అన్వేషించండి

Don Review - 'డాన్' రివ్యూ: డాన్ నవ్వించాడు, ఏడిపించాడు - అయితే, మైనస్ ఏంటి? శివ కార్తికేయన్ సినిమా ఎలా ఉంది?

Sivakarthikeyan's Don Movie Review: తమిళ హీరో శివ కార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడే. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా 'డాన్' ఈ రోజు విడుదలైంది. సినిమా ఎలా ఉందంటే...

సినిమా రివ్యూ: 'కాలేజ్ డాన్'
రేటింగ్: 3/5
నటీనటులు: శివకార్తికేయన్, ప్రియాంకా అరుల్ మోహన్, ఎస్.జె. సూర్య, సముద్రఖని, సూరి తదితరులు
సినిమాటోగ్రఫీ: కె.ఎం. భాస్కరన్  
సంగీతం: అనిరుధ్ రవిచందర్  
నిర్మాతలు: అల్లిరాజా సుభాస్కరన్, శివకార్తికేయన్  
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శిబి చక్రవర్తి
విడుదల తేదీ: మే 13, 2022

గతేడాది విడుదలైన 'డాక్టర్' తెలుగులో మంచి విజయం సాధించింది. నటుడిగా శివ కార్తికేయన్‌కు పేరు తెచ్చింది. అంతకు ముందు 'సీమ రాజా', 'రెమో' సినిమాలూ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు 'జాతి రత్నాలు' దర్శకుడు కేవీ అనుదీప్‌తో తెలుగు, తమిళ సినిమా చేస్తున్నారు శివకార్తికేయన్. మన తెలుగు ప్రేక్షకులకు ఆయన చాలా సుపరిచితులు. అటువంటిది ఆయన లేటెస్ట్ సినిమా 'డాన్' (తెలుగులో 'కాలేజ్ డాన్')ను ఎటువంటి ప్రచారం లేకుండా విడుదల చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే... హిట్ కాంబినేషన్ నుంచి వస్తున్న చిత్రమిది. 'డాక్టర్'లో హీరోయినే 'డాన్'లో హీరోయిన్... ప్రియాంక. 'డాక్టర్'కు మ్యూజిక్ అందించిన అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇవన్నీ పక్కన పెట్టి... ఈ సినిమా ఎలా ఉంది? అనే వివరాల్లోకి వెళితే?

కథ: చక్రవర్తి (శివకార్తికేయన్) బీటెక్ స్టూడెంట్. కాలేజీలో ప్రొఫెసర్ భూమినాథం (ఎస్.జె. సూర్య) పెట్టె రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ అతడిని నచ్చవు. చక్రవర్తి వేసిన ప్లాన్ వల్ల భూమినాథం కాలేజీ నుంచి వెళ్ళవలసి వస్తుంది. దాంతో చక్రవర్తిని కాలేజీ స్టూడెంట్స్ అంతా డాన్ అని పిలవడం స్టార్ట్ చేస్తారు. రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ లేకుండా హ్యాపీగా ఉంటారు. డాన్ బుర్రకు చదువు ఎక్కదు. కానీ, తండ్రి (సముద్రఖని) దగ్గర 80 శాతం మార్కులు వచ్చాయని చెప్పుకొంటాడు. ప్రేమించిన అమ్మాయి ఆకాశవాణి (ప్రియాంకా అరుల్ మోహన్) కూడా తన కాలేజీలో ఉండటంతో హ్యాపీగా ఉంటాడు. డాన్ బ్యాడ్ లక్ ఏంటంటే... కాలేజీ నుంచి వెళ్లిన భూమినాథం రెండు నెలల్లో తిరిగొస్తాడు. డాన్ చేసిన పని తెలుసుకుని అతను ఏం చేశాడు? రివేంజ్ ఎలా ప్లాన్ చేశాడు? డాన్‌కు చెప్పిన అబద్ధాలు తెలుసుకుని తండ్రి ఏం చేశాడు? చివరకు, ఏమైంది? అనేది మిగతా సినిమా.

విశ్లేషణ: కాలేజీ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలు తెలుగు తెరకు కొత్త కాదు. అఫ్‌కోర్స్‌... తమిళ తెరకు కూడా! 'డాన్' (తెలుగులో 'కాలేజ్ డాన్' పేరుతో విడుదల చేశారు) కథ వింటే రొటీన్‌గా ఉంటుంది. అయితే, ఆ రొటీన్‌లో ఫ్రెష్ ఫీలింగ్ తీసుకు రావడం కోసం దర్శకుడు శిబి చక్రవర్తి ప్రయత్నించారు. కథ రొటీన్‌గా వెళుతుందనుకున్న ప్రతి సన్నివేశంలో స‌ర్‌ప్రైజ్‌ చేశారు. ఎంట‌ర్‌టైన్‌ చేశారు. థియేటర్లలో ప్రేక్షకుల్ని ఏడిపిస్తారు కూడా! అందువల్ల, థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు పక్కా కమర్షియల్ ఫిల్మ్, ఫుల్ మీల్స్ పెట్టిన సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

