Pumpkin Seeds Side Effects: గుమ్మడి గింజలు ఎక్కువగా తింటే ఇన్ని సమస్యలు వస్తాయా? జర చూసుకోండి మరి
గుమ్మరి గింజలంటే చాలా మంది ఇష్టపడతారు. కానీ వాటిని ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.
శక్తివంతమైన పోషకాలు కలిగి ఉండే గుమ్మడి గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డిప్రెషన్, ఆర్థరైటిస్ వంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు ఇది సహాయపడుతుంది. అంతే కాదు కొంత మంది మంచి రుచి వచ్చేందుకు వంటకాల్లో కూడా వీటిని ఉపయోగిస్తారు. గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల లాభాలే కాదు నష్టాలు ఉన్నాయి. ఆహారం మితంగా తింటే ఆరోగ్యం అమితంగా తింటే హానికరం అని పెద్దలు చెబుతుంటారు. అది ఈ గుమ్మడి గింజలకి కూడా వర్తిస్తుంది. వీటిని అమితంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అలర్జీ
గుమ్మడి గింజలు తినడం వల్ల మనకి చాలా రకాల పోషకాలు అందుతాయి. అయితే అది మితంగా మాత్రమే తీసుకోవాలి. మోతాదుకు మించి తింటే కొంతమందికి అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. తలనొప్పి, గొంతులో చికాకు, నోరు అంతా ఎర్రగా మారిపోవడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కడుపులో నొప్పి
ఇది ఫైబర్ సూపర్ రిచ్ ఫుడ్. కానీ ఎక్కువగా ఫైబర్ తీసుకోవడం వల్ల కడుపులో సమస్యలు ఎదురవుతాయి. మన శరీరానికి మోతాదుకు మించి ఫైబర్ తీసుకోవడం మంచిది కాదు. దీని వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడి ఇబ్బందిగా మారుతుంది.
గొంతులో ఇబ్బంది
గుమ్మడి గింజలు రుచిగా ఉండటం వల్ల చాలా మంది తెలియకుండానే బాగా తినేస్తారు. దాని వల్ల మీ గొంతు దెబ్బతింటుంది. త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో మీరేమి తినలేరు, మింగడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. ఈ గింజలు బాగా నమిలి తినాలి.
అధిక బరువు
ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మీరు అధికంగా బరువు పెరుగుతారు. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో కొవ్వుతో పాటు కేలారీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కేవలం రెండు స్పూన్ల కి మించి గుమ్మడి గింజలు తినకపోవడమే బెటర్.
బిపి తక్కువ వాళ్ళకి మంచిది కాదు
బిపి తక్కువగా ఉన్నవాళ్ళు వీటిని తీసుకోకపోవడమే మంచిది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. అందుకే బిపి తక్కువగా ఉన్న వాళ్ళు వీటిని చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి.
గుమ్మడి గింజలు చాలా రుచికరమైన పదార్థం. అందుకే వాటిని తినడానికి చాలా మంది ఇష్టం చూపిస్తారు. కానీ వాటిని మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం ప్రమాదమే.
Also Read: ఈ నాలుగు పండ్లలోని విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో తినకండి
Also read: ఈ నాలుగు పానీయాలు మీ తలనొప్పిని తీవ్రంగా మారుస్తాయి, తాగకపోవడం మంచిది