(Source: Poll of Polls)
Weight Loss Tips : బరువును వేగంగా తగ్గించేలా చేసే సూపర్ ఫుడ్ ఇదే.. డైటీషియన్ టిప్స్ ఇవే
Weight Loss : బరువును వేగంగా తగ్గంచే ఓ సూపర్ ఫుడ్ గురించి చాలామంది అపోహ పడతారు. అది బరువు పెంచుతుంది అనుకుంటారు. కానీ డైటీషియన్ భావేష్ బరువు తగ్గడానికి దానిని డైట్లో చేర్చుకోమంటున్నారు.

Super Food to Lose Weight Rapidly : బరువు తగ్గాలనుకున్నప్పుడు చాలా ఫుడ్స్ని డైట్లో చేర్చుకుంటారు. అలాగే కొన్ని ఫుడ్స్ని దూరం పెడతారు. అలా ఎక్కువమంది పక్కన పెట్టేసే ఫుడ్ బంగాళదుంప. బరువు పెరుగుతామనే భయంతో చాలామంది దీనిని దూరం పెడతారు. ఇది తింటే బరువు పెరుగుతామనుకుంటారు. కానీ బంగాళాదుంపను సరైన పద్ధతిలో తీసుకుంటే.. వేగంగా బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుందని మీకు తెలుసా?
అవును. నిజమే.. ఇది మేము చెప్తుంది కాదు. డైటీషియన్ భావేష్ (Dt. Bhawesh Gupta) ప్రకారం.. ''బంగాళాదుంప బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. దానిని ఉడికించి.. వేయించిన మసాలా ఏదీ కలపకుండా నేరుగా తింటే.. అది మీ ఆకలిని నియంత్రిస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గించే ప్రక్రియను కూడా వేగవంతం చేస్తుంది. బంగాళాదుంపలో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎక్కువ కాలం పాటు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.'' అని తెలిపారు.
ఆకలిని నియంత్రిస్తుంది
ఉడికించిన బంగాళాదుంపలో రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. ఇది కడుపులో నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీనివల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. అతిగా తినడాన్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఫుడ్ క్రేవింగ్స్ తగ్గి బరువు తగ్గడంలో హెల్ప్ అవుతుంది.
తక్కువ కేలరీల అధిక ఫైబర్ ఫుడ్
ఉడికించిన బంగాళాదుంపల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచడంతో పాటు.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

మెరుగైన జీర్ణక్రియ
బంగాళాదుంపలో ఉండే స్టార్చ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది. జీర్ణక్రియ బాగుంటే.. బరువు తగ్గడంలో మంచి ఫలితాలు చూస్తారు.
ఎలా తీసుకోవచ్చంటే
2 ఉడికించిన బంగాళాదుంపలను తొక్క తీసి.. కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసుకుని తినాలి. దీనిలో ప్రోటీన్ ఉంటుంది. అలాగే బాయిల్డ్ చేసిన బంగాళదుంప తినడం వల్ల శరీరం వేగంగా కోలుకుంటుంది. శక్తి అందుతుంది. టొమాటో, ఉల్లిపాయ, కొత్తిమీర, పెప్పర్, మొక్కజొన్న వంటి వాటితో కలిపి బంగాళాదుంప చాట్ తయారు చేసుకోవచ్చు. ఇది రుచికరంగా ఉండడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటుంది.

గుర్తుంచుకోవాల్సిన విషయాలివే..
బరువు పెరగకుండా ఉండాలంటే బంగాళాదుంపను ఉడికించి మాత్రమే తీసుకోవాలి. ఇంక ఏ రూపంలో దానిని తీసుకున్నా బరువు పెరుగుతారు. చాలామంది రుచిగా ఉంటుందని.. బంగాళాదుంపను వేయించి తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల రుచి పెరుగుతుంది కానీ.. దానిలోని పోషక విలువలు తగ్గిపోతాయి. ఇది క్రమంగా బరువు పెరిగేలా చేస్తుంది. అలాగే ఉడికించిన బంగాళదుంపలో వెన్న, చీజ్ వేసుకోకూడదు. చిప్స్ రూపంలో అస్సలు తీసుకోకూడదు.
మార్కెట్‌లలో లభించే ఖరీదైన డైట్ ఫుడ్‌లతో పోలిస్తే.. ఉడికించిన బంగాళాదుంప బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్. ఇది ప్రతివేళా, తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉంటుంది. సహజంగా, తక్కువ ఖర్చుతో బరువు తగ్గడానికి దీనిని డైట్లో చేర్చుకోవచ్చు. అయితే ఇది అవగాహన కోసమే. కొందరికి బంగాళదుంపతో కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలాంటివారు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది.






















