అన్వేషించండి
Changes in Fingers and Nails : చేతులు, గోళ్లలో కనిపించే ఈ 5 మార్పులు.. తీవ్రమైన వ్యాధికి సంకేతం కావచ్చు, వైద్యులు హెచ్చరికలివే
Hidden Diseases of Nail Changes : చేతులు, గోళ్లలో కనిపించే కొన్ని మార్పులు శరీరంలో కొన్ని లోపాలను హైలెట్ చేస్తాయి. అలాంటి మార్పులు వస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దని చెప్తున్నారు నిపుణులు.
గోళ్లలో కనిపించే ఈ మార్పులు ఆరోగ్య ప్రమాదానికి హెచ్చరికలు
1/5

వేళ్ల చివరలు గుండ్రంగా మారిపోతాయి. గోర్లు ముందుకు వంగి కనిపిస్తాయి. నిపుణులు దీని గురించి వివరిస్తూ.. శరీరంలోని మెగాకారియోసైట్లు ఊపిరితిత్తులను దాటి వేళ్లకు చేరుకుని అక్కడ వృద్ధి కారకాలను విడుదల చేసినప్పుడు ఇలా జరుగుతుందని చెప్తున్నారు. ఈ మార్పు సాధారణంగా దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, సిస్టిక్ ఫైబ్రోసిస్, పల్మనరీ ఫైబ్రోసిస్, బ్రోన్కియెక్టాసిస్ లేదా గుండె జబ్బు, ఎక్కువ కాలం తక్కువ ఆక్సిజన్ తీసుకునేవారిలో ఈ పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. అలాంటప్పుడు వేళ్లు అకస్మాత్తుగా లావుగా, గుండ్రంగా మారుతాయట. ఈ మార్పు గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
2/5

ఐరన్ లోపం రక్తహీనతకు ప్రారంభ సంకేతం. ఇందులో గోర్లు చాలా పలుచగా మారి.. వాటి ఉపరితలం లోపలికి మునిగిపోయి చెంచా లాగా కనిపిస్తాయి. దీని గురించి నిపుణులు ఏమంటున్నారంటే.. ఇది ఐరన్ లోపం, పీరియడ్స్లో రక్తస్రావం అధికంగా ఉండడం, గర్భధారణ, పోషకాహార లోపం లేదా ఏదైనా తీవ్రమైన వ్యాధికి సంకేతం కావచ్చని చెప్తున్నారు. గోళ్లలో ఈ మార్పులు ఎక్కువకాలం ఉంటే తప్పక జాగ్రత్త తీసుకోవాలి.
Published at : 15 Dec 2025 07:17 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