'డాన్' కథేమీ కొత్తది కాదు. రొటీన్ కథను కొత్తగా చూపించిన సినిమా! ఇందులోనూ కొన్ని నెగెటివ్ పాయింట్స్ ఉన్నాయి. అయితే, వాటిని వినోదంతో కవర్ చేశారు. తెలుగు ప్రేక్షకులకు ఇబ్బంది పెట్టే అంశం ఏంటంటే... కాలేజీ ఫెస్టివల్‌లో తమిళ్ పాటలు రావడం! తెలుగు డబ్బింగ్ చేసేటప్పుడు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది. విడిగా పాటలు వింటే బావున్నాయి. కానీ, తెరపై కథకు అడ్డు తగిలాయి. తర్వాత ఏం జరుగుతుందో ఊహించే విధంగా కథ, కథనం ఉండటం కొంత వరకూ మైనస్ అని చెప్పాలి. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ డీసెంట్ గా ఉన్నాయి. 

శివ కార్తికేయన్ పక్కింటి కుర్రాడి తరహా పాత్రలో కనిపించారు. క్యారెక్టర్‌కు తగ్గట్టు నటించారు. 'డాక్టర్'లో నటనకు, ఈ సినిమాకు చాలా వేరియేషన్ ఉంటుంది. అయితే... 'రెమో', 'సీమ రాజా' వంటి డబ్బింగ్ సినిమాలతో పాటు శివ కార్తికేయన్ తమిళ సినిమాలు చూసిన ప్రేక్షకులకు కొత్తగా ఉండదు. ప్రియాంకా అరుల్ మోహన్ పాత్ర పరిధి తక్కువే. ఉన్నంతలో బాగా చేశారు. భూమినాథం పాత్రలో ఎస్.జె సూర్య అదరగొట్టారు. సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం కూడా పాత్రకు ప్లస్ అయ్యింది. తండ్రి పాత్రలో సముద్రఖని చక్కగా చేశారు. తెలుగు సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తున్న ఆయన్ను... తండ్రిగా చూడటం కొత్తగా ఉంటుంది. 'ఖైదీ' ఫేమ్ జార్జ్, సూరి , రాధా రవి సహా చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన యాక్టర్లు సైతం పాత్రలకు తగ్గట్టు చక్కగా నటించారు.

Also Read: 'సర్కారు వారి పాట' రివ్యూ: అయ్యో, మహేషా.. ఇలా చేశావేంటయ్యా!

'డాన్' గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే... పక్కా కమర్షియల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఇంతకు ముందు చెప్పినట్టు... సినిమా నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. అన్నిటి కంటే ముఖ్యంగా చదువు విషయంలో తల్లిదండ్రులు, ప్రొఫెసర్లు, స్టూడెంట్స్‌కు చిన్న మెసేజ్ ఇస్తుంది. కాలేజీకి మాత్రమే 'డాన్' కథ పరిమితం కాలేదు. అంతకు మించి విషయం ఉంది. అది చెబితే... ట్విస్ట్ రివీల్ అవుతుంది. సో... థియేటర్లలో 'డాన్'ను ఎంజాయ్ చేయండి. వీకెండ్‌కు మాంచి కమర్షియల్ సినిమా ఫీలింగ్ అయితే గ్యారెంటీ!

Also Read: డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ రివ్యూ: మార్వెల్ మంత్రం పని చేసిందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
SS Rajamouli: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
Sriram: అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH Captain Pat Cummins IPL 2024 | కమిన్స్ రాకతోనైనా ఆరెంజ్ ఆర్మీ ఆకట్టుకుంటుందా.? | ABP DesamPinkvilla Screen And Style Awards: ముంబయిలో ఘనంగా జరిగిన అవార్డుల వేడుక, విభిన్న డ్రెస్సుల్లో తారలుRajamouli Mahesh Babu Movie: జపాన్ లో RRR స్క్రీనింగ్స్ సందర్భంగా మహేష్ మూవీ అప్డేట్ ఇచ్చిన జక్కన్నShraddha Kapoor Pizza Paparazzi: పింక్ విల్లా స్క్రీన్ అండ్ స్టయిల్ అవార్డుల్లో ఆసక్తికర ఘటన

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
SS Rajamouli: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
Sriram: అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
Home Loan: క్రెడిట్‌ స్కోర్‌ తక్కువున్నా గృహ రుణం, ఈ ఉపాయాలు తెలిస్తే చాలు!
క్రెడిట్‌ స్కోర్‌ తక్కువున్నా గృహ రుణం, ఈ ఉపాయాలు తెలిస్తే చాలు!
South Costal Politics: వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
Manchu Lakshmi: మంచు లక్ష్మి కాళ్లు మొక్కిన అభిమాని - ‘ఆదిపర్వం’ ట్రైలర్ లాంచ్‌లో అనూహ్య ఘటన
మంచు లక్ష్మి కాళ్లు మొక్కిన అభిమాని - ‘ఆదిపర్వం’ ట్రైలర్ లాంచ్‌లో అనూహ్య ఘటన
Rajamouli On SSMB29: మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
Embed widget