అన్వేషించండి

Thyroid Control Tips : థైరాయిడ్​ని 30 రోజుల్లో తగ్గించుకునేందుకు ఈ ఆసనాలు ట్రై చేయండి.. యోగా టిప్స్

Yoga For Thyroid : థైరాయిడ్​తో ఇబ్బంది పడేవారు తమ డైలీ రోటీన్​లో కొన్ని యోగాసనాలు చేస్తే నెలరోజుల్లోనే దానిని తగ్గించుకోవచ్చని చెప్తున్నారు నిపుణులు. అవేంటంటే..

Thyroid Yoga Poses : హార్మోన్లు అదుపులో లేకపోవడం, ఒత్తిడి, లైఫ్​స్టైల్ వంటి ఇతర కారణాల వల్ల చాలామంది థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే మీరు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే నెల రోజుల్లో దానిని తగ్గించుకోవాలనుకుంటే కొన్ని యోగాసనాలు ట్రై చేయమని చెప్తున్నారు నిపుణులు. Tambi Dadhich అనే యోగా టీచర్.. తన ఇన్​స్టాలో దీనిని గురించి రీల్ షేర్​ చేసింది. అంతేకాకుండా కొన్ని టిప్స్ కూడా ఇచ్చింది. అవేంటో చూసేద్దాం. 

ఉస్ట్రాసనం

మోకాలిపై నిలబడాలి. కాళ్లు దూరంగా ఉంచి.. వెనక్కి వంగాలి. బిగినర్స్ అయితే నడుముకు చేతులు సపోర్ట్ తీసుకోవచ్చు. ఇప్పటికే యోగా చేసేవారు అయితే చేతులతో మడమలను పట్టుకోవాలి. తల వెనక్కి వంచి ఛాతిని పైకి లేపాలి. ఈ పోజ్​లో 15 సెకన్లు ఉండాలి.. మెల్లగా సాధారణ స్థితికి రావాలి. ఇలా మూడు రౌండ్​లు చేయాలి. 

ఛాతి, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు.. వెన్నెముకకు బలం అందిస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. 

సర్వాంగాసన 

నెలపై పడుకొని.. చేతులను నడుమునకు సపోర్ట్ ఇస్తూ శరీరాన్ని పైకి లేపాలి. మోకాళ్లు నిటారుగా ఉంచి.. భుజాలపై శరీరాన్ని నిలబెట్టాలి. మెడ గాయపడకుండా జాగ్రత్తగా ఉండాలి. 15 సెకన్లు ఉండి యథాస్థితికి రావాలి. మూడు రౌండ్లు చేయాలి. 

రక్తప్రసరణ మెరుగవుతుంది. థైరాయిడ్, పిట్యూటరీ గ్రంథులు ఉత్తేజమవుతాయి. హార్మోనల్ బ్యాలెన్స్ అవుతాయి. మానసిక ప్రశాంతతను ఇస్తుంది. 

సేతుబంధాసన 

నేలపై పడుకోవాలి. మోకాళ్లను మడిచి.. పాదాలను నేలపై ఉంచాలి. నడుమును పైకి లేపి.. రెండు చేతులతో నేలను పట్టుకుని మద్ధతు ఇవ్వాలి. 15 సెకన్లు ఇలా ఉండి యథాస్థితికి రావాలి. మూడు రౌండ్లు చేయాలి. 

నడుము నొప్పి తగ్గుతుంది. ఊపిరితిత్తులకు మంచిది. థైరాయిడ్​ను కంట్రోల్ చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. జీర్ణాశయ వ్యవస్థను మెరుగుచేస్తుంది. 

మత్యాసన

పడుకొని మోకాళ్లు మడుచుకోవాసి. ఛాతిని పైకి లేపి..తల వెనక్కి వంచాలి. తలపై ప్రెజర్ లేకుండా సున్నితంగా చేయాలి. 15 సెకన్లు ఉండి యథాస్థితికి రావాలి. మూడు రౌండ్లు చేయాలి. 

థైరాయిడ్ సమస్యలు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం అందుతుంది. వెన్నెముక స్ట్రాంగ్ అవుతుంది. 

బ్రహ్మరీ ప్రాణాయామం 

సుఖాసనంలో కూర్చోవాలి. చెవులపై వేళ్లతో మూసేయండి. ముక్కుతో లోపలికి ఊపిరి పీల్చుకుని ఓం అనే శబ్ధం చేయాలి. వదిలేప్పుడు నోటితో వదలాలి. ఇలా 2 నుంచి 5 నిమిషాలు పునరావృతం చేయాలి. 

ఇది మానసిక ప్రశాంతతను ఇస్తుంది. యాంగ్జైటీ, ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్ర లేమి, మైగ్రేన్ సమస్యలతో పాటు థైరాయిడ్ సమస్యలను దూరం చేస్తుంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tambi Dadhich | Yoga Teacher (@yogatambi_.india)

ఈ యోగాసనాలు నెలరోజులు కంటిన్యూ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని తంబి దధీచ్ తెలిపారు. అలాగే ఖాళీ కడుపుతో వీటిని చేస్తే మంచిదన్నారు. ఉదయాన్నే కాఫీ తాగకూడదని.. డైట్​లో అయోడిన్ రిచ్ ఫుడ్స్, సెలెనీయం ఫుడ్స్, జింక్ రిచ్ ఫుడ్స్ ఉండేలా చూసుకోవాలని తెలిపారు. మీరు కూడా ఈ యోగసనాలతో థైరాయిడ్ సమస్యను తగ్గించుకోండి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Cheating in Relationships : చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే
చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే
Multani Mitti Face Pack : ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అప్లై చేయాలనుకుంటే వీటిని కూడా కలపండి.. ఎన్నో లాభాలు
ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అప్లై చేయాలనుకుంటే వీటిని కూడా కలపండి.. ఎన్నో లాభాలు
Monsoon Humidity : వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
World Breastfeeding Week 2026 : బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget