Flight Fighting: ఫ్లైట్‌లో కొట్టుకున్న మహిళా ప్యాసింజర్‌లు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ - నలుగురు అరెస్ట్
Flight Fighting: ఆస్ట్రేలియాలోని ఓ ఫ్లైట్‌లో నలుగురు మహిళలు గొడవ పడిన వీడియో వైరల్ అవుతోంది.
Flight Fighting in Australia:
ఆస్ట్రేలియాలోని ఫ్లైట్‌లో..
ఫ్లైట్‌లలో వెళ్లే ప్యాసింజర్స్‌కి ఈ మధ్య ఏమవుతోందో కానీ...పదేపదే గొడవ పడుతున్నారు. రెండు నెలల క్రితం ఇలాగే ఓ ఫ్లైట్‌లో ఇద్దరు ప్రయాణికులు సీట్ కోసం కొట్టుకున్నారు. అప్పట్లో ఆ వీడియో వైరల్ అయింది. అప్పటి నుంచి ఇలాంటి ఘటనలే వెలుగులోకి వస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని ఓ విమానంలో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ దెబ్బకు పైలట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. కెయిర్న్స్ నుంచి నార్త్ ఆస్ట్రేలియాకు వెళ్తున్న ఫ్లైట్‌లో జరిగిందీ కొట్లాట. Australian Federal Police (AFP) సిబ్బంది ఆ ప్యాసింజర్స్‌పై కేసు నమోదు చేశారు. ఈ గొడవ కారణంగా ఫ్లైట్‌ని అత్యవసర ల్యాండింగ్ చేసినట్టు వెల్లడించారు. ఈ ఫైట్‌కి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ మహిళ చేతిలో బాటిల్ పట్టుకుని మరొకరిని కొట్టేందుకు ప్రయాణించింది. ఇది చూసి మిగతా ప్రయాణికులంతా బెంబేలెత్తిపోయారు. ఇంత పెద్ద గొడవ అవుతుందని ఊహించని వాళ్లు చాలా సేపటి వరకూ టెన్షన్ పడ్డారు. క్యాబిన్ క్రూ మాట వినకుండా ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించిన ఆ మహిళపై కేసు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. గొడవపడొద్దని హెచ్చరించారు. ఆ తరవాత టేకాఫ్ అయిన కాసేపటికీ మళ్లీ వాళ్లు గొడవ పడ్డారు. ఈ కారణంగా ఓ విండ్ డ్యామేజ్ అయింది. ఇలా గొడవ పడుతూ మిగతా ప్రయాణికులను ప్రమాదంలో పడేసిన కారణంగా ఆమెపై పోలీసులు FIR నమోదు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు.
Departing Cairns today..
— Jet Ski Bandit (@fulovitboss) April 20, 2023
Just someone trying to glass someone.
More fighting amongst themselves. Complete disregard for other passengers and the plane. I wonder if there were any consequences. #VoteNO 🇦🇺 #VoiceToParliament pic.twitter.com/v5iKWbWRtM
ఎయిర్ ఇండియాలోనూ...
ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లలో రోజుకో గొడవ జరుగుతోంది. ప్రయాణికులు గొడవ పడడమో, ఫుల్‌గా తాగేసి రచ్చ చేయడమో లాంటి సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడలాంటి ఘటనే మరోటి జరిగింది. ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్తున్న ఫ్లైట్‌లో ఓ ప్యాసింజర్ విమాన సిబ్బందితో గొడవకు దిగాడు. టేకాఫ్ అయిన కాసేపటికే ఈ గొడవ మొదలైంది. చేసేదేమీ లేక వెంటనే మళ్లీ ఢిల్లీలో ల్యాండ్ చేశారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ పోలీసులకు Air India యాజమాన్యం ఆ ప్రయాణికుడిపై ఫిర్యాదు చేసింది. ఇవాళ ఉదయం (ఏప్రిల్ 10) 6.35 నిముషాలకు ఢిల్లీ నుంచి విమానం బయల్దేరింది. కాసేపటికే ప్యాసింజర్‌కి, సిబ్బంది మధ్య గొడవైంది. వెంటనే ఢిల్లీకి తిరుగు పయనమైంది ఫ్లైట్. సిబ్బంది ఆ ప్యాసింజర్‌ను పోలీసులకు అప్పగించి మళ్లీ లండన్‌కు బయల్దేరింది.
"ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 111 ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ ఉన్నట్టుండి గొడవ మొదలవడం వల్ల మళ్లీ ఢిల్లీలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఆ ప్యాసింజర్ మా మాట వినలేదు. మేం ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా ఊరుకోలేదు. అనుచితంగా ప్రవర్తించాడు. నోటికొచ్చినట్టు మాట్లాడాడు. మా సిబ్బందిపై చేయి కూడా చేసుకున్నాడు. అందుకే పైలట్ వెంటనే ఢిల్లీకి ఫైట్‌ని మళ్లించాడు. భద్రతా సిబ్బందికి ఆ వ్యక్తిని అప్పగించాం. ఆ తరవాత మళ్లీ లండన్‌కు బయల్దేరింది. ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. వాళ్లు కేసు నమోదు చేశారు. ప్రయాణికులు ఎవరైనా డిగ్నిటీగా ఉండాలి. గాయపడిన సిబ్బందికి మా తరపున చేయాల్సినదంతా చేస్తున్నాం. ఈ అంతరాయానికి చింతిస్తున్నాం. వెంటనే ఫ్లైట్‌ని రీషెడ్యూల్ చేశాం. "
- ఎయిర్ ఇండియా యాజమాన్యం
Also Read: Delhi School Bomb Threat: స్కూల్లో బాంబు పెట్టామంటూ మెయిల్,బయటకు పరుగులు తీసిన విద్యార్థులు