Kerala Kuttiyamma : అమ్మో..బామ్మ ! 104 ఏళ్ల వయసులో 89 మార్కులతో నాలుగో క్లాస్ పాస్ !
కేరళలో నిరక్ష్యరాస్యురాలైన ఓ బామ్మ104ఏళ్ల వయసులో పట్టుదలతో అక్షరాలు నేర్చుకుంది. ప్రభుత్వ లిటరసీ పరీక్ష రాసి 89 శాతం మార్కులు తెచ్చుకుంది.
ఆ బామ్మ సెంచరీ కొట్టేసి నాలుగేళ్లయింది. అంటే నూట నాలుగేళ్లు. ఇప్పటికే ఆమె ఎన్నో తరాలు చూసింది. కరెంట్ అంటేనే ఓ అద్భుతం అనుకునే తరం నుంచి కంప్యూటర్ల మీద ప్రపంచం మొత్తం నడిచిపోతున్న తరం చూస్తోంది. అయితే ఆమెకు ఇప్పటి వరకూ చదువు రాదు. చదువుకోవాలని కూడా అనుకోలేదు. చదువంటే మనకు కాదనునే తరంలో పుట్టింది. ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు.. కుటుంబంలో అందరూ చదువుకుని పైకెదిగిపోయారు కానీ.. ఆమెకు చదువు అనే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు వచ్చింది. ఎప్పుడంటే 104 ఏళ్లు వచ్చాక..!
Also Read : నా మాటలు తప్పని నిరూపిస్తే పద్మశ్రీ వెనక్కిస్తా.. విమర్శకులకు కంగనారనౌత్ ఆఫర్ !
ఆమె పేరు కుట్టాయమ్మ. కేరళలో ఉంటారు. ఇప్పుడెందుకు చదువు కోకూడదు అనుకుంది. బహుశా..అన్ని బాధ్యతలు తీరిపోయిన తర్వాత ఇప్పుడే తీరిగ్గా ఉందేమో కానీ చదువుకోవాలని అనుకుంది. వెంటనే తన కోరికను కొడుకులకు, మనవళ్లకు చెప్పింది. ఎవరూ నవ్వలేదు. ఆమె పట్టుదలను మెచ్చుకున్నారు. ఎందుకంటే అది కేరళ. దేశంలో అత్యధిక అక్షరాస్యతా రేటు కేరళలోనే ఎందుకు ఉంటుందంటే అక్కడ చదువును.. అక్షరాస్యతను ఎవరూ తేలిగ్గా తీసుకోరు. అక్కడ ప్రభుత్వం ఎవరూ చదువు లేకుండా ఉండకూడదన్న లక్ష్యంగా ప్రత్యేకంగా లిటరసీ ప్రోగ్రామ్స్ పెడుతూంటుంది. పెద్దలకు చదువు చెప్పే ఏర్పాట్లు చేస్తుంది. పరీక్షలు విద్యావంతు రాలు అనే సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
Also Read : ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ పర్యటన.. గంటన్నర కోసం రూ.23 కోట్ల ఖర్చు! బీజేపీ ప్లాన్ ఏంటి?
ఇలా కేరళ ప్రభుత్వం పెట్టిన ఓ లిటరసీ ప్రోగ్రాంలో చేరిన 104 ఏళ్ల కుట్టాయమ్మ టీచర్లు చెప్పింది చక్కగా నేర్చుకున్నారు. పరీక్షలు రాశారు. ఆ పరీక్షల్లో ఆమెకు 89 శాతం పర్సంటేజీ వచ్చింది. వందకు 89 మార్కులు ఆమెకు వచ్చాయన్నమాట. ఆమెకు నేర్పిన పాఠాలు నాలుగో తరగతి పాఠాలతో సమానం. కుట్టామయమ్మ సక్సెస్‌ను కేరళ మంత్రి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే అది క్షణాల్లో వైరల్ అయిపోయింది.
104-year-old Kuttiyamma from Kottayam has scored 89/100 in the Kerala State Literacy Mission’s test. Age is no barrier to enter the world of knowledge. With utmost respect and love, I wish Kuttiyamma and all other new learners the best. #Literacy pic.twitter.com/pB5Fj9LYd9
— V. Sivankutty (@VSivankuttyCPIM) November 12, 2021
Also read: ఈ వధువు మామూలుది కాదు... పెళ్లికి పిలిచింది, పెళ్లిభోజనం మాత్రం కొనుక్కోమంది, ధరెంతో తెలుసా?
దేశంలో వయోజనుల్లో నిరక్ష్యరాస్యులు ఎక్కువగా ఉన్నారు. వారిని అక్షరాస్యులుగా మర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి.. కానీ పెద్దగా సక్సెస్ కావడం లేదు. కానీ కేరళ మాత్రం ఈ విషయంలో అన్ని రాష్ట్రాల కంటే ఎంతో మెరుగైన అక్షరాస్యత సాధించింది. వారికి మాత్రమే ఇది సాధ్యమయింది.
Also read: Srinagar Encounter: కశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి