Top Headlines:అల్లు అర్జున్ అరెస్టును ఏం ప్రశ్నించారు? కాకినాడ పోర్టు కేసులో ఈడీ దూకుడు? ఇప్పటి వరకు టాప్ హెడ్‌లైన్స్ ఇవే
Top News: తెలుగు రాష్ట్రాల్లో మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Today Top Headlines In Andhra Pradesh And Telangana:
మూడు గంటల విచారణలో అడిగిన ప్రశ్నలు ఇవే!
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మూడు గంటల పాటు అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించారు. పుష్ప 2 ప్రీమియర్ షో రోజు ఏం జరిగింది. ఎలా వచ్చారు ఎలా వెళ్లారు. ఎవరెవరు సినిమా చూశారు ఏం జరిగిందనే అంశాలపై పిన్ టు పిన్ ప్రశ్నించారు. చిక్కడల్లి సీఐ రాజు నాయక్ ఆధ్వర్యంలో పోలీసుల బృందం ఆయన్ని విచారించింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు 23 వరకు ఊరట కల్పించింది. అందుకే పోలీసులు ఆయనకు సోమవారం నోటీసులు ఇచ్చారు. మంగళవారం విచారణకు రావాలని ఆదేశించారు. ఇంకా చదవండి.
కాకినాడకు మహర్ధశ
బియ్యం అక్రమ రవాణా ఆరోపణలతో నిత్యం వార్తల్లో ఉంటున్న కాకినాడ పోర్టుకు ఇప్పుడు మహర్దశ పట్టుకుంది. అక్కడే షిప్‌ల తయారీ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతుతన్నాయి. మారీటైం బోర్డు పాలసీలో నౌకల నిర్మాణానికి రాష్ట్రం ఆమోదం తెలిపింది. షిప్‌ల తయారీ కేంద్రానికి కాకినాడ అనుకూలంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపించింది. సముద్రానికి ఆనుకుని వందల ఎకరాల భూమి ఉందని అందులో ప్రాజెక్టు చేపట్ట వచ్చని కూడా ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. దీనికి కేంద్రం ఓకే చెప్పింది. ఇంకా చదవండి.
కేసీఆర్, హరీష్‌కు ఊరట
తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగుబాటుపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఆ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరిగ్గా లేవని హైకోర్టు న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీనిపై సమాధానం చెప్పాలని ఫిర్యాదుదారుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంకా చదవండి.
కాకినాడ పోర్టు కేసులో ఈడీ దూకుడు
కాకినాడ పోర్టు కేసుల వ్యవహారంలో ఈడీ మరింత దూకుడుగా ఉంది. ఇప్పటికే ఒకసారి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసింది. ఇప్పుడు రెండోసారి కూడా వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, అరబిందో ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డికి నోటీసులు జారీ చేిసంది. పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని గత నోటీసుకు విజయసాయి రెడ్డి సమాధానం చెప్పారు. అనారోగ్య కారణంతో రాలేనంటూ శరత్ చంద్రారెడ్డి సమాధానం ఇచ్చారు. ఇంకా చదవండి.
ఆసుపత్రిలో పాములు వచ్చి చికిత్స
నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం కంసాన్పల్లిలో బాలికను పాము కరిచింది. దీంతో బాలిక స్పృహతప్పి పడిపోయింది. ఇంతలో అక్కడే ఓ పాము కనిపించింది. అదే పాము ఆమెను కరిచిందేమో అని దాన్ని కొట్టి చంపేశారు. ఇంతలో మరో పాము అదే స్పాట్‌లో కనిపించింది. దాన్ని కూడా చంపేశారు. ఇంతలో పాపను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఏ పాము కరిచిందో వైద్యులకు కూడా అర్థం కాలేదు. మళ్లీ స్నేక్ కాచర్‌ను రప్పించారు. పాములను తెచ్చారు. ఇంకా చదవండి.
Also Read: డేటా అవసరం లేని వాళ్లకు గుడ్ న్యూస్ -త్వరలోనే వాయిస్ కాల్స్ కోసం ప్రత్యేక ప్లాన్‌లు