అన్వేషించండి

World Cancer Day 2025 : ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025 థీమ్ ఇదే.. ఈ మార్పులతో క్యాన్సర్​ను దూరం చేసుకోవచ్చట

World Cancer Day : లైఫ్​స్టైల్​లో కొన్ని మార్పులు చేస్తే.. క్యాన్సర్​ రాకుండా నిరోధించవచ్చని చెప్తున్నారు నిపుణులు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఈ మార్పులు ఏంటో చూసేద్దాం.

World Cancer Day 2025 Theme and Significance : క్యాన్సర్​పై అవగాహన కల్పిస్తూ.. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుతున్నారు. 2025లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం (World Cancer Day 2025) మంగళవారం వచ్చింది. క్యాన్సర్ నివారణ, గుర్తించడం, చికిత్స వంటి అంశాలపై అవగాహన కల్పించడమే ఈ రోజు లక్ష్యం. క్యాన్సర్ వల్ల కలిగే సమస్యలను చెప్తూ.. క్యాన్సర్​ని దూరం చేసుకునేందుకు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చెప్తూ.. క్యాన్సర్​పై అవగాహన కల్పిస్తారు. 

క్యాన్సర్​ని ముందుగానే గుర్తిస్తే చికిత్సతో క్యూర్ చేసుకోవచ్చు. కానీ దానిపై సరైన అవగాహన లేక ఎందరో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించి ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్​ డే చేస్తున్నారు. అసలు ఈ క్యాన్సర్ డే ప్రాముఖ్యత ఏంటి? దాని చరిత్ర, ఎలాంటి మార్పులు చేస్తే క్యాన్సర్​ను దూరం చేసుకోవచ్చు? రాకుండా నిరోధించవచ్చు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

క్యాన్సర్ దినోత్సవం ప్రాముఖ్యత 

క్యాన్సర్​ను ముందుగానే గుర్తించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సాహించడమే దీని ప్రాముఖ్యత. హెల్తీ లైఫ్​స్టైల్​తో క్యాన్సర్​ కేసులను నిరోధించవచ్చని.. ఎన్నో పరిశోధనలు తేల్చాయి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? శారీరక శ్రమ, జీవనశైలిలో మార్పులతో క్యాన్సర్ ప్రమాదాన్ని ఎలా తగ్గించాలో నిపుణులు సూచిస్తారు. 

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం థీమ్.. 

ప్రతి సంవత్సరం క్యాన్సర్​ డేని ఒక్కో థీమ్​తో చేస్తారు. ఈ ఏడాది 'యునైటెడ్ బై యూనిక్' అనే థీమ్​ని తీసుకొచ్చారు. క్యాన్సర్​ను దూరం చేసి వివిధ అంశాలపై దృష్టి సారించడమే దీని లక్ష్యం. 2025-2027 వరకు ఈ థీమ్​ని ఫాలో అవుతారు. 

క్యాన్సర్ నివారణ చర్యలు 

ప్రమాద కారకాలను తగ్గించడం వల్ల 30 నుంచి 50 శాతం క్యాన్సర్​లను నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అందుకే లైఫ్ స్టైల్​లో ఎలాంటి మార్పులు చేస్తే క్యాన్సర్​ని దూరం చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం. 

పోషకాహారం

బయటతినే ఫుడ్స్, సింథటిక్ కలర్స్, అన్​హెల్తీ ఫుడ్ క్యాన్సర్ కారకాలను పెంచుతుంది కాబట్టి. మీరు తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్​ ప్రోటీన్లతో నిండి ఆహారం ఉండేలా చూసుకోవాలి. ఇవి క్యాన్సర్ల నుంచి రక్షించడంలో హెల్ప్ చేస్తాయి. షుగర్​ని కూడా కట్ చేస్తే మంచిది.

వ్యాయామం

ఆరోగ్యంగా ఉండడంలో బరువు ముఖ్యపాత్ర పోషిస్తుంది. అధిక బరువు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది కాబట్టి.. బరువును తగ్గేందుకు శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. రెగ్యులర్​గా వ్యాయామ చేయడం మంచిది. కనీసం వారానికి 150 నిమిషాలు అయినా వర్క్​అవుట్ చేసేలా చూసుకోవాలి. 

పొగాకు, మద్యం

క్యాన్సర్​కు ప్రధాన కారణం పొగాకు. ప్రపంచవ్యాప్తంగా దీనివల్ల ఊపిరితిత్తులు, గొంతు, నోటి క్యాన్సర్​ కేసులు నమోదవుతున్నాయి. అందుకే ధూమపానాని దూరంగా ఉండడం కాదు పూర్తిగా మానేయాలని చెప్తున్నారు. అలాగే ఆల్కహాల్ వల్ల లివర్, బ్రెస్ట్, అన్నవాహిక క్యాన్సర్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ కూడా తగ్గించడం లేదా మానేస్తే మంచిది. 

సూర్యరశ్మి నుంచి జాగ్రత్త

ఎండతో విటమిన్ డి అందుతుంది ఇది ఆరోగ్యానికి మంచిదే కానీ.. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు చర్మానికి అస్సలు మంచివి కావు. కాబట్టి ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా.. వెళ్లినా చర్మాన్ని రక్షించుకునేలా డ్రెస్​లు వేసుకోవాలి. దీనివల్ల చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. క్యాన్సర్​ ప్రమాదాలు తగ్గుతాయి. 

ఇవే కాకుండా ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, మెడిటేషన్ ఫాలో అయితే మంచిది. రెగ్యులర్​గా మెడికల్ చెకప్​లు చేయించుకోవాలి. దీనివల్ల ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవచ్చు. HPV టీకాలు తీసుకుంటే గర్భాశయ, ఇతర క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గుతుంది. హెపటైటిస్ బి వ్యాక్సిన్ కాలేయ క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది. ఇలాంటి వ్యాక్సిన్లు గురించి తెలుసుకోవాలి. ఈ మార్పులు చేస్తూ.. హెల్తీగా ఉంటే క్యాన్సర్​ను ఈజీగా దూరం చేసుకోవచ్చు. 

Also Read : పెర్​ఫ్యూమ్ ఎక్కువగా వాడుతున్నారా? అయితే జాగ్రత్త సంతాన సమస్యలు రావొచ్చు.. రూమ్ ఫ్రెషనర్స్​తో కూడా

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget