Mosambi : ఈ ప్రయోజనాలు పొందాలంటే బత్తాయి తినాల్సిందే
వేసవిలో విరివిగా లభించే పండు బత్తాయి. దీన్ని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
వేసవి వచ్చిందంటే చాలు రోడ్లకి ఇరువైపులా రాశులు రాశులు పోసి బత్తాయి పండ్లు అమ్ముతూ ఉంటారు. వేసవి కాలంలో బత్తాయి పండలకి మంచి గిరాకీ ఉంటుంది. మోసంబి, స్వీట్ లైమ్ అని కూడా దీన్ని పిలుస్తారు. విటమిన్ సి పుష్కలంగా ఉండే జాబితాలో నిమ్మ, నారింజ తర్వాత బత్తాయి ఉంటుంది. తియ్యగా, పుల్ల పుల్లగా ఉండే ఈ పండుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత చాలా మంది సి విటమిన్ లభించే బత్తాయి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. పొటాషియం, ఐరన్, కాల్షియం, విటమిన్స్ ఏ, సి, బి1 తో పాటు చర్మానికి మేలు చేసే ఖనిజాలు ఇందులో సమృద్ధిగా దొరుకుతాయి.
బత్తాయి జ్యూస్ లేదా మామూలు పండుగా తిన్నా కూడా ప్రయోజనమే. బత్తాయిలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్స్ నుంచి పోరాడేందుకు చక్కగా ఉపయోగపడుతుంది. ఈ పండులో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. జీర్ణాశయాన్ని శుభ్రం చేయడంతో పాటు జీర్ణ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు బత్తాయి జ్యూస్ ఏంటో మేలు చేస్తుంది. బత్తాయి జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని ఉదయాన్నే తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. గర్భిణీలు బత్తాయిలు తీసుకోవడం వల్ల అందులో ఉన్న కాల్షియం కడుపులో ఉన్న బిడ్డతో పాటు తల్లికి మేలు చేస్తుంది. ఋచీలో బత్తాయి, నారింజ ఒకే విధంగా ఉంటాయి.
ఆరోగ్యకరమైన చర్మాన్ని ఇస్తుంది
బత్తాయిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ధృడంగా ఉంచేందుకు అవసరమైన కొల్లజెన్ ప్రోటీన్ ని తయారు చేసేందుకు సహకరిస్తుంది. యింటులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల వయస్సు సంబంధంగా చర్మంలో వచ్చే మార్పులని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
బత్తాయిలో లిమోనాయిడ్స్ అని పిలిచే సమ్మేళనాలు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించేందుకు సహకరిస్తాయి. గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. పేగుల్లో వచ్చే అల్సర్, పూతలను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది
ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ వల్ల జీర్ణ రసాలు, ఆమ్లాలు, పిత్త స్రావాన్ని పెంచి జీర్ణవ్యవస్థకి శక్తినిస్తుంది. కడుపులో ఉండే వ్యర్థాలని తొలగించి జీర్ణవ్యవస్థ పనితీరు సక్రమంగా ఉండేలా చేస్తుంది. బత్తాయి రసంలో కొద్దిగా గ్లూకోజ్ కలుపుకుని తాగడం వల్ల మూత్ర నాళంలో సమస్యలతో పాటు మంట కూడా తగ్గుతుంది.
చర్మాన్ని సంరక్షిస్తుంది
శరీరం నుంచి విషాన్ని తొలగించడం ద్వారా చర్మం కాంతివంతంగా ఉండేందుకు దోహదపడుతుంది. మొటిమలు లేకుండా చేస్తుందని మరికొందరు అంటారు. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ వల్ల కంటి శుక్లాలు, కంటి సంబంధ జబ్బులు వచ్చే అవకాశం తక్కువ. చర్మంపై మచ్చలని తొలగిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: సన్ ఫ్లవర్ నూనెతో మెరిసే చర్మం మీ సొంతం
Also Read: పెద్దలూ జాగ్రత్త! ఎక్కువగా డీహైడ్రేట్ అయితే మూర్చలు రావొచ్చు