Wife Throws Boiling Water: భర్త కలలోకి మరో మహిళ, జననాంగాలపై మరిగిన నీళ్లుపోసిన భార్య!
తన భర్త కలలో కూడా పరాయి స్త్రీని కలవరించకూడదనేది ఆ మహిళ కాన్సెప్ట్. సో, భర్త వేరే మహిళ గురించి కలగన్నాడు. వెంటనే దానికి పెద్ద శిక్ష అనుభవించాడు.
తన భర్త తనకే సొంతం కావాలని ప్రతి భార్య కోరుకుంటుంది. కనీసం కలలో కూడా పరాయి మహిళకు స్థానం ఇవ్వకూడదని అనుకుంటుంది. మొదటిది సాధ్యమే.. కానీ, కలలుగనే స్వాతంత్ర్యం కూడా భర్తకు లేదా? అనేగా మీరు అడిగేది. దీనికి సరైన సమాధానం మీకు ఎక్కడా దొరకదు. పొరపాటున కూడా ఈ ప్రశ్న మీ భార్యను అడిగే సాహసం చేయొద్దు. ఒక వేళ మీరు ఆ ప్రశ్న అడిగేందుకు డిసైడ్ అయిపోయినట్లయితే.. ముందుగా బొలీవియాలో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి తెలుసుకోండి.
లా పాజ్ నగరంలో నివసిస్తున్న 45 ఏళ్ల వ్యక్తి నిద్రలో ఓ మహిళలను తలచుకున్నాడు. అంతేకాదు, ఆమె గురించి కలవరిస్తూ.. ఐ లవ్ యూ కూడా చెప్పేశాడు. అంతే, అప్పటికే నిద్రలేచి తన భర్త కలవరింతలను ఏకాగ్రతతో వింటున్న భార్యకు చిర్రెత్తుకొచ్చింది. అయితే, అతడి కలను మాత్రం డిస్ట్రబ్ చేయలేదు. వంటగదిలోకి వెళ్లి కుండలో నీటిని మరిగించింది. బాగా మరిగాయని డిసైడ్ అయిన తర్వాత.. చాలా జాగ్రత్తగా ఆ నీటిని తీసుకొచ్చి భర్త మర్మాంగాలపై పోసింది. ఆ బాధను తట్టుకోలేక అతడు విలవిల్లాడాడు. అతడి అరుపులు విన్న స్థానికులు అతడిని హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు అతడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో అతడి చేతులు, మర్మాంగాలకు కాలిన గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. అతడు నిద్రలో మరో స్త్రీని కలవరించడం వల్ల తనకు కోపం వచ్చిందని భార్య తెలిపింది. అయితే, ఆమె భర్తపై దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఓసారి అతడిపై మద్యం పోసి నిప్పంటించే ప్రయత్నం కూడా చేసిందట. కానీ, ఏ కారణం వల్ల ఆమె అప్పట్లో ఆగ్రహానికి గురైందనే విషయం మాత్రం తెలియరాలేదు. అయితే, అతడు మళ్లీ పడక సుఖానికి పనికి వస్తాడో లేదో అనేది డౌటే!
భర్తను అమ్మేసే భార్యలు కూడా ఉంటారు: ‘శుభలగ్నం’లో ఆమని తన భర్త జగపతి బాబును రోజాకు అమ్మేయడం గురించి మీకు తెలిసిందే. అయితే, ఈ ఇల్లాలు ఆమె కంటే ముదురు. తన ఇంటితోపాటు తన మాజీ భర్తను కూడా కొనేస్తే రాయితీ కల్పిస్తామని ప్రకటించింది. అయితే, ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. ఆమె భర్తను కొనే వ్యక్తి ఆ ఇంట్లో అతడికి పునరావాసం కల్పిస్తే చాలు. సంసారం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకలా అని అనుకుంటున్నారా? అయితే, పనామాలో ఏం జరిగిందో చూడండి.
ఫ్లొరిడాకు చెందిన క్రిస్టల్ బాల్ అనే 43 ఏళ్ల మహిళ పనామా సిటీలోని బీచ్ ప్రాపర్టీని విక్రయించాలని నిర్ణయించుకుంది. మూడు బెడ్‌రూమ్‌లు, రెండు బాత్‌రూమ్‌లు, డాబా, పూల్, హాట్ టబ్‌తోపాటు తన మాజీ భర్త రిచర్డ్ చౌలౌను కూడా కొనుగోలు చేయాలని తెలిపింది. ఏడేళ్ల సంసారం తర్వాత వీరిద్దరు ఇటీవలే విడాకులు తీసుకున్నారు. విడిపోయిన తర్వాత కూడా వారు తమ పిల్లల బాధ్యతలను చూసుకుంటున్నారు. వ్యాపారాలను కూడా కలిసే చూసుకుంటున్నారు.
ఆ ఇంటి యాజమానికి రిచర్డ్ భారం కాబోడని, ఆయన్ని ఆ ఇంట్లో ఉండనిస్తే వంట, పరిశుభ్రత, మరమ్మతులు తదితర పనుల్లో సాయం చేస్తాడని ఆ ప్రకటనలో తెలిపింది. ‘‘రిచర్డ్ మంచి చెఫ్. ఆయన అద్భుతమైన బోజనాన్ని వండుతాడు. బట్టతల వల్ల తలను ఎక్కువగా కవర్ చేసుకుంటాడు’’ అని పేర్కొంది. అయితే, ఈ ఇంటిని అమ్మే బాధ్యతలు తీసుకోడానికి ఏజెంట్లు ఆసక్తి చూపడం లేదు. ఆమె పెట్టిన కండీషన్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఆ లిస్టింగ్ నుంచి పలుసార్లు తొలగించారు. అయితే, క్రిస్టల్ బాల్ మాత్రం.. తప్పకుండా తన ఇల్లు, మాజీ భర్తను ఎవరో ఒకరు కొనుగోలు చేస్తారనే ఆశతో ఎదురుచూస్తోంది.
Also Read: ఈ స్కూల్‌లో ముగ్గురే విద్యార్థులు.. వీరికి చదువు చెబితే రూ.57 లక్షలు జీతం, ఎక్కడో తెలుసా?
Also Read: తెలుగు ప్రజలు ఇతర రాష్ట్రాల లాటరీ టికెట్లను కొనొచ్చా? ఏయే రాష్ట్రాలు అనుమతిస్తున్నాయి?