అన్వేషించండి

World Physiotherapy Day : ఫిజియోథెరపీతో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు చెక్! 'వరల్డ్ ఫిజికల్ థెరపీ డే' ప్రాముఖ్యత, చరిత్ర తెలుసా?

Physio Treatment : ఫిజికల్ థెరపీని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. కానీ ఇది లైఫ్​ని మార్చే థెరపీ అని గుర్తించరు. దీర్ఘకాలిక సమస్యలను సైతం దూరం చేయగలిగే శక్తి దానికి ఉందంటున్నారు నిపుణులు. 

ఆరోగ్య సమస్య ఉంటే ఆస్పత్రికి వెళ్తారు. దానిని ఫిజియో థెరపీ(World Physiotherapy)తో తగ్గించుకునే వెసులుబాటు ఉంటే వైద్యులు ఆ చికిత్సను సూచిస్తారు. కానీ చాలామంది మందులతో తగ్గించుకోవాలని.. ఫిజికల్ థెరపీ రోజూ చేయించుకోవాలా? ఇలాగే చెప్తారులే అని లైట్ తీసుకుంటారు. కానీ మీకు తెలుసా? ఫిజియో థెరపీ చేయించుకుంటే కొన్నిరకాల దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి. ఈ విషయాన్నే ప్రపంచానికి చాటి చెప్పేందుకు.. ప్రపంచవ్యాప్తంగా ఫిజికల్ థెరపీ డే(World Physical Therapy Day)ని నిర్వహిస్తున్నారు. 

ఫిజియో థెరపీ డే చరిత్ర  (Physical Therapy Day History)

ప్రతి ఏడాది సెప్టెంబర్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఫిజికల్ థెరపీ దినోత్సవాన్ని జరుపుతున్నారు. 1996 నుంచి ఇది (World Confederation for Physical Therapy) ప్రారంభమైంది. గ్లోబల్​గా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఫిజియోథెరపిస్టుల కృషిని గుర్తిస్తూ.. వారిని ప్రోత్సాహించడమే లక్ష్యంగా దీనిని ప్రారంభించారు. అలాగే ఫిజియో థెరపీతో ఏయే ఆరోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చో వంటి అంశాలపై కూడా అవగాహన కల్పిస్తారు. 

ఫిజియో థెరపీ ప్రాముఖ్యత (Physical Therapy Significance)

యాక్సిడెంట్స్ వల్ల జరిగే శారీరక గాయాలు, వైకల్యాలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించడంలో, చికిత్స చేయడంలో ఫిజియోథెరపీ ప్రాముఖ్యతను ఈ స్పెషల్ డే హైలెట్ చేస్తుంది. 

ఫిజికల్ థెరపీతో ఈ సమస్యలు దూరం (Physiotherapy to Reduce These Health Issues)

ఫిజియో థెరపీతో ఎన్నో దీర్ఘకాలిక సమస్యలను దూరం చేసుకోవచ్చు. క్రానిక్ పెయిన్స్​తో ఇబ్బంది పడేవారికి ఇది ఓ వరంగా చెప్పవచ్చు. ఎందుకంటే నడుము నొప్పి, మెడ నొప్పి, ఆర్థర్రైటిస్(Arthritis) వంటి సమస్యలను దూరం చేయడంలో ఫిజియో మంచి ఫలితాలు ఇస్తుంది. హీట్ థెరపీ, ఆల్ట్రాసౌండ్, మ్యానువల్ థెరపీ నొప్పిని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఫిజియోలో భాగంగా చేసే స్ట్రెచింగ్ వ్యాయామాలు బలాన్ని పెంచి జాయింట్ హెల్త్​ని మెరుగుపరుస్తాయి. 

సర్జరీ రికవరీకై..(Post-Surgery Recovery)

మోకాళ్ల రిప్లేస్​మెంట్, హార్ట్ సర్జరీ, ఫ్యాక్చర్ అయినప్పుడు ఫిజియోథెరపీ చేయించుకోవడం వల్ల మళ్లీ తిరిగి నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం దొరుకుతుంది. ఈ సమయంలో ఫిజియో చేయడం వల్ల సర్జరీ చేయించిన ప్రాంతాలకు మెరుగైన రక్తప్రసరణ అందుతుంది. దీనివల్ల పట్టేయడం జరగకుండా గాయం నుంచి త్వరగా కోలుకోగలుగుతారు. 

మరెన్నో లాభాలు

కాళ్లు వాపు, లిగ్మెంట్ టియర్స్, కండరాలకు తగిలే గాయాలను దూరం చేసేందుకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. స్ప్రోర్ట్స్ గాయాలకు ఇది బెస్ట్ రికవరీ ఆప్షన్​గా చెప్తారు. భంగిమ సరిచేయడం, స్ట్రోక్, పార్కిన్​సన్, పక్షవాతం వంటి న్యూరోలాజికల్ సమస్యలకు ఇది బెస్ట్ ట్రీట్​మెంట్ అవుతుంది. ఎవరి సహాయం లేకుండా రోగులు తమ పనులు తాము చేసుకోవడానికి ఫిజియో థెరపీ హెల్ప్ అవుతుంది. 

ఆస్తమా వంటి సమస్యలు దూరం చేసుకోవడానికి బ్రీతింగ్ వ్యాయామాలు, ఒబెసిటీ, బరువు అదుపులో ఉంచుకోవడం, మధుమేహాన్ని తగ్గించుకోవడం, బీపీని దూరం చేసుకోవడం ఇలా మొత్తం ఫిట్​నెస్​కు ఫిజియో హెల్ప్ అవుతుంది. అందుకే ఫిజికల్ థెరపీ గురించి ప్రపంచ వ్యాప్తంగా అవగాహన ఇస్తున్నారు. కాబట్టి మీకు ఏదైనా సందర్భంలో వైద్యులు ఫిజియో థెరపీని సూచిస్తే అస్సలు విస్మరించకండి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Embed widget