By: Haritha | Updated at : 10 Jun 2023 12:53 PM (IST)
(Image credit: Pixabay)
మహిళల కంటే పురుషులకు గుండెపోటు వచ్చే అవకాశాలు రెండింతలు ఎక్కువని గతంలో చేసిన చాలా అధ్యయనాలు చెప్పాయి. అయితే మెట్రోపాలిటన్ నగరాల్లో నివసిస్తున్న మహిళలు కూడా అధికంగా గుండెపోటుకు గురవుతున్నారు. మహిళల్లో పెరుగుతున్న గుండెపోటు కేసులుపై అధ్యయనాలు సాగుతున్నాయి. ఇలా మహిళల్లో గుండెపోటు పెరగడానికి ప్రధాన కారణాలను వైద్యులు వివరిస్తున్నారు. మెట్రోపాలిటన్ నగరాల్లో నివసించే మహిళలు ఎక్కువగా ధూమపానం చేస్తున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి వారు ధూమపానాన్ని ఎంచుకున్నారు. ఉద్యోగ ప్రపంచంలో కలిగే ఒత్తిడి, కుటుంబ ఒత్తిడిని తగ్గించుకునేందుకు వారు ధూమపానానికి, మద్యపానానికి అలవాటు పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా ధూమపానం చేసే మహిళల్లో గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడే మహిళల్లో కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండెపోటు లక్షణాలు కాస్త భిన్నంగా ఉంటాయి. వారికి ఎడమవైపు ఛాతీ నొప్పి రాకపోవచ్చు. దానికి బదులుగా భుజాలలో నొప్పి రావడం, దవడలు నొప్పిగా అనిపించడం, చేతులకు రెండు వైపులా నొప్పి రావడం, విపరీతంగా చెమట పట్టడం వంటివి జరుగుతాయి. ఒకప్పుడు పురుషులకు గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ అని చెప్పిన విషయం నిజమే కానీ ఇప్పుడు పురుషులు, మహిళలు ఇద్దరూ సమానంగా గుండె జబ్బుల ప్రమాదంలో ఉన్నారు. కాకపోతే మహిళలు గుండెపోటుకు తక్కువ గురవ్వడానికి కారణం వారి శరీరంలో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్లు. ఈస్ట్రోజన్ హార్మోన్లలో సమతుల్యత దెబ్బ తింటే వారిలో కూడా గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది. మహిళల జీవన శైలిలో మార్పు రావడం, పని ఒత్తిడి పెరగడం, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం, జంక్ ఫుడ్ అలవాట్లు పెరగడం, వ్యాయామం చేయకపోవడం, ధూమపానం ఇవన్నీ కూడా మహిళల్లో గుండెపోటు పెరగడానికి కారణం అవుతున్నాయి. మహిళలు జీవితంలో ఒత్తిడిని తగ్గించుకొని, విశ్రాంతి తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు. మానసిక ఆరోగ్యం పై కూడా శ్రద్ధ పెట్టాలని చెబుతున్నారు. మానసిక ఆరోగ్యం బాగుంటే శారీరక ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. దీనివల్ల గుండెపోటు వంటివి వచ్చే అవకాశం తగ్గుతుంది.
గుండెకు మేలు చేసే ఆహారాన్ని అధికంగా తింటూ ఉండాలి. చేపలు, ఆకుపచ్చని కూరగాయలు, టొమాటోలు వంటివి అధికంగా తినాలి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీలు, నట్స్, డార్క్ చాక్లెట్లు వంటివి అధికంగా తింటే మంచిది.
Also read: ఈ నల్ల కోడిమాంసాన్ని తింటే మంచి రుచే కాదు, ఎంతో ఆరోగ్యం కూడా
Also read: వేసవిలో రోజూ చిన్న బెల్లం ముక్క తినడం వల్ల అలాంటి సమస్యలన్నీ దూరం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Children Memory Booster: మీ పిల్లలకి జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ పండ్లు తినిపించండి
Lemon: ఈ ఆహార పదార్థాలతో నిమ్మకాయ జోడించకపోవడమే ఉత్తమం
ButterMilk: చలువ చేస్తుందని మజ్జిగ అతిగా తాగుతున్నారా? ఈ సైడ్ ఎఫెక్టులు రావచ్చు
Stress: అధికంగా ఒత్తిడికి గురవుతున్నారా? జాగ్రత్త క్యాన్సర్ బారిన పడతారు
Pineapple Halwa: ఒక్కసారి పైనాపిల్ హల్వా తింటే మీకు ఇంకే హల్వా నచ్చదు, రెసిపి ఇదిగో
Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు
BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?
Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత
Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు
/body>