Glowing Skin: సన్ ఫ్లవర్ నూనెతో మెరిసే చర్మం మీ సొంతం
సన్ ఫ్లవర్ ఆయిల్ తో వంటలు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. కానీ ఇది చర్మానికి కూడా మరింత అందాన్ని ఇస్తుందని మీకు తెలుసా?
కృత్రిమ సౌందర్య సాధనాల కంటే సహజ ఉత్పత్తులు ఎప్పుడు చర్మంపై చక్కని ప్రభావాన్ని చూపిస్తాయి. ఎందుకంటే ఇవి రసాయనాలు ఉండవు కాబట్టి చర్మం బాగుండెలా చేస్తాయి. ఈ బిజీ షెడ్యూల్లో చర్మ సంరక్షణ ప్రతి ఒక్కరికీ సవాల్ గానే ఉంటుంది. మార్కెట్లో దొరికే వాటికి బదులుగా సహజసిద్ధంగా లభించే పొద్దుతిరుగుడు పువ్వులతో వచ్చే నూనెతో చర్మం మెరిసిపోయేలా చేసుకోవచ్చు. అదేంటి సన్ ఫ్లవర్ ఆయిల్ తో వంటలు కదా చేసుకునేది దాన్ని ముఖానికి రాసుకుంటే జిడ్డుగా ఉంటుంది కదా అని అనుకుంటున్నారా? అలా అసలు ఉండదు. పైగా దాని వల్ల బోలెడు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
మృత కణాలు తొలగిస్తుంది
రోజంతా ఎండ, కాలుష్యం వల్ల మొహం తన సహజ కాంతిని కోల్పోతుంది. హానికరమైన UV కిరణాలు, ధూళి, బ్యాక్టీరియా మొహంపై చేరడం వల్ల ట్యాన్ ఏర్పడి రంధ్రాలు మూసుకుపోతాయి. సన్ ఫ్లవర్‌లో లినోలెయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేసే లక్షణాలను కలిగి ఉండటంతో పాటు మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీని వల్ల హైపర్‌పిగ్మెంటేషన్ తగ్గుతుంది. ఈ నూనెలోని విటమిన్ ఇ చర్మాన్ని హానికరమైన కిరణాల నుండి రక్షిస్తుంది. సన్ టాన్ నుండి బయటపడటానికి సహాయపడుతుంది. ఫలితంగా టాన్ ఫ్రీ, ఫ్రెష్, క్లీన్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
ఎలా అప్లై చెయ్యాలి?
సన్ ఫ్లవర్ ఆయిల్ ని నేరుగా చర్మానికి అప్లై చేయకుండా దాన్ని కొద్దిగా కొబ్బరి నూనెతో కలిపి మృదువుగా మసాజ్ చెయ్యాలి. కొద్దిసేపటి తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవచ్చు,
అన్నీ చర్మ సమస్యలకి చెక్
మొక్కల నుంచి సహజ సిద్ధంగా వచ్చే సన్ ఫ్లవర్ ఆయిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది అప్లై చేసుకోవడం వల్ల మొహం మీద ఉండే బ్లాక్, వైట్ స్పాట్స్, మొటిమలు, ముడతలు అన్నింటినీ తగ్గించేస్తుంది. జిడ్డు లేని మృదువైన చర్మాన్ని అందిస్తుంది. అంతే కాదు చర్మాన్ని ఆరోగ్యంగా, మెరుస్తూ, పొడిబారిపోకుండా చేస్తుంది. వృద్ధాప్య సంకేతాలు రాకుండా చేస్తుంది.
ఎలా అప్లై చెయ్యాలి?
సన్ ఫ్లవర్ ఆయిల్ 2-4 చుక్కల లావెండర్ ఆయిల్ లేదా లెమన్ ఆయిల్ తో కలిపి రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల రిఫ్రెష్, మృదువైన చర్మం మీకు సొంతం అవుతుంది. 2-4 చుక్కలు కలిపిన మిశ్రమం మొహం మీద వేసుకుని చిన్నగా స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేసుకోవాలి. తర్వాత తడి వస్త్రంతో తుడుచుకోవాలి.
గాయాలని నయం చేస్తుంది
సహజసిద్ధమైన పొద్దుతిరుగుడు నూనెలో వైద్యం చేసే గుణాలు కూడా ఉన్నాయి. లీనోలెయిక్ యాసిడ్ ఉండటం వల్ల నొప్పి లేకుండా త్వరగా గాయాలను నయనం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.
సహజమాయిశ్చరైజింగ్, క్లీనింగ్ లక్షణాలు
సన్‌ఫ్లవర్ ఆయిల్ ఒక సహజమైన క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్ గా పని చేస్తుంది. ఎటువంటి కఠినమైన రసాయనాలను ఉపయోగించకుండా ముఖాన్ని శుభ్రపరుస్తుంది. మాయిశ్చరైజింగ్ వల్ల చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా ఉంటుంది. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కొద్దిగా నూనె తీసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవచ్చు,
చర్మంలోని వేడి తగ్గిస్తుంది
సున్నితమైన లేదా పొడి చర్మం ఎప్పుడు ఎరుపు రంగుగా ఉంటుంది. పొద్దు తిరుగుడు నూనె చర్మాన్ని రక్షించి మీ సహజమైన స్కిన్ టోన్ పోకుండా కాపాడుతుంది. ఈ నూనె చర్మాన్ని రక్షించి చల్లగా ఉంచుతుంది. అయితే ఇది రాసిన తర్వాత ఏదైనా ప్రతిచర్య కలగకుండా ఉండేందుకు సేంద్రీయ, చల్లగా ఉండే నూనె మాత్రమే ఉపయోగించాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: పెద్దలూ జాగ్రత్త! ఎక్కువగా డీహైడ్రేట్ అయితే మూర్చలు రావొచ్చు
Also Read: మీకు అదృష్టాన్ని తెచ్చే ఆహారాలు ఇవే - ఇది మీ జేబులో ఉంటే డబ్బు ఖర్చు తగ్గుతుందట !