FOLLOW US: 
 
Gujarat News: 'ఫైర్ హెయిర్‌ కట్' (Fire Hair Cut) విదేశాల్లోనే కాదు భారత్‌లో కూడా కొన్నాళ్లు ట్రెండింగ్‌లో ఉంది. కుర్రాళ్లు ఈ హెయిర్ కట్ చేయించుకునేందుకు ఇష్టపడేవారు. అయితే ఈ ఫైర్ హెయిర్ కట్ వల్ల ఒక్కోసారి ప్రమాదానికి గురైన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా గుజరాత్‌లో అదే జరిగింది. ఓ యువకుడు ఈ హెయిర్ కట్ చేయించుకునే సమయంలో గాయపడ్డాడు.

ఇదీ జరిగింది

వల్సాద్ జిల్లా వాపి పట్టణంలో బుధవారం ఓ సెలూన్‌లో 18 ఏళ్ల యువకుడు ఫైర్ హెయిర్‌కట్ (Fire Hair Cut) చేయించుకోవడానికి వచ్చాడు. అయితే జుట్టుకు మంట పెట్టే సమయంలో ప్రమాదం జరిగింది. సెలూన్ షాప్ వ్యక్తి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా అదుపు కాలేదు. దీంతో యువకుడు.. సెలూన్ షాప్ నుంచి బయటకు పరుగులు తీశాడు. మొత్తానికి ఎలాగోలా మంటలను ఆర్పారు. కానీ అప్పటికే బాధితుడి మెడ, ఛాతీపై కాలిన గాయలయ్యాయి.

బాధితుడ్ని వెంటనే స్థానికులు వాపిలోని ఆసుపత్రికి. తీసుకెళ్లారు. అక్కడ నుండి యువకుడ్ని వల్సాద్‌లోని సివిల్ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు వాపి టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి మెరుగ్గానే ఉందని పోలీసులు తెలిపారు.

News Reels

" వాపిలోని భడక్‌మోరా ప్రాంతానికి చెందిన బాధితుడు సుల్పాడ్ ప్రాంతంలోని సెలూన్‌లో 'ఫైర్ హెయిర్‌కట్' (Fire Hair Cut) చేయించుకోవడానికి వెళ్లాడు. అయితే అనుకోకుండా మంటలు వ్యాపించడంతో బాధితుడుకి గాయాలయ్యాయి. ఈ కేసులో బాధితుడు, సెలూన్ షాప్ ఓనర్ వాంగ్మూలాలను తీసుకుంటున్నాం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.  బాధితుడి వాంగ్మూలాన్ని తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. బాధితుడ్ని వల్సాద్‌లోని సివిల్ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడి నుంచి సూరత్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు మాకు తెలిసింది.                       "
-   మక్వానా, పోలీసు అధికారి

రసాయనం వల్ల

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, హెయిర్‌కట్ కోసం అతని తలపై ఒక రకమైన రసాయనాన్ని పూయడంతో బాధితుడి శరీర పైభాగాలు తీవ్రంగా కాలిపోయాయని పోలీసు అధికారులు తెలిపారు. హెయిర్ కట్ కోసం ఏ రసాయనాన్ని ఉపయోగించారనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందని వారు తెలిపారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో కింద నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Lingayat Seer Death Case: స్వామీజీ కేసులో సంచలన విషయాలు- మహిళతో వీడియో ఛాట్, హనీట్రాప్!

Published at : 27 Oct 2022 03:29 PM (IST) Tags: Viral Gujarat News Man Suffers Burns Fire Haircut Saloon Video

సంబంధిత కథనాలు

Paritala Sunitha : పరిటాల జపం మానేసి, జాకీ పరిశ్రమను వెనక్కి తీసుకురండి- పరిటాల సునీత

Paritala Sunitha : పరిటాల జపం మానేసి, జాకీ పరిశ్రమను వెనక్కి తీసుకురండి- పరిటాల సునీత

Minister KTR: సైబర్ నేరగాళ్ల చేతిలో ఐటీ ఉద్యోగులు మోసపోవడం బాధాకరం: మంత్రి కేటీఆర్

Minister KTR: సైబర్ నేరగాళ్ల చేతిలో ఐటీ ఉద్యోగులు మోసపోవడం బాధాకరం: మంత్రి కేటీఆర్

Bapatla Crime : కట్టుకున్న వాడే కాలయముడు, భార్యపై కత్తితో దాడి చేసి హత్య!

Bapatla Crime : కట్టుకున్న వాడే కాలయముడు, భార్యపై కత్తితో దాడి చేసి హత్య!

గుంటూరులో బంగారం దొంగలు అరెస్ట్, కేజీ బంగారం స్వాధీనం

గుంటూరులో బంగారం దొంగలు అరెస్ట్, కేజీ బంగారం స్వాధీనం

Pawan Kalyan : నేనొక ఫెయిల్డ్ పొలిటీషియన్, నా ఓటమిని ఒప్పుకుంటాను - పవన్ కల్యాణ్

Pawan Kalyan : నేనొక ఫెయిల్డ్ పొలిటీషియన్, నా ఓటమిని ఒప్పుకుంటాను - పవన్ కల్యాణ్

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

నేవీ డే అంటే ఏమిటీ -యాక్షన్ సినిమా తలదన్నే దాని చరిత్ర తెలుసా ?

నేవీ డే అంటే ఏమిటీ -యాక్షన్ సినిమా తలదన్నే దాని చరిత్ర తెలుసా ?

క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి.

క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి.

Pushpa 2 In Russia : రష్యాలో 'పుష్ప 2' కూడా - లేట్ లేకుండా నయా ప్లాన్!

Pushpa 2 In Russia : రష్యాలో 'పుష్ప 2' కూడా - లేట్ లేకుండా నయా ప్లాన్!