News
News
X

Thodelu Movie Review : - 'తోడేలు' రివ్యూ : తెలుగులో సినిమా హిట్టా? ఫట్టా?

Bhedia - ThodeluReview In Telugu : వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన హిందీ సినిమా 'భేడియా'. తెలుగులో 'తోడేలు'గా అనువదించారు. నేడు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?

FOLLOW US: 

సినిమా రివ్యూ : తోడేలు
రేటింగ్ : 2.5/5
నటీనటులు : వరుణ్ ధావన్, కృతి సనన్, అభిషేక్ బెనర్జీ, పాలిన్ కబాక్, దీపక్ డోబ్రియాల్‌తో పాటు అతిథి పాత్రల్లో శరద్ కేల్కర్, శౌరభ్ శుక్లా, రాజ్ కుమార్ రావు, శ్రద్దా కపూర్
ఛాయాగ్రహణం : జిష్ణు భట్టాచార్య
సంగీతం : సచిన్ - జిగర్ 
నిర్మాతలు : దినేష్ విజయన్, జియో స్టూడియోస్
తెలుగులో విడుదల : అల్లు అరవింద్ (గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్)  
దర్శకత్వం : అమర్ కౌశిక్ 
విడుదల తేదీ: నవంబర్ 25, 2022

ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్! సినిమాను ఏ భాషలో తీసినా సరే... మిగతా భాషల్లో అనువదించి విడుదల చేస్తున్నారు. హిందీలో వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన సినిమా 'భేడియా' (Bhediya Review). తెలుగుకు 'తోడేలు'గా (Thodelu Review) వచ్చింది. అల్లు అరవింద్ విడుదల చేసిన ఈ సినిమా ఎలా ఉంది? 'కాంతార' తర్వాత గీతా ఆర్ట్స్ సంస్థలో మరో డబ్బింగ్ హిట్‌గా నిలుస్తుందా? లేదా?

కథ (Thodelu - Bhediya Movie Story) : భాస్కర్ (వరుణ్ ధావన్) ఓ కాంట్రాక్టర్. అరుణాచల్ ప్రదేశ్‌లో ఓ రోడ్డు వేయడానికి వెళతాడు. అడవిలో చెట్లు నరికి... రోడ్డు పనులు పూర్తి చేయాలనుకుంటాడు. ప్రకృతి ఏమైపోయినా పర్వాలేదని, తనకు రోడ్డు వేయడం ద్వారా వచ్చే డబ్బే ముఖ్యమని చెబుతాడు. అయితే... భాస్కర్‌ను ఒక తోడేలు కరుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ఆ ప్రాంతం ప్రకృతికి ఏమైనా హాని తలపెట్టాలని ప్రయత్నించే వ్యక్తులను ఒక వైరస్ అంతం చేస్తుందని వినికిడి. ఆ వైరస్ ఏంటి? తోడేలుగా మారిన భాస్కర్ రాత్రుళ్ళు మనుషులపై ఎందుకు దాడి చేసేవాడు? కారణం ఏంటి? పశువుల (మూగ జీవాల)కు వైద్యం చేసే అనికా (కృతి సనన్) అతడికి ఎలాంటి వైద్యం చేసింది? చివరకు ఏమైంది? అనేది మిగతా సినిమా. 
    
విశ్లేషణ (Thodelu - Bhediya Movie Review) : కథ పరంగా 'తోడేలు'లో కొత్తదనం ఉంది. కానీ, రెండున్నర గంటలు ఆ కథను కొత్తగా చెప్పడంలో దర్శకుడు అమర్ కౌశిక్ కొంత తడబాటుకు లోనయ్యారు. ఈ తరహా కథతో ఈ మధ్య కాలంలో సిన్మా రాలేదని చెప్పాలి. ఆసక్తికరంగా మొదలైన సినిమాను మధ్య మధ్యలో సాగదీశారు. ముఖ్యంగా పతాక సన్నివేశాలు మరింతగా సాగదీశారు. విషయాన్ని క్లుప్తంగా చెప్పడం మానేసి క్రియేటివిటీ చూపించారు. 'తోడేలు'లో హారర్, కామెడీ, థ్రిల్స్ ఉన్నాయి. అంతే కాదు... ప్రకృతి, మన అడవుల ప్రాముఖ్యతనూ చెప్పారు. అయితే, ప్రేక్షకులు ఎంత మందికి అర్థం అవుతాయనేది ప్రశ్న! 

News Reels

మనిషిపై తోడేలు దాడి చేయడంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ సీన్స్ ఆసక్తిగా ఉన్నప్పటికీ... తర్వాత హీరో పరిచయ సన్నివేశాలు, అరుణాచల్ ప్రదేశ్ వెళ్లిన తర్వాత వచ్చే పాట సాదాసీదాగా ఉంటాయి. వరుణ్ ధావన్‌ను తోడేలు కరిచిన తర్వాత అసలు కథ మొదలైంది. అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు తర్వాత ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠకు గురి చేస్తూ సినిమా ముందుకు వెళ్ళింది. కామెడీ సీన్స్ కూడా బావున్నాయి. ఇంటర్వెల్ తర్వాత ఒక్కసారిగా ఆసక్తి సన్నగిల్లుతుంది. తోడేలుగా మారిన మారిన మనిషి కొందరిపై ఎందుకు దాడి చేస్తున్నాడనేది తెలిశాక... ఆ తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడి ఊహకు అర్థం అవుతూ ఉంటుంది. ట్విస్టులు ఊహించడం కూడా పెద్ద కష్టమేమి కాదు.
 
'తోడేలు'లో కామెడీ, థ్రిల్స్‌పై పెట్టిన కాన్సంట్రేషన్, ఎమోషన్స్‌పై పెట్టలేదు. అది మైనస్. అందువల్ల, పతాక సన్నివేశాల్లో రెండు తోడేళ్ళ మధ్య సీన్స్ కానీ... మరి కొన్ని సీన్స్ కానీ కనెక్ట్ కావు. ప్రకృతికి, మనిషికి మధ్య ఉన్న అనుబంధాన్ని సరిగా చూపించలేదు. కథకు మూలం అదే. వందేళ్ళకు పైగా వయసున్న ప్రకృతి వైద్యుడి పాత్రను కూడా సరిగా ఎలివేట్ చేయలేదు. వాటిపై మరింత దృష్టి పెట్టాల్సింది.
 
సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్ బావున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం ఎంత అందంగా ఉంటుందనేది తెరపై బాగా చూపించారు. త్రీడీలో చూసేంత ఎఫెక్ట్స్ ఏమీ లేవు. త్రీడీ కంటే 2డీలో చూస్తే బావుంటుంది. తోడేలు వచ్చే కొన్ని సీన్స్ మాత్రమే త్రీడీ థ్రిల్ ఇచ్చాయి. సంగీతం ఓకే. పాటలు హిందీలో వింటే బావున్నాయి. తెలుగులో సాహిత్యం సరిగా కుదరలేదు.

నటీనటులు ఎలా చేశారు? : హిందీ హీరో వరుణ్ ధావన్ కమర్షియల్ హీరోగా చేశారు. కొన్ని సీరియస్, డార్క్ రోల్స్ చేశారు. కామెడీ రోల్స్ చేశారు. కానీ, 'తోడేలు' వంటి సినిమా చేయడం ఫస్ట్ టైమ్. ఇటువంటి క్యారెక్టర్ చేయడానికి ముందుకు రావడం అభినందనీయం. కొన్ని సీన్స్, డైలాగ్స్ విషయంలో మొహమాటాలు లేకుండా చేశారు. తోడేలుగా మారే సన్నివేశాల్లో, కామెడీ టైమింగ్ విషయంలో వరుణ్ ధావన్ బాగా చేశారు. కృతి సనన్ లుక్ అందరికీ నచ్చకపోవచ్చు. అభిషేక్ బెనర్జీ, పాలిన్ కబాక్ నవ్వించారు. దీపక్ డోబ్రియాల్ క్యారెక్టర్ కొంత మందికి అయినా గుర్తు ఉంటుంది. పతాక సన్నివేశాల్లో రాజ్ కుమార్ రావు, అపరిక్షిత్ ఖురానా అతిథి పాత్రల్లో సందడి చేశారు. పాటలో శ్రద్దా కపూర్ కనిపించారు. 'భేడియా', 'స్త్రీ' - వీటితో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయనున్న సంగతి తెలిసిందే.     
  
Also Read : లవ్ టుడే రివ్యూ: ఈ తరం ప్రేమకథ ఆకట్టుకుందా? ప్రదీప్ అరుదైన జాబితాలో చేరాడా?

ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : మనిషి తోడేలుగా మారితే? ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉంది కదూ! మనిషిని తోడేలు కరిచిన తర్వాత వచ్చే సన్నివేశాలు అంతే కొత్త అనుభూతి ఇస్తాయి. లాజిక్స్ మర్చిపోయి స్క్రీన్ మీద ఏం జరుగుతుందో చూస్తాం. కొన్ని సీన్స్ చూసి నవ్వుతాం. ఎంజాయ్ చేస్తాం. అది ఇంటర్వెల్ వరకు మాత్రమే. ఆ తర్వాత రోలర్ కోస్టర్ రైడ్‌లా సినిమా కిందకు పడుతూ... పైకి లేస్తూ శుభం కార్డు వరకు వచ్చింది. పతాక సన్నివేశాల నిడివి ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. పార్టులు పార్టులుగా సినిమా బావుంటుంది. పూర్తి సంతృప్తి ఇవ్వడంలో ఫెయిల్ అయ్యింది. 

Also Read : 'మసూద' రివ్యూ : భయపెట్టడం కోసమే తీసిన సినిమా - భయపెట్టిందా? లేదా?

Published at : 25 Nov 2022 07:08 AM (IST) Tags: ABPDesamReview Thodelu Review Bhediya Review In Telugu Thodelu Telugu Review Thodelu Telugu Movie Review Thodelu Review In Telugu

సంబంధిత కథనాలు

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!

టాప్ స్టోరీస్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి